తియ్యదనం కోసం పంచదార వేసుకుంటారు. కానీ తీపితో పాటు పోషకాలు కూడా కావాలంటే బెల్లం ఉత్తమం. బెల్లం అద్భుతమైన ఆహారం. చక్కెరకి ప్రత్యామ్నాయంగా అనేక వంటకాల్లో దీన్ని ఉపయోగిస్తారు. ఇది శుద్ధి చేసిన చక్కెర కంటే చాలా మంచిది. అయితే దీన్ని తరచూ తీసుకోవడం వల్ల ఊపిరితిత్తుల క్లీన్ అవుతాయనే ప్రచారం ఉంది. ఇంతకీ అది నిజమేనా? బెల్లం తింటే నిజంగానే ఊపిరితీత్తులు క్లీన్ అవుతాయా?


బెల్లం తినడం వల్ల ఐరన్ లభిస్తుంది. ఇందులో కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, ఫాస్పరస్ వంటి పోషకాలు, ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. అందుకే రోజూ పిల్లలకి ఒక చిన్న బెల్లం ముక్క తినిపించడం వల్ల మంచిదేనని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. బెల్లం పౌడర్ పాలల్లో కలిపి పిల్లలకి తాగించొచ్చు. పిల్లలకి జలుబు, దగ్గు సమయంలో అల్లం, తులసి ఆకులు, బెల్లం కలిపి ఇస్తే తగ్గిపోతుంది. బెల్లం తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అందుకే సిమెంట్ తయారీ కర్మాగారాలు, థర్మల్ ప్లాంట్లలో పని చేసే కార్మికులకి పనికి వెళ్ళడానికి ముందు తప్పనిసరిగా బెల్లం ముక్క తినమని ఇస్తారు. ఇది తినడం వల్ల ఊపిరితిత్తులని కాలుష్యం బారిన పడకుండా కాపాడుకోవచ్చు.


ఊపిరితిత్తులని శుభ్రం చేసేందుకు బెల్లం?


ఢిల్లీ, ముంబై వంటి ప్రధాన నగరాల్లో రోజు రోజుకీ వాయు కాలుష్యం పెరిగిపోతుంది. AQI స్థాయిలు దిగజారిపోతున్నాయి. దీని వల్ల శ్వాస రుగ్మతల కేసులు పెరిగిపోతున్నాయని ఆరోగ్య నిపుణులు ల్యూక్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వాయు కాలుష్యం వల్ల ఊపిరితిత్తులు చెడిపోయే ప్రమాదం ఉంది. అందుకే జీవనశైలిలో మార్పులు చేసుకోవాలని ఆయన సూచిస్తున్నారు. తరచుగా బెల్లం తినడం వల్ల ఊపిరితిత్తులని కాపాడుకోవచ్చని అంటున్నారు. పేద వాడి చాక్లెట్ గా పిలిచే బెల్లం నేచురల్ స్వీటనర్. బెల్లం తినడం వల్ల ఊపిరితిత్తులు శుభ్రపడతాయని శాస్త్రీయంగా నిరూపితమైందని ఆయన చెప్పుకొచ్చారు. ఇది బ్రోన్కైటిస్, వీజింగ్, ఉబ్బసం, ఇతర శ్వాస రుగ్మతలకు ప్రభావవంతమైన నివారణగా పని చేస్తుంది.


బెల్లం వల్ల ప్రయోజనాలు


బెల్లం ఆరోగ్యకరమైన ఆహారం. మలబద్ధకాన్ని తగ్గిస్తుంది. రక్తాన్ని శుద్ధి చేస్తుంది. శరీరానికి కావాల్సిన ఐరన్ అందిస్తుంది. రోగనిరోధక శక్తి పెంచుతుంది. టీ, కాఫీ లో పంచదారకి బదులుగా బెల్లం పొడి వేసుకుని తాగొచ్చు. శీతాకాలంలో బెల్లం తినడం వల శరీరం వేడిగా ఉంటుంది. ఇది తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ (జిఐ) కలిగి ఉండటం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. అయితే మధుమేహులు కూడా దీన్ని తినొచ్చు. కానీ మితంగా మాత్రమే తీసుకోవాలి. అతిగా తింటే మాత్రం రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగే అవకాశం ఉంది.


బెల్లంతో రక్తహీనత సమస్య ఎదుర్కోవచ్చు. అమ్మాయిల్లో మొటిమల సమస్య వేధిస్తుంటే బెల్లం తినొచ్చు. ఇది చర్మాన్ని అందంగా మారుస్తుంది. రోగనిరోధక శక్తి పెంచడం ద్వారా మొటిమలు త్వరగా పోతాయి.


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.


Also Read: గ్లిజరిన్‌తో చక్కని అందం - కానీ ఈ జాగ్రత్తలు తప్పనిసరి