దేశంలో కరోనా కేసులు భారీగా తగ్గాయి. కొత్తగా 44,877 కరోనా కేసులు నమోదయ్యాయి. 1,17,591 మంది కరోనా నుంచి కోలుకున్నారు. యాక్టివ్ కేసుల సంఖ్య 5,37,045కు చేరింది. డైలీ పాజిటివిటీ రేటు 3.17గా ఉంది. రికవరీ రేటు 97.55గా ఉంది.







కరోనా కారణంగా ఒక్కరోజులో 684 మంది మృతి చెందారు. మరణాల రేటు 1.19గా ఉంది. 


వ్యాక్సినేషన్







దేశంలో ఇప్పటివరకు మొత్తం 172.81 కోట్ల వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.





రాష్ట్రాల వారీగా



  • కేరళలో కొత్తగా 15,184 కరోనా కేసులు నమోదయ్యాయి.

  • మహారాష్ట్రలో కొత్తగా 4,359 కొవిడ్ కేసులు వెలుగుచూశాయి. 32 మంది మృతి చెందారు. ముంబయిలో తాజాగా 349 కేసులు నమోదయ్యాయి.

  • మధ్యాప్రదేశ్‌లో కొత్తగా 2,438 పైగా కేసులు నమోదయ్యాయి. ఏడుగురు కరోనాతో మృతి చెందారు.

  • దిల్లీలో కరోనా కేసులు తగ్గుతున్నాయి. కొత్తగా 920 కరోనా కేసులు నమోదయ్యాయి. 13 మంది మృతి చెందారు.

  • ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 896 కేసులు నమోదయ్యాయి.


Also Read: Talking on Phone While Driving: ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయవచ్చు, ఏ చలానాలు విధించరు !


Also Read: PM Modi: ప్రధాని మోదీ పర్యటనలో భద్రతాలోపం, అంబులైన్స్ లో వైద్యులు మిస్సింగ్!