చైనా ఇప్పటికే కరోనా వైరస్ కోరల్లో మళ్లీ చిక్కుకుంది. ఒమిక్రాన్ ఉప వేరియంట్ BF.7 ఆ దేశంలో అత్యంత వేగంగా పాకుతోంది. చైనాలో ఈ వేరియంట్ కేసుల సంఖ్య ప్రపంచాన్ని భయపెట్టేలా ఉంది. ఇది అన్ని వేరియంట్ ల కన్నా ఇది చాలా వేగంగా వ్యాప్తి చెందుతున్నట్టు కనిపెట్టారు శాస్త్రవేత్తలు.2020లో ప్రపంచాన్ని కమ్మేసిన కోవిడ్ తరువాత అనేక రకాలుగా పరివర్తన చెందుతూ వస్తోంది. అన్ని వేరియంట్లలో ఒమిక్రాన్ ఎక్కువ కాలం పాటూ ఆధిపత్యాన్ని చెలాయిస్తోంది.ఈ వేరియంట్ కు చెందినదే ఇప్పుడు చైనాని కుదిపేస్తున్న BF.7. 


టీకా వేసుకున్నా...
ఈ BF.7 వేరియంట్ టీకా వేసుకున్న వారిని కూడా వదలడం లేదు. చైనాలో వ్యాక్సినేషన్ పూర్తియన వారికి కూడా ఇది సోకడం కలవరానికి గురిచేస్తోంది. నివేదికల ప్రకారం, BF.7 వేరియంట్ ఎక్కువగా  ఊపిరితిత్తుల్లో ఎగువ శ్వాసకోశాన్ని ఎక్కువగా ప్రభావితం చేస్తన్నట్టు, దీని వల్ల ప్రాణాంతకంగా మారుతున్నట్టు గుర్తించారు.


BF.7 వేరియంట్ లక్షణాలు
అన్ని వేరియంట్లలాగే దీని లక్షణాలు సాధారణంగానే ఉన్నాయి. 
1. జ్వరం
2. దగ్గు
3. గొంతుమంట
4. ముక్కు కారడం
5. విపరీతమైన అలసట
6. కొందరిలో వాంతులు, విరేచనాలు
7. పొట్టలో ఇబ్బందిగా అనిపించడం


వేవ్ వస్తే...
మరొక్కసారి BF.7వేవ్ రూపంలో వస్తే తట్టుకోవడం కష్టమేనని చెబుతున్నారు. కనీసం పది లక్షల మంది దీని బారిన పడి మరణించే అవకాశం ఉన్నట్టు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా బలహీనమైన రోగనిరోధక శక్తి కలిగి ఉన్న వారికి ఇది త్వరగా సోకుతుంది.  కాబట్టి ఆహార పరంగా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇనుము, ప్రొటీన్ అధికంగా ఉండే ఆహారాన్ని రోజూ తీసుకోవాలి.



అధ్యయనం ప్రకారం, జనాభాలో 85% మంది బూస్టర్  డోస్ కూడా తీసుకున్నారు. కాబట్టి కాస్త వ్యాప్తి నెమ్మదించే అవకాశం ఉంది. అయినా కూడా చైనాలో 60 శాతం కంటే ఎక్కువ మంది జనాభా మూడు నెలల్లో ఈ వేరియంట్ బారిన పడే అవకాశం ఉంది. ఈ వేరియంట్ సోకిన ఒక వ్యక్తి దాదాపు 10 నుంచి 18 మందికి దీన్ని వ్యాప్తి చెందించగలడు. అందుకే అందరూ మళ్లీ మాస్కులు ధరించాల్సిన అవసరం ఉంది. 


Also read: సెలవురోజుల్లో వచ్చే ‘హార్ట్ సిండ్రోమ్’ గురించి తెలుసా? దీని సంకేతాలు ఎలా ఉంటాయంటే










గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.