డయాబెటిస్ రోగులకు శరీరంలో తగినంత ఇన్సులిన్‌ను ఉత్పత్తి కాదు. ఫలితంగా రక్తంలో చక్కెర శాతం పెరుగుతుంది. ఫలితంగా ఇది మన శరీరంలో అనేక అవయవాలపై ప్రభావం చూపిస్తుంది. రక్తంలో చక్కెర శాతం పెరిగే కొద్దీ మల్టిపుల్ డిజార్డర్స్ వచ్చే అవకాశం ఉంది. డయాబెటిస్ ఉన్నవారు రక్తంలో చక్కెర శాతం పెంచే ఆహార పదార్థాలకు సైతం దూరంగా ఉండాలని డాక్టర్లు చెబుతున్నారు. ప్రతి ఆహారం గ్లైసెమిక్ ఇండెక్స్ (GI) స్కోర్‌ చూసి తినడం వల్ల రక్తంలో షుగర్ స్థాయి పెరగదని నిపుణులు సూచిస్తున్నారు. GI స్థాయిని చూసి ఫుడ్ తినడం ప్లాన్ చేసుకుంటే అధిక కార్బోహైడ్రేట్ లను తినకుండా  నివారించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ఇక మన ఆయుర్వేదంలో మధుమేహానికి వెల్లుల్లి  ఔషధంగా పనిచేస్తుందని శాస్త్రీయంగా రుజువైంది. 


వెల్లుల్లి పోషకాలు:


వెల్లుల్లిలో కాల్షియం, ఐరన్, కాపర్, పొటాషియం  ఫాస్పరస్ పుష్కలంగా ఉన్నాయి. ఈ లక్షణాలు దీనిని అద్భుతమైన ఔషధంగా చేస్తాయి. ఐరన్ రక్త ప్రసరణను పెంచుతుంది. కాల్షియం ఎముకలను బలపరుస్తుంది. ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో కాపర్  పొటాషియం ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. 


వెల్లుల్లి డయాబెటిస్ తగ్గడానికి దోహదం చేస్తుందని పరిశోధనలో వెల్లడైంది:


2006లో నిర్వహించిన ఒక అధ్యయనం ప్రకారం, పచ్చి వెల్లుల్లి రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది, అలాగే అథెరోస్క్లెరోసిస్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. 2014 పరిశోధనలో  క్రమం తప్పకుండా వెల్లుల్లి వినియోగం రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుందని పేర్కొంది. వెల్లుల్లి విటమిన్ B6,  Cలకు  మంచి మూలం. విటమిన్ B6 కార్బోహైడ్రేట్ జీవక్రియలో పాల్గొంటుంది. రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడంలో విటమిన్ సి కూడా ముఖ్య పాత్ర పోషిస్తుంది.


వెల్లుల్లి తినడం గుండె ఆరోగ్యానికి మంచిది:


అన్ని వయస్సులవారు వెల్లుల్లిని సురక్షితంగా తీసుకోవచ్చు. దీని రుచి, వాసన కాస్త ఘాటుగా ఉన్నప్పటికీ, వెల్లుల్లిలో అనేక రకాల బయోయాక్టివ్ సమ్మేళనాలు ఉంటాయి. ఇవి మీ శరీరాన్ని అనేక వ్యాధుల నుండి రక్షిస్తాయి. వీటిలో గుండె జబ్బుల నుంచి చర్మ సంబంధిత వ్యాధుల వరకు అన్నీ ఉన్నాయి. వెల్లుల్లిని తీసుకోవడం వల్ల గుండె జబ్బులు కూడా తగ్గుతాయి.


వెల్లుల్లి ఈ వ్యాధులను నయం చేస్తుంది:


⦿ వెల్లుల్లి రక్తంలో  కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్  బ్లడ్ లిపిడ్ స్థాయిలను తగ్గించడం ద్వారా గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.


⦿ వెల్లుల్లి రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుంది. అందుకే అధిక కొలెస్ట్రాల్ స్థాయిలు హై బీపీ తగ్గించడంలో సహాయపడటానికి వెల్లుల్లిని తినమని నిపుణులు సిఫార్సు చేస్తున్నారు.


⦿ వెల్లుల్లిని తినడం ద్వారా ట్యూమర్ల వంటి ప్రభావాలను నివారించవచ్చు.


⦿ ఇది క్యాన్సర్ కణాల పెరుగుదలను నిరోధించడంలో కూడా సహాయపడుతుంది.


⦿ వెల్లుల్లిలో యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు ఉన్నాయి, దీని కారణంగా ఇది అనేక వైరల్ వ్యాధుల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది.


ఆహారంలో వెల్లుల్లిని ఎలా చేర్చుకోవాలి:


⦿ కూరగాయలు, పప్పు, కూరలకు బదులు వెల్లుల్లి చట్నీ చేసుకొని తినవచ్చు. పచ్చి వెల్లుల్లి పాయలను తింటే చాలా మంచి ఫలితాలను ఇస్తుంది.


⦿ మీరు వెల్లుల్లి  రుచి ఇష్టపడితే,  మీ  భోజనానికి ముందు తాజా వెల్లుల్లి  రెబ్బలను తినడం  వల్ల  చాలా మంచి ఫలితాలు పొందవచ్చు.


⦿ పచ్చి వెల్లుల్లి రెబ్బలను ఒక గ్లాసు నీళ్లతో కలిపి ఉదయాన్నే తాగడం వల్ల మీ జీర్ణక్రియ బాగుంటుంది  జీర్ణ  సమస్యలు కూడా దూరమవుతాయి.


Also Read : వంటకాలకు చింతచిగురు జతచేరిస్తే ఆ రుచే వేరు


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.