Eye Test For Heart Attack | గుండె ఎప్పుడు ఏ క్షణంలో ఆగుతుందో చెప్పలేం. అది అకస్మాత్తుగా వచ్చే కార్డియక్ అరెస్టు వల్ల కావచ్చు. లేదా దీర్ఘకాలిక గుండె సమస్యల వల్ల ఏర్పడే హార్ట్ ఎటాక్ వల్లైనా కావచ్చు. అందుకే, గుండె వద్ద లేదా ఎడమ వైపు శరీర భాగంలో ఏ మాత్రం అసౌకర్యంగా ఉంటే తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకుని, వైద్యుడి సలహా తీసుకోవాలి. ఆహారం, అలవాట్ల విషయంలో చాలా జాగ్రత్తలు పాటించాల్సి వస్తుంది. అప్పుడే.. గుండెతోపాటు మీ ఆయుష్సు కూడా పెరుగుతుంది. అలాగే, అలవాటులేని పనులు ఒక్కసారే చేసేయకూడదు. ముఖ్యంగా వ్యాయామం, పరుగు, బరువులు ఎత్తడం, అతిగా డ్యాన్స్ చేయడం వంటివి ఒకేసారి చేయకూడదు. 


ఇటీవల గుండె నొప్పితో చనిపోతున్నవారి సంఖ్య క్రమేనా పెరుగుతోంది. ముఖ్యంగా కోవిడ్-19 వైరస్ సోకిన తర్వాత గుండె సమస్యలు తీవ్రమైనట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కరోనాతో బాధపడి కోలుకున్న వ్యక్తులు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. అధిక కొవ్వు, తీవ్రమైన రక్తపోటు లేదా కరోనరీ ఆర్టరీ వ్యాధి వల్ల రక్తాన్ని చేరవేసే ధమనులలో అడ్డంకులు ఏర్పడతాయి. దీనివల్ల గుండెకు రక్త ప్రసరణ నిలిచిపోతుంది లేదా నెమ్మదించి గుండెపోటు ఏర్పడుతుంది. అయితే, గుండె సమస్యలను ముందుగానే అంచనా వేయొచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇంపీరియల్ కాలేజ్ లండన్‌లోని నేషనల్ హార్ట్ అండ్ లంగ్ ఇన్‌స్టిట్యూట్‌లోని నిపుణులు సి-రియాక్షన్ ప్రోటీన్ (CRP) స్థాయిలను కొలవడం ద్వారా మూడు సంవత్సరాల ముందుగానే గుండె జబ్బుల ప్రమాదాన్ని నిర్ధారించడం సాధ్యమని చెబుతున్నారు.


కంటి పరీక్షతో ఏడాదికి ముందే హార్ట్ ఎటాక్‌ను గుర్తించవచ్చు: 
❤ గుండె పోటు సమస్యను కంటి పరీక్షల ద్వారా కూడా నిర్ధరించవచ్చు. ఇందుకు పరిశోధకులు ‘ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిస్టమ్‌’ను అభివృద్ధి చేశారు. కంటి స్కాన్ ద్వారా రెటీనా రక్త నాళాలలో అతి చిన్న మార్పు ద్వారా వాస్కులర్ వ్యాధి, గుండెపోటు ప్రమాదాన్ని గుర్తించవచ్చని పరిశోధకులు పేర్కొన్నారు. యూనివర్శిటీ ఆఫ్ లీడ్స్‌లో శిక్షణ పొందిన పరిశోధకులు AI వ్యవస్థ కంటి స్కాన్‌లను పరిశీలించి స్పష్టమైన రిపోర్టు ఇస్తున్నారు. దీని ద్వారా గుండెపోటు ప్రమాదాన్ని ఏడాదికి ముందే అంచనా వేయొచ్చు. 


Also Read: రణరంగంలో రొమాన్స్, ఉక్రెయిన్ మహిళలకు రష్యా జవాన్లు వింత రిక్వెస్టులు, ఇదిగో ఇలా..


ఈ పరీక్ష ద్వారా మూడేళ్లకు ముందే ముప్పు అంచనా: 
❤ఇన్ఫెక్షన్లు లేదా మధుమేహం ఉన్నా వివిధ రక్త పరీక్షల ద్వారా గుండె సమస్యలను తెలుసుకోవచ్చు. వీరికి CRP పరీక్షలు చేస్తారు. 
❤ CRP అంటే గుండెపోటు సమస్య మొదలైన తర్వాత ఆ వ్యక్తి రక్తంలో కనిపించే ప్రోటీన్. 
❤ ప్రస్తుతం, వైద్యులు గుండెపోటును నిర్ధారించడానికి ట్రోపోనిన్ స్థాయిల కోసం రక్త పరీక్ష ఫలితాలను చూస్తున్నారు. 
❤ గుండె దెబ్బతిన్నప్పుడు రక్తంలో విడుదలయ్యే ప్రోటీన్‌ను CPR పరీక్ష ద్వారా గుర్తించవచ్చు. భవిష్యత్తులో ఏర్పడే గుండె సమస్యల ముప్పును క్లియర్‌గా చూపిస్తుంది. 
❤ CRP టెస్టు ఫలితాలను అంచనా వేయడం కోసం అనుమానాస్పద గుండెపోటుతో ఆసుపత్రిలో చేరిన 250,000 మంది రోగుల డేటాను విశ్లేషించారు.
❤ CRP స్థాయిలు సాధారణంగా 2 mg/L లేదా అంతకంటే తక్కువగా ఉంటాయి. 
❤ CRP స్థాయిలు 10-15 mg/Lకి పెరిగినప్పుడు గుండెపోటు వచ్చే ప్రమాదం 35 శాతం ఉన్నట్లు తెలుపుతుంది. ఫలితంగా చికిత్స పొందవచ్చు. 


Also Read: వొలోదిమిర్ జెలెన్‌స్కీ - నాడు నవ్వులు పంచిన కమెడియన్, నేడు ప్రజల కన్నీటిని తుడిచే నాయకుడు