Bigg Boss Non Stop: బిగ్ బాస్ నాన్ స్టాప్ సీజన్-1లో రెండో రోజు.. అందరి కంటే ముందే నిద్రలేచాడు ఆర్జే చైతూ. బిగ్ బాస్‌తో కబుర్లు చెబుతూ కాసేపు టైంపాస్ చేశాడు. సాధారణంగా బిగ్ బాస్ సీజన్లలో పాట వేసిన తర్వాతే అంతా నిద్రలేస్తారు. అయితే, ఈ సీజన్లో ఉదయం 10 గంటలు కావస్తున్నా బిగ్ బాస్ సాంగ్ వేయలేదు. దీంతో చైతూ, తేజస్వీ(తేజూ), అరియానా, సరయూ, హమీదాలు సాంగ్ కోసం వేచి చూస్తున్నారు. చైతూ తనకు ఎన్టీఆర్ పాట కావాలని చెప్పాడు. తనకు ‘‘చీమ చీమ..’’ పాట కావాలని తేజూ కోరింది. సరయూ తనకు మెగాస్టార్ సాంగ్ కావాలని అడిగింది.
గార్డెన్ ఏరియాలో కబుర్లు చెప్పుకుంటున్న సందర్భంలో అరియానా.. చైతూతో తమ గోవా టూర్‌ను గుర్తుచేసింది. ఈ సందర్భంగా తేజూ ‘‘నీకు అరియానా ముందే తెలుసా?’’ అని అడిగింది. ‘‘ఇండస్ట్రీలో ఐదేళ్ల నుంచి ఉంటున్నా.. నేను ఎవరికీ తెలియనా’’ అని అన్నాడు. ‘‘అంటే తెలియడం వేరు, స్నేహం వేరు కదా’’ అని తేజూ అంది. దీంతో చైతూ స్పందిస్తూ.. ‘‘బిగ్ బాస్ సీజన్-4 ముగిసిన తర్వాత అరియానా, నేను గోవా టూర్‌కు వెళ్లాం. అక్కడ మేము’’ అని చెబుతూ వేరే టాపిక్‌లోకి జంప్ అయ్యాడు. ప్రస్తుతం అంతా గార్డెన్ ఏరియాలో కూర్చొని ‘సాంగ్’కు డ్యాన్స్ చేద్దామని చూస్తున్నారు. సరిగ్గా 10 గంటలకు ‘భిమ్లా నాయక్’ సినిమాలోని ‘లా.. లా.. భీమ్లా’ పాటతో అందరినీ ‘బిగ్ బాస్’ మేల్కొలిపాడు.
బిగ్ బాస్ కంటెస్టెంట్లు వీరే:
వారియర్స్ టీమ్:
1. అషురెడ్డి (సీజన్ 3)
2. మహేష్ విట్టా (సీజన్ 3)
3. ముమైత్ ఖాన్ (సీజన్ 1)
4. అరియనా (సీజన్ 4)
5. నటరాజ్ మాస్టర్ (సీజన్ 5)
6. తేజస్వి మదివాడ (సీజన్ 2)
7. సరయు (సీజన్ 5)
8. హమీద (సీజన్ 5)
9. అఖిల్ సార్థక్ (సీజన్ 4)
ఛాలెంజర్స్:
1. ఆర్జే చైతు (ఆర్జే)
2. అజయ్ కతుర్వర్ (నటుడు)
3. స్రవంతి చొక్కారపు (యాంకర్)
4. శ్రీరాపాక (నటి)
5. అనిల్ రాథోడ్ (మోడల్)
6. మిత్రా శర్మ (నటి, నిర్మాత)
7. యాంకర్ శివ (యూట్యూబ్ యాంకర్)
8. బిందు మాధవి (హీరోయిన్)