Gut Health : చలికాలంలో అంటేనే జలుబు, దగ్గు వంటి వైరల్ ఇన్ఫెక్షన్లకు స్వాగతం పలుకుతుంటుంది. వణికించే చలికి తోడు వాతావరణ కాలుష్యం కూడా అనారోగ్యం బారినపడేవిధంగా చేస్తుంది. చలికాలంలో ఆహారం ఎక్కువ మొత్తంలో తీసుకుంటాం. ఈ క్రమంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడంపై ఫోకస్ పెట్టాలంటున్నారు ఆరోగ్య నిపుణులు. వైరల్ ఇన్ఫెక్షన్లు సోకకుండా గట్ ఆరోగ్యం పదిలంగా ఉంచుకోవడం కీలకమని సూచిస్తున్నారు. అసలు శీతాకాలంలో గట్ ఆరోగ్యం ఎందుకు దెబ్బతింటుందో ఇప్పుడు తెలుసుకుందాం. 


చలికాలంలో గట్ ఆరోగ్యం క్షీణించడానికి 4 కారణాలు ఇవే: 


1. ఆహార మార్పులు:


చలికాలం తరచుగా ఆహార విధానాలలో మార్పును తెస్తుంది. వెచ్చగా ఉండే ఆహారాలపై మనస్సు మళ్లుతుంది. దీంతో కొవ్వులు, కార్బోహైడ్రేట్లు, చక్కెరలు ఎక్కువగా ఆహారాలను ఎక్కువగా తినేందుకు ఆసక్తి చూపిస్తుంటాం. ఆహారంలో ఈ మార్పు గట్‌లోని మంచి, చెడు  బ్యాక్టీరియా సమతుల్యతను దెబ్బతీస్తుంది. దీంతో మొత్తం ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. 


2. తాజా ఉత్పత్తులను తగ్గించడం:


శీతాకాలం తాజా పండ్లు, కూరగాయలను తినడం తగ్గిస్తాం. వీటిలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. తాజా ఉత్పత్తులను తక్కువగా తీసుకుంటాం కాబట్టి శరీరానికి కావాల్సిన ఫైబర్ అందదు. ఫైబర్ ఆరోగ్యకరమైన పేగులకు కీలకం. ఎందుకంటే ఇది సాధారణ ప్రేగు కదలికలను ప్రోత్సహిస్తుంది. ప్రయోజనకరమైన గట్ బ్యాక్టీరియాను పోషిస్తుంది. తాజా ఉత్పత్తుల కొరత అనేది పేవుల అనారోగ్యానికి కారణం కావచ్చు. 


3. డీహైడ్రేట్:


చలికాలంలో చాలా మంది తక్కువగా నీరు తాగుతుంటారు. వాతావరణం చల్లగా ఉందని తరుచుగా నీటిని తీసుకోవడం తగ్గిస్తుంటారు. ఇది జీవక్రియ ప్రక్రియలపై హైడ్రేషన్ ప్రభావం చూపుతుంది. దీంతో జీర్ణక్రియ నెమ్మదిస్తుంది. శరీరం డీహైడ్రేషన్‌కు గురై గట్ సమస్యలకు దారి తీస్తుంది. 


4. విటమిన్ D లేకపోవడం:


శీతాకాలంలో సూర్యరశ్మికి తక్కువగా వెళ్తుంటాం. దీని వల్ల విటమిన్ D లోపానికి దారితీయవచ్చు. ఈ లోపం గట్ ఫ్లోరా, మొత్తం గట్ ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. 


చలికాలంలో పేగు ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి 7 చిట్కాలు ఇవే: 


1. సమతుల్య ఆహారాన్ని తీసుకోవడం:


చలికాలంలో సమతుల్య ఆహారం తీసుకోవడం మంచిది. తృణధాన్యాలు, చిక్కుళ్ళు, వేరు కూరగాయలు వంటి ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలను పుష్కలంగా చేర్చండి. పెరుగు, కిమ్చి లేదా సౌర్‌క్రాట్ వంటి పులియబెట్టిన ఆహారాలు ఆరోగ్యకరమైన గట్ మైక్రోబయోమ్‌ను నిర్వహించడంలో సహాయపడతాయి.


2. హైడ్రేటెడ్ గా ఉండండి:


రోజంతా తగినంత మొత్తంలో నీరు త్రాగడానికి ప్రయత్నించండి. హెర్బల్ టీలు, నిమ్మకాయతో కూడిన గోరువెచ్చని నీరు చల్లటి వాతావరణంలో హైడ్రేట్ గా ఉండటానికి అద్భుతమైన ఎంపికలు.


3. ‘విటమిన్ డి’ని సప్లిమెంట్స్ తీసుకోండి:


శీతాకాలంలో సూర్యకాంతి పరిమితంగా ఉంటుంది కాబట్టి, వైద్యులను సంప్రదించి తర్వాత ‘విటమిన్ డి’ సప్లిమెంట్లను తీసుకోవడానికి ప్రయత్నించండి. ఇది విటమిన్ స్థాయిలను నిర్వహించడంలో సహాయపడటమే కాకుండా గట్ ఆరోగ్యాన్ని కాపాడుతుంది. 


4. క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి:


చలికాలంలో బయటకు వెళ్లి వ్యాయామం చేయడం కాస్త కష్టంగానే ఉంటుంది. అయినప్పటికీ ఇంట్లో యోగా, వ్యాయామం వంటివి చేయండి. ఇలా చేయడం వల్ల జీర్ణక్రియను ప్రోత్సహిస్తుంది. శరీరాన్ని కదలకుండా ఉంచడానికి యోగా, ఇంటి వ్యాయామాలు లేదా ఇంటి లోపల నడిచేందుకు ప్రయత్నించండి.


5. ఒత్తిడిని తగ్గించుకోండి:


ఒత్తిడి గట్ ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ధ్యానం, లోతైన శ్వాస వ్యాయామాలు వంటివి ఒత్తిడిని తగ్గిస్తాయి. వీటిని క్రమం తప్పకుండా చేసేందుకు ప్రయత్నించండి. 


6. ప్రోబయోటిక్స్, ప్రీబయోటిక్స్:


మీ ఆహారంలో ప్రోబయోటిక్, ప్రీబయోటిక్ అధికంగా ఉండే ఆహారాలు లేదా సప్లిమెంట్‌లను చేర్చుకోండి. ప్రోబయోటిక్స్ ప్రేగులకు ప్రయోజనకరమైన బ్యాక్టీరియాను అందిస్తాయి. అయితే ప్రీబయోటిక్స్ ఈ బ్యాక్టీరియాను పోషించి, ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థకు సహాయపడతాయి. 


7. నిద్రకు ప్రాధాన్యత ఇవ్వండి:


పేగు ఆరోగ్యంతో సహా మొత్తం ఆరోగ్యానికి మంచి నిద్ర చాలా అవసరం. అంతరాయం కలిగించే నిద్ర విధానాలు జీర్ణక్రియపై ప్రభావం చూపుతాయి. మీరు ప్రతిరోజూ 8 గంటలు నిద్రపోవాలి.


Also Read: నెలసరి సెలవులు ఇచ్చే ఆలోచనే లేదు, అదేం వైకల్యం కాదు - తేల్చి చెప్పిన స్మృతి ఇరానీ


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.