ఎంతో గాఢంగా ప్రేమించిన అమ్మాయి బ్రేకప్ చెబితే.. ప్రియుడికి హార్ట్ బ్రేక్.


నచ్చినవాళ్లు అనుకోకూండా దూరమైతే అదో రకం హార్ట్ బ్రేక్. 


వ్యాపారంలో నష్టాలు, ఉద్యోగాన్ని కోల్పోవడం ఒకరకమైన హార్ట్ బ్రేక్.


పిల్లలు పెద్దయ్యాక బాగోగులు పట్టించుకోకపోతే తల్లిదండ్రులకు హార్ట్ బ్రేక్.


ఇలా చెబుతూ పోతే.. హార్ట్ బ్రేక్‌కు అంతే ఉండదు. మరి, హార్ట్ ఎటాక్‌కైతే మందులున్నాయి. మరి, మనసుకు సంబంధించిన ‘హార్ట్ బ్రేక్’ను నయం చేయడం ఎలా? ఆందోళన వద్దు.. గుండెను రక్షించే మందులే.. పగిలిన గుండెను అతికిస్తాయట కూడా. అదెలాగో చూడండి. 


 హార్ట్ బ్రేక్ జీవితంలో ఏదో ఒక కారణంతో దాదాపు అందరికీ అనుభవంలో ఉంటుంది. అయితే కొందరిలో అది కొంత కాలానికి గాయం మానిపోయి మామూలై పోతుంటారు. కొందరు మాత్రం తట్టుకోలేక తిండి మానేయ్యడం లేదా అతిగా తినడం, డిప్రెషన్ కు లోనవడం, ఇంకొందరైతే బాధ భరించలేక హత్మహత్యలకు సైతం పాల్పడుతుంటారు.  దీన్ని మనోవ్యథగా చెప్తారు. మనోవ్యథకు మందులేదు అని కూడా నానుడి ఉంది. కానీ దీనికి కూడా మందుందని అంటున్నారు శాస్త్రవేత్తలు. 


ప్రొప్రొననాల్ అనే బీటా బ్లాకర్ హార్ట్ ఎటాక్ ను నివారించడానికి వాడతారు. ఇది ఇలా బాధ వల్ల కలిగే గుండెనొప్పికి మంచి పరిష్కారమని కొత్త ఆవిష్కరణ ద్వారా చెబుతున్నారు. విపరీతమైన బాధలో ఉన్నవారికి గుండె పట్టేసినట్లుగా ఉంటుంది. దీని నుంచి ఈ మెడిసిన్ రిలీఫ్  ఇస్తున్నట్టు నిపుణులు చెబుతున్నారు. దీనికోసం నిర్వహించిన అధ్యయనంలో పాల్గొన్న వారిలో 72 శాతం మంది తమకు ఉపశమనం లభించినట్టుగా చెప్పారట.


బీటా బ్లాకర్లను సాధారణంగా బీపి అదుపులో ఉంచటానికి, యాంగ్జైటీకి, కొన్ని సార్లు హార్ట్ ఫేయిల్యూర్ సమస్యలోనూ వాడుతారు. ఫైట్ ఆర్ ఫ్లైట్ ను ప్రేరేపించే అడ్రినలిన్ ను నియంత్రణలో ఉంచడం ద్వారా హార్ట్ బీట్ ను అదుపు చేస్తుంది. జర్నల్ ఆఫ ఎఫెక్టివ్ డిజార్డర్స్ లో ప్రచురితమైన ఆర్టికల్ ను అనుసరించి ఈ బీటా బ్లాకర్ ను లాంగ్ సైడ్ థెరపీగా వాడితే హార్ట్ బ్రేక్ కు విపరీతంగా స్పందించే వారిలో మంచి మార్పు కనిపిస్తుందని అంటున్నారు.  కెనడాకు చెందిన యూనివర్సిటి అఫ్ ఒట్టావా దీని గురించి ఒక చిన్న అధ్యయనం నిర్వహించింది. ఈ అద్యయనంలో పాల్గొన్న వారిలో 72 శాతం మంది  ప్రొప్రనాలోల్ వల్ల తమకు బాధ తగ్గినట్టు గా చెప్పారట.


ఈ మందుతో పాటు వారికి రీకన్సాలిడేషన్ థెరపీ కూడా అందించారు. ఇందులో భాగంగా ముందుగా బాధకలిగించే సంఘటనలు గుర్తు చేసుకొని పేపర్ మీద రాయమని సూచించారు. ఈ అధ్యయనంలో హార్ట్ బ్రేక్ తో బాధపడుతున్న 48 మంది వ్యక్తులకు 5 వారాల పాటు వారానికి 25 నిమిషాల పాటు చికిత్సను అందించారు. ఈ అధ్యయనానికి నేతృత్వం వహించిన డాక్టర్ అలియన్ బ్రునెట్ పోస్ట్ ట్రమాటిక్ స్ట్రెస్ డిజార్డర్ (PSTD)తో బాధ పడుతున్న వారికి చికిత్సగా ప్రొపనలాల్ చాలా బాగా పనిచేసిందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ మందుతో పాటు రీకన్సాలిడేషన్ థెరపీ కూడా తప్పనిసరి అని ఆయన తన వెబ్ సైట్ లో రాసుకున్నారు.



Also read: టైఫాయిడ్ జ్వరం ఎలా వస్తుంది? లక్షణాలు ఏంటి? రక్షణ పొందడం ఎలా?