భారతీయ వంటకాల్లో కొత్తిమీరకు ఎంతో విశిష్ట స్థానం ఉంది. గార్నిషింగ్ కోసం దీన్ని కచ్చితంగా అన్ని కూరల్లో వాడుతారు. కేవలం అది గార్నిషింగ్ కోసమే అనుకుంటే పొరపాటే, కొత్తిమీరను తినడం వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలకు చెక్ పెట్టొచ్చు. కొత్తిమీర రక్తంలో చక్కెర స్థాయిలను పెరగకుండా చూసుకుంటుంది. టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారు రోజూ కొత్తిమీరను తింటే ఎంతో మంచిది. కొత్తిమీర ఆకులు తిన్నా, ధనియాలు తిన్నా కూడా మంచిదే.  అలాగే థైరాయిడ్ సమస్యతో బాధపడే వారికి కొత్తిమీర ఒక పెద్ద వరమనే చెప్పాలి. థైరాయిడ్ అనేది మెడ అడుగు భాగంలో ఉండే ఎండోక్రైన్ గ్రంధి. ఇది జీవక్రియలను, అలాగే ఎదుగుదలను నియంత్రించే హార్మోన్ల బాధ్యతను చూసుకుంటుంది. సీతాకోకచిలుక ఆకారంలో ఉంటుంది. ఒక వ్యక్తి శరీరంలో హార్మోన్ల అసమతుల్యత ఉంటే హైపోథైరాయిడిజం లేదా హైపర్ థైరాయిడిజం వంటి సమస్యలు వస్తాయి.


థైరాయిడ్ గ్రంధి తగినంత థైరాయిడ్ హార్మోన్‌ను ఉత్పత్తి చేయనప్పుడు వచ్చే వ్యాధి ఇది. ఇది వస్తే నీరసం, మలబద్ధకం, చలిని తట్టుకోలేకపోవడం, డిప్రెషన్, బరువు పెరగడం వంటివి జరుగుతాయి. అదే గ్రంధి అధికంగా థైరాయిడ్ హార్మోను ఉత్పత్తి చేయడం వల్ల వచ్చే వ్యాధి హైపర్ థైరాయిడిజం. ఈ రెండు వ్యాధులను అడ్డుకునే శక్తి కొత్తిమీరకు ఉంది. 


కొత్తిమీర తింటే...
థైరాయిడ్ ఉన్న వ్యక్తి కొత్తిమీర తినడం వల్ల ఎంతో ఉపయోగాలు కలుగుతాయని ఆయుర్వేదం చెబుతోంది. కొత్తిమీర ఆకులు లేదా ధనియాలు తింటే హైపోథైరాయిడజం, హైపర్ థైరాయిడిజం... ఈ రెండింటినీ నిర్వహించడంలో సమర్థంగా వ్యవహరిస్తుంది. కొత్తిమీరలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. వీటిలో యాంటీఆక్సిడెంట్ లక్షణాలు అధికం. ధనియాలు శరీరాన్ని చురుకుగా ఉంచుతాయి. బరువు తగ్గడానికి సహాయపడతాయి. ఆరోగ్యకరమైన జీవనశైలి కావాలనుకునే వ్యక్తులు రోజూ కొత్తిమీరను ఆహారంలో భాగం చేసుకోవాలి. దాన్ని చట్నీ రూపంలో, కూర రూపంలో లేదా అన్నంలో కలిపి వండుకుని తినాలి. 


కొత్తిమీర నీటిని తయారు చేసుకుని తాగడం వల్ల చాలా ఉపయోగం ఉంటుంది.  వారంలో రెండు నుంచి మూడు సార్లు ఇలా తాగితే థైరాయిడ్ అదుపులో ఉంటుంది. కొత్తిమీర లేదా ధనియాలను నీటిలో ఉడకబెట్టి, వడకట్టుకుని ఆ నీటిని తాగాలి.


కొత్తిమీర ఆకుల్లో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఫంగల్ లక్షణాలు ఎక్కువ. చర్మ సమస్యలు రాకుండా అడ్డుకుంటాయి. ఈ ఆకుల వల్ల చర్మం చాలా మృదువుగా మారుతుంది. కొత్తిమీర విత్తనాలైన ధనియాలు వల్ల ఈ లాభాలు కలుగుతాయి. 


Also read: మీ టీనేజీ పిల్లలు మొటిమల బారిన పడకుండా ఉండాలా? అయితే ఇలా చేయండి






























గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.