దేశంలో కరోనా కేసుల ఉద్ధృతి క్రమంగా తగ్గుతోంది. కొత్తగా 25,920 కరోనా కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజులో 66,254 మంది కరోనా నుంచి కోలుకున్నారు. గురువారంతో పోలిస్తే రోజువారి కరోనా కేసులు 4,837 తగ్గాయి.
యాక్టివ్ కేసుల సంఖ్య 2,92,092కు చేరింది. డైలీ పాజిటివిటీ రేటు 2.07గా ఉంది. రికవరీ రేటు 98.12గా ఉంది. ఒక్కరోజులో 492 మంది మృతి చెందారు. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసుల శాతం 0.68గా ఉంది.
దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 174.64 కోట్ల వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. గురువారం 12,54,893 కరోనా పరీక్షలు నిర్వహించారు.
మహారాష్ట్రలో
మహారాష్ట్రలో కొత్తగా 2,797 కరోనా కేసులు నమోదయ్యాయి. 40 మంది మృతి చెందారు. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 78,53,291కి పెరిగింది. 1,43,532 మంది మృతి చెందారు.
జనవరి 21 నుంచి దేశంలో కరోనా ఉద్ధృతి క్రమంగా తగ్గుతోందని కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాజేష్ భూషణ్.. రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలకు రాసిన లేఖలో పేర్కొన్నారు.