COVID Surveillance Strategy : కోవిడ్ కేసులు పెరుగుతూండటంతో కేంద్ర ప్రభుత్వం కొత్త విధివిధానాలను అమలు చేయాలని రాష్ట్రాలకు సూచించింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ నుంచి రాష్ట్రాలకు కొత్త సూచనలు వెళ్లాయి. కొత్త కరోనాకేసులను వీలైనంత త్వరగా కనిపెట్టేందుకు .. వైద్య చికిత్స అందించేందుకు వీలుగా తాజా విధానాలకు రూపకల్పన చేశారు. విమానాశ్రయాల్లో అంతర్జాతీయ ప్రయాణికుల నుంచి ర్యాండమ్‌గా రెండు శాతం శాంపిల్స్ తీసుకోవాలని అన్నింటిని జీనోమ్ సీక్వెన్సింగ్‌కు పంపాలని కేంద్రం స్పష్టం చేసింది. పాజిటివ్‌గా తేలిన వారిని వెంటనే నిబంధనల ప్రకారం ఐసోలేషన్‌కు పంపాలన్నారు.
రాష్ట్రాలు అన్ని చోట్లా ఫ్లూ తరహా వ్యాధులకు అవసరమైన చికిత్స అందించేలా ఏర్పాట్లు చేసుకోవాల్సి ఉంది. ప్రతి జిల్లాకు ఓ సర్వైలైన్స్ ఆఫీసర్‌ను నియమించాలని కేంద్రం రాష్ట్రాలకు సూచించింది. ఫ్లూ తరహా కేసుల డేటాలను ఎనలైజ్ చేసి ..కోవిడ్ నిబంధనల ప్రకారం టెస్టులు చేయించాల్సిన బాధ్యత ఆ అధికారికే ఇవ్వాలన్నారు. కరోనాకు చికిత్స అందించే ఆస్పత్రులను ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూ.. సంసిద్ధంగా ఉండేలా చూడాలన్నారు. ల్యాబ్ బేస్డ్ సర్వైలైన్స్ కూడా ముఖ్యమంత్రి కేంద్రం స్పష్టం చేసింది.
మరో వైపు దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గత 24 గంటల్లో 4.33 లక్షల మందికి కొవిడ్ పరీక్షలను నిర్వహించగా... 14,506 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అంతకు ముందు రోజు 11,793 కేసులు రావడం గమనార్హం. ఇదే సమయంలో 11,574 మంది కరోనా నుంచి కోలుకోగా.. 30 మంది ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు దేశంలో యాక్టివ్ కేసులు లక్షకు చేరువయ్యాయి. ప్రస్తుతం దేశంలో 99,602 యాక్టివ్ కేసులు ఉన్నాయి. దేశంలో పాజిటివిటీ రేటు 3.38 శాతంగా, రికవరీ రేటు 98.56 శాతంగా, మరణాల రేటు 1.21 శాతంగా, క్రియాశీల రేటు 0.23 శాతంగా ఉంది. ఇప్పటి వరకు 197.46 కోట్ల డోసుల కరోనా వ్యాక్సిన్ పంపిణీ చేశారు.