JN.1 variant: JN.1 వేరియంట్ కొవిండ్ -19 వైరస్‌కు సంబంధించిన వేరియెంట్‌లో ఉపవేరియెంట్. ఇది BA.2.86(పిరోలా) నుంచి పుట్టుకొచ్‌చింది. ప్రపంచవ్యాప్తంగా వేగంగా వ్యాపిస్తున్న ఈ వేరియెంట్ ఇండియాలో కూడా చాలా వేగంగా విస్తరిస్తోంది. విపరీతంగా కేసులు పెరుగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో కూడా కేసులు పెరుగుతున్నాయి. ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు సూచనలు చేస్తున్నాయి.
ఈ వేరియెంట్ లక్షణాలు ఏంటీ?గతంలో వ్యాప్తి చెందిన ఒమిక్రాన్ వేరియెంట్ లక్షణాలే ఇందులో కూడా కనిపిస్తాయి. జలుబు, దగ్గు, గొంతునొప్పి, తల తిరగడం, అలసటగా ఉండటం దీని ప్రధాన లక్షణాలు. మరికొందరికి జ్వరం వస్తుంది. వాంతులు విరేచనాలు కూడా అవుతుంటాయి. భోజనం తినాలనే ఆసక్తి ఉండకపోవడం కూడా ఈ వ్యాధి లక్షణం. తల భారంగా ఉంటుంది. ఏ పని చేయాలన్నా సరే ఆసక్తి ఉండదు.
ఈ లక్షణాలు వ్యాధి వ్యాప్తి చెందిన వారిలో కనిపిస్తాయి. కానీ నార్మల్‌గానే కనిపిస్తారు. అయితే వృద్ధులు, చిన్న పిల్లలు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారిలో ఈ లక్షణాలు తీవ్రంగా ఉంటాయి. వాళ్లు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది.
ఈ వేరియెంట్ గాలి ద్వారా వ్యాప్తి చెందుతుంది. దగ్గు తుమ్ముల ద్వారా వైరస్ విస్తరిస్తుంది. ఒకరు వాడిన వస్తువులు పట్టుకున్నా, వారు తిరిగిన చోట తిరిగినా సరే వ్యాధి సోకుతుంది.
ఈ వ్యాధి నుంచి రక్షణ పొందాలంటే ఈ జాగ్రత్తలు తీసుకోవాలి మాస్క్‌లు ధరించాలిచేతులు శుభ్రంగా ఉంచుకోవాలి. సామాజిక దూరం పాటించాలిగాలి ధారళంగా వచ్చే గదుల్లో ఉండాలి.రోగనిరోధక శక్తిని పెంచుకోవాలి వాక్సిన్ తీసుకోవాలి
వైరస్ సోకితే ఏ చేయాలి
వైరస్ సోకిన వాళ్లు వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. ఇంట్లోనే ఐసోలేషన్‌లో ఉండాలి, ప్రతి రోజూ ఆక్సిజన్ స్థాయి, ఉష్ణోగ్రతలను పరీక్షించుకోవాలి. లక్షణాలు ఎక్కువగా ఉంటే ఆసుపత్రిలో జాయిన్ అవ్వాలి.
మిగతా వేరియెంట్స్‌కు ఈ వేరియెంట్‌కు ఉన్న తేడా ఏంటీ?
JN.1 వేరియెంట్ మిగతా కోవిండ్ వేరియెంట్స్‌తో పోల్చుకుంటే కొన్ని ప్రత్యేక లక్షణాలను కలిగి ఉంది. మిగతా వేరియెంట్స్ వాప్తి కాస్త ఆలస్యంగా ఉంటే... ఇది చాలా త్వరగా వ్యాప్తి చెందే సామర్థ్యం కలిగి ఉంటుంది. చాలా మంది లక్షణాలు లేకుండా ఇది సోకుతుంది. మరికొందరికి తేలికపాటి లక్షణాలు ఉంటాయి. దీనిపై టీకాల ప్రభావం తక్కువగా ఉంటుంది. స్పైక్ ప్రోటీన్‌లో ఎక్కువ మ్యూటేషన్లు ఉండటం వల్ల వైరస్‌ను గుర్తించడం శరీరానికి కష్టమవుతుంది. కొన్ని సందర్భాల్లో గుర్తించడానికి అధునాతన జెనోమ్ సీక్వెన్సింగ్ అవసరం అవుతుంది.
ఏ రాష్ట్రంలో ఎన్నికేసులు
పది రోజులుగా వివిధ రాష్ట్రాల్లో నమోదు అయిన కేసుల వివరాలు ఇలా ఉన్నాయి. కేరళలో దాదాపు 70 కేసులు, మహారాష్ట్రలో 44 కేసులు, తమిళనాడులో 34, ముంబైలో 100కిపైగా కేసులు, ఢిల్లీలో 30కిపైగా కేసులు నమోదు అయ్యాయి.