Corona variants spreading rapidly in India:  భారతదేశంలో  కోవిడ్  కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోదంి.   ప్రధానంగా ఒమిక్రాన్ (Omicron) వేరియంట్‌కు చెందిన రెండు సబ్-వేరియంట్లు వ్యాప్తి చెందుతున్నాయి.  LF.7, NB.1.8 అనే రెండు వేరియంట్లు ఎక్కువగా వ్యాప్తికి కారణం అవుతున్నాయి.   ఈ రెండు వేరియంట్లు JN.1 లైనేజ్ నుండి  పుట్టాయి.   ఒమిక్రాన్  సబ్-వేరియంట్. 

LF.7 ,  NB.1.8 వేరియంట్లు ఎంత ప్రమాదకరం ?

LF.7 ,  NB.1.8 రెండు వేరియంట్లు JN.1 సబ్-వేరియంట్ నుండి ఉద్భవించాయి.  JN.1ని డిసెంబర్ 2023లో ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) "వేరియంట్ ఆఫ్ ఇంటరెస్ట్" (VOI)గా  ప్రకటించింది.  ఈ వేరియంట్లు అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతాయి.  భారతదేశంలోని కొన్ని రాష్ట్రాల్లో, ముఖ్యంగా మహారాష్ట్ర, తమిళనాడు, కేరళ,   ఢిల్లీలో కేసుల సంఖ్య పెరగుతున్నాయి.   సింగపూర్, హాంకాంగ్,   థాయిలాండ్‌లో కూడా విస్తృతంగా వ్యాప్తి చెందుతున్నాయి. LF.7, NB.1.8లో స్పైక్ ప్రోటీన్‌లో మ్యుటేషన్లు ఉన్నాయి. ఇవి వైరస్‌ను మానవ కణాలకు  సులభంగా  అంటించేస్తాయి.  దీని వల్ల వ్యాప్తి రేటు పెరుగుతుంది. అయితే, ఈ మ్యుటేషన్లు వ్యాక్సిన్‌లు లేదా మునుపటి సంక్రమణల ద్వారా ఏర్పడిన రోగనిరోధక శక్తిని పూర్తిగా దాటలేదని నిపుణులు చెబుతున్నారు. 

ఈ రెండు వేరియంట్ల లక్షణాలు ఎలా ఉంటాయంటే ?  LF.7,  NB.1.8 వేరియంట్లు ఒమిక్రాన్ రకానికి కు చెందినవి.  వీటి లక్షణాలు ఇతర ఒమిక్రాన్ సబ్-వేరియంట్ల మాదిరిగానే ఉంటాయి.   గొంతు నొప్పి,  తేలికపాటి దగ్గు ,  అలసట ,  జ్వరం,  శరీర నొప్పులు,  శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ,  జీర్ణ సమస్యలు,  వాంతులు, విరేచనా వంటి లక్షణాలు ఉంటాయి.  డెల్టా వేరియంట్‌లో సాధారణంగా కనిపించే వాసన లేదా రుచి కోల్పోవడం ఈ వేరియంట్లలో చాలా అరుదుగా ఉంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.  ఈ వేరియంట్ల వల్ల సంభవించే కేసులు ఎక్కువగా తేలికపాటి లక్షణాలతో ఉంటున్నాయి. ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం చాలా తక్కువగా ఉంటుంది.   వృద్ధులు, గర్భిణీ స్త్రీలు,  దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.  

 తీవ్రత చాలా తక్కువే 

WHO , భారత ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం, ఈ వేరియంట్లు మునుపటి వేరియంట్ల కంటే ఎక్కువ తీవ్రత చూపించడం లేదు. మరణాలు నమోదు కాలేదు.  మే 2025 నాటికి 257 యాక్టివ్ కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి, ఇందులో ఎక్కువ భాగం మహారాష్ట్ర , కేరళ,  తమిళనాడులో నమోదయ్యాయి. ముంబైలో మే నెలలోనే 95 కొత్త కేసులు నమోదయ్యాయి. ఈ సబ్-వేరియంట్లు ఆసియా దేశాలైన సింగపూర్, హాంకాంగ్,   థాయిలాండ్‌లో కూడా విస్తృతంగా వ్యాప్తి చెందుతున్నాయి.   LF.7 ,  NB.1.8 వేరియంట్లు భారతదేశంలో కోవిడ్-19 కేసుల సంఖ్యలో స్వల్ప పెరుగుదలకు కారణమవుతున్నాయి, కానీ ఇవి ఎక్కువ తీవ్రతను కలిగి ఉన్నట్లు లేదా వ్యాక్సిన్‌లను పూర్తిగా దాటివేసే సామర్థ్యం ఉన్నట్లు ఆధారాలు లేవు. ఆరోగ్య మంత్రిత్వ శాఖ రాష్ట్రాలను అప్రమత్తంగా ఉండమని ,  నివారణ చర్యలను కొనసాగించమని సూచించింది.