Covid Cases In in AP: ఆంధ్రప్రదేశ్ లో మళ్లీ కరోనా టెన్షన్ ప్రారంభమయింది.  కరోనా కేసులు  పెరుగుతున్నాయి. విశాఖ, కడపలో పాజిటివ్‌ కేసు నమోదు అయ్యాయి. ఈ అంశంపై వైద్య ఆరోగ్యశాఖ మార్గదర్శకాలు జారీ చేసింది.  కరోనా నివారణకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.  ప్రార్థన సమావేశాలు, సామాజిక సమావేశాలు, పార్టీలు, ఇతర కార్యక్రమాలు వాయిదా వేసుకోవాలని సూచించింది. రైల్వేస్టేషన్లు, బస్టాండ్లు, విమానాశ్రయాల్లో కోవిడ్ నిబంధనలు పాటించాలని.. - ఎక్కువ జనాభా ఉన్న ప్రదేశాల్లో మాస్కులు తప్పనిసరిగా వాడాలి సూచనలు జారీ చేసింది. 

లక్షణాలు కనిపిస్తే వెంటనే ఆరోగ్య కేంద్రానికి !

జ్వరం లేదా చలి, దగ్గు, అలసట, గొంతునొప్పి, రుచి లేదా వాసన కోల్పోవడం, తలనొప్పి, కండరాలు లేదా శరీర నొప్పులు, ముక్కు కావడం లేదా ముక్కుదిబ్బడ, వికారం, వాంతులు, విరోచనాలు ఉంటే దగ్గరలోని ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించాలని ప్రభుత్వం సూచించంది.  ఆరోగ్యశాఖకు చెందిన 24 గంటలు పని చేసే ల్యాబ్‌ల్లో మాస్కులు, పీపీఈ కిట్ త్రిబుల్ లేయర్ మాస్కులను తగిన పరిణామంలో ఉంచుకోవాలని ఆదేశించింది. రాష్ట్రవ్యాప్తంగా కోవిడ్ కేసులు పై రాష్ట్ర వైద్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు .

మంత్రి సత్యకుమార్ యాదవ్ సమీక్ష  

కోవిడ్ కేసులు ఎదుర్కొనేందుకు అందర్నీ అప్రమత్తం చేస్తున్నామమని.. ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని మంత్రి ప్రకటించారు.  ఆరోగ్యశాఖ అన్ని పరీక్ష సౌకర్యాలతో కూడిన 24 గంటలు పని చేసే ల్యాబ్‌లలో మాస్క్‌లు,  పిపీఈ కిట్ త్రిబుల్ లేయర్ మాస్కులు తగిన పరిణామంలో ఉంచుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీచేసింది వైద్య ఆరోగ్యశాఖ.  రెండున్నర సంవత్సరాల విరామం తర్వాత దేశవ్యాప్తంగా కరోనా కేసులు నమోదు అవుతున్నాయి గుజరాత్, ఒడిశా రాష్ట్రాల్లో కేసులు ఎక్కువగా నమోదు అవుతున్నాయి. అనేక ప్రాంతాల్లో COVID-19 కేసులు నమోదు అవుతున్నాయి. రోగులు తేలికపాటి ఒత్తిడితో బాధపడుతున్నట్లు గుర్తించారు.       

పెరుగుతున్న కొత్త వేరియంట్లు        

కోవిడ్-19 వైరస్ (SARS-CoV-2) కొత్త వేరియంట్‌లు, ముఖ్యంగా ఒమిక్రాన్ ఉప-వేరియంట్‌లు, ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చెందుతున్నాయి. ఈ వేరియంట్‌లలో  LP.8.1 ,  XEC , KP.3.1.1 వంటి వేరియంట్ల గురించి చచెబుతున్నారు.  ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) మరియు ఇతర ఆరోగ్య సంస్థల నివేదికల ప్రకారం, ఒమిక్రాన్ వేరియంట్‌కు చెందిన ఉప-వేరియంట్ ఎక్కవగా వ్యాపిస్తోంది.  అమెరికాలో 70 శాతం కోవిడ్ కేసులు.  యూకేలో 60% కేసులు, ఆస్ట్రేలియాలో మూడవ అత్యంత ప్రబలమైన వేరియంట్‌గా   LP.8.1 ఉంది. 

ఇతర రాష్ట్రాల్లోనూ కోవడ్ కేసులు పెరుగుతూంటడంతో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.