Covid is spreading rapidly again: కోవిడ్ కొత్త వేరియంట్ వచ్చేసిందని పలు దేశాల నుంచి వార్తలు వస్తున్నాయి. మహేష్ బాబు సతీమణి నమ్రతా శిరోద్కర్ సోదరి శిల్పా శిరోద్కర్ తనకు కరోనా సోకిందని చేసిన ప్రకటన వైరల్ గా మారింది. ఈ క్రమంలో కొత్త వేరియంట్ పై చర్చ ప్రారంభమయింది.  

కోవిడ్-19 వైరస్ (SARS-CoV-2) కొత్త వేరియంట్‌లు, ముఖ్యంగా ఒమిక్రాన్ ఉప-వేరియంట్‌లు, ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చెందుతున్నాయి. ఈ వేరియంట్‌లలో  LP.8.1 ,  XEC , KP.3.1.1 వంటి వేరియంట్ల గురించి చచెబుతున్నారు.  ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) మరియు ఇతర ఆరోగ్య సంస్థల నివేదికల ప్రకారం, ఒమిక్రాన్ వేరియంట్‌కు చెందిన ఉప-వేరియంట్ ఎక్కవగా వ్యాపిస్తోంది.  అమెరికాలో 70 శాతం కోవిడ్ కేసులు.  యూకేలో 60% కేసులు, ఆస్ట్రేలియాలో మూడవ అత్యంత ప్రబలమైన వేరియంట్‌గా   LP.8.1 ఉంది. 

XEC అనే వేరియంట్ కూడా విస్తరిస్తోంది.   అమెరికాలో 14-22% కేసులకు కారణం, డిసెంబర్ 2024 నాటికి 45% కేసులకు  కారణం అయింది. ముఖ్యంగా 27 అమెరికా రాష్ట్రాల్లో గుర్తించారు. యూరప్‌లో వేగంగా వ్యాప్తి చెందుతోంది.  KP.3.1.1 అనే వేరియంట్  ఒమిక్రాన్ JN.1 ఉప-వేరియంట్.   LP.8.1 ,  XEC వేరియంట్‌లు అధిక వ్యాప్తి సామర్థ్యం కలిగి ఉన్నప్పటికీ, ఒమిక్రాన్  గత వేరియంట్‌లతో పోలిస్తే తీవ్రమైనది కాదని అంటున్నారు.  

కోవిడ్ గురించి ప్రజలు భయపడటం మానేశారు. కరోనా సోకినా ప్రత్యేకంగా వైద్య చికిత్స లేకపోవడం.. సాధారణ మందులతోనే తగ్గిపోతూండటంతో.. జలుపు, జ్వరంలాగానే ట్రీట్ చేస్తున్నారు. కరోనా టెస్టులకు కూడా ఇప్పుడు పెద్దగా ఎవరూ ఆసక్తి చూపించడం లేదు. గతంలోనే .. ఈ అంశంపై ప్రజలు తేలికగా తీసుకోవడం ప్రారంభించారు ఇదంతా  మెడికల్ మాఫియా ప్రచారం అని నమ్మే ప్రజలు కూడా పెరిగిపోయారు. అందుకే ఎంతగా వ్యాప్తి జరుగుతోందని ప్రచారం చేసినా భయపడే పరిస్థితులు లేవని అనుకోవచ్చు.