ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు పూర్తిగా తగ్గుముఖం పట్టాయి. మొన్నటి వరకు వేలల్లో రిజిస్టర్‌అయిన కేసులు ఇప్పుడు వందల్లోకి వచ్చేశాయి. 


గత ఇరవై నాలుగు గంటల్లో 19, 432 శాంపిల్స్‌ పరీక్షిస్తే అందులో 253 మందికి కరోనా పాజిటివ్‌ ఉన్నట్టు తేలింది. కరోనా కారణంగా రాష్ట్రవ్యాప్తంగా ఇద్దరు మృతి చెందారు చిత్తూరులో ఒకరు, పశ్చిమగోదావరి జిల్లాలో ఒకరు చనిపోయారు. 
గత 24 గంటల్లో 635 మంది వైరస్‌ బారి నుంచి కోలుకున్నారు. సంపూర్ణ ఆరోగ్యంతో వాళ్లు ఉన్నారు. 






ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 3, 30, 30, 124 శాంపిల్స్‌ పరీక్షించారు. రాష్ట్రప్యాప్తంగా ఇప్పటి వరకు 23, 16, 964 కేసులు నమోదయ్యాయి. 22, 97,065 మంది డిశ్చార్జ్ అయ్యారు. 14, 718 మంది మరణించారు. ప్రస్తుతం 5, 181 మంది చికిత్స తీసుకుంటున్నారు. 






గత ఇరవై నాలుగు గంటల్లో ఎక్కువ కేసులు గుంటూరులో రిజిస్టర్ అయ్యాయి. అక్కడ నలభై కేసులు బయటపడ్డాయి. తర్వాత స్థానం పశ్చిమగోదావరపి జిల్లా ఉంది. అక్కడ 37 కేసులు రిజిస్టర్ అయ్యాయి.  శ్రీకాకుళంలో ఒకే కేసులు నమోదైంది. ఇంకా అక్కడ 30 యాక్టివ్ కేసులు ఉన్నాయి. విజయనగరంలో రెండు కేసులు వెలుగు చూశాయి. ఇక్కడ 40 యాక్టివ్ కేసులు ఉన్నాయి.