'
చైనాలో కరోనా వైరస్ మరోసారి కలకలం రేపుతోంది. కోవిడ్ కొత్త వేరియంట్ విస్తృతంగా వ్యాపిస్తూండటంతో శుక్రవారం దాదాపుగా 90 లక్ల మంది నివాసం ఉంటే పారిశ్రామిక నగరం చాంగ్ చున్‌లో లాక్‌డౌన్ ప్రకటించేసింది. ఈ ప్రాంతంలో ఎవరూ ఇళ్ల నుంచి బయటకు రావొద్దని..అలాగే వారంతా మూడు సార్లు కరోనా పరీక్ష చేియంచుకోవాలని ఆదేశించింది. చాంగ్‌చున్ నగరం నుంచి అన్ని రవాణా సౌకర్యాలను నిలిపివేశారు. వైద్యం తప్ప అన్ని వ్యాపార సంస్థలకూ సెలవులు ఇచ్చేశారు.
చైనాలో ఇప్పుడు మరోసారి కోరనా విజృంభిస్తోంది. పెద్ద సంఖ్యలో వివిధ నగరాల్లో రోజుకు వెయ్యి కంటే ఎక్కువ కరోనా కేసులు నమోదవుతున్నాయి. చాంగ్‌చున్‌లో పరిస్థితి తీవ్రంగా ఉందని అంచనాకు రావడంతో లాక్ డౌన్ విధించింది. కరోనా వెలుగు చూసిన తర్వాత రెండేళ్లో చాంగ్‌చున్‌లో అత్యధిక కేసులు నమోదయ్యాయి. అందుకే లాక్ డౌన్ ప్రకటించేశారు. కరోనా విషయంలో చైనా కఠినమైన నిబంధనలు అమలు చేస్తోంది. ఎక్కడైనా ఒకటి , రెండు కేసులు నమోదైనా.. ఆ ప్రాంతాన్ని కంటైన్మెంట్‌గా ప్రకటించేసి జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
పిల్లల్ని కనండి ఖర్చులన్నీ భరిస్తాం ! ప్రజలకు చైనా సర్కార్ బంపర్ ఆఫర్..కానీ
కరోనా వైరస్ విషయంలో చైనా ప్రభుత్వం " జీరో టాలరెన్స్ " విధానాన్ని పాటిస్తోంది.ఎక్కడ కేసు బయటపడినా వ్యాప్తి చెందకుండా యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటోంది. చాంగ్ చున్‌తో పాటు చుట్టుపక్కల ప్రావిన్స్‌తో సమానమైన పేరు ఉన్న జిలిన్ నగరంలో చైనా అధికారులు ఇప్పటికే పాక్షిక లాక్‌డౌన్ విధించారు. అక్కడ, ముందుజాగ్రత్త చర్యగా ఇతర నగరాలతో రాకపోకలు నిలిపివేయబడ్డాయి. జిలిన్ నగరంలో రోజుకు వందకుపైగా కేసులు నమోదవుతున్నాయి.
అమల్లోకి చైనా కొత్త సరిహద్దు చట్టం ! భారత్‌ను టార్గెట్ చేసిందా ?
ఒమిక్రాన్ వ్యాప్తి తీవ్రంగా ఉన్న సమయంలో ఆర్థిక కార్యకలాపాలకు కేంద్రమైన షాంఘై , పాఠశాలలను కూడా మూసివేయవలసి వచ్చింది. ఇప్పుడు మరోసారి అదే బాటలో వెళ్తోంది.అయితే కఠినమైన చర్యల వల్ల ఎప్పటికప్పుడు నియంత్రిస్తున్నందున లాక్ డౌన్ ఇతర ప్రాంతాలకు విస్తరించే అవకాశం రాదని భావిస్తున్నారు.