తెలంగాణ అసెంబ్లీ ( Telangana Assembly ) బడ్జెట్ సమావేశాల తొలి రోజే సస్పెన్షన్‌కు గురైన తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యేలకు ( BJP Mlas ) హైకోర్టులో ఊరట లభించలేదు. తమ సస్పెన్షన్‌పై స్టే ఇవ్వాలని సమావేశాలకు హాజరయ్యే అవకాశం కల్పించాలని హైకోర్టులో ( High Court ) దాఖలు చేసిన పిటిషన్ విషయంలో వారికి ఎదురు దెబ్బతగిలింది. స్టే ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. సభ ముగిసే వరకు సస్పెన్షన్‌ను ఎత్తివేయాలని కోరుతూ బీజేపీ ఎమ్మెల్యేలు దాఖలు చేసిన పిటిషన్‌పై స్టే ఇవ్వలేమని హైకోర్టు స్పష్టం చేసింది.   తమను అసెంబ్లీ సమావేశాలకు ( Assembly Meetings ) హాజరుకాకుండా రాజ్యాంగ, చట్టవిరుద్ధంగా సస్పెండ్‌ చేశారంటూ.. బీజేపీ ఎమ్మెల్యేలు ఆరోపిస్తున్నారు. 


బీజేపీతో కేసీఆర్‌ మళ్లీ "యుద్ధ విరామం" ప్రకటిస్తారా ? ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలతో స్ట్రాటజీలో మార్పు వస్తుందా ?


 
బుధవారం ఎమ్మెల్యేల వాదనలు  హైకోర్టు అసెంబ్లీ కార్యదర్శి నుంచి వివరణ కోరింది.  బీజేపీ ఎమ్మెల్యేల తరఫున లాయర్ దేశాయ్ ప్రకాష్ రెడ్డి వాదనలు వినిపించారు.   అసెంబ్లీలో నిష్పక్షపాతంగా పార్టీలకు అతీతంగా వ్యవహరించాల్సిన శాసనసభ అధిపతి ( Speaker ) నిబంధనలు పాటించకుండా బీజేపీ ఎమ్మెల్యేలను సస్పెన్షన్ చేశారని వాదించారు. చట్ట సభా గౌరవానికి భంగం కలిగించేలా ప్రవర్తించినప్పుడు మాత్రమే సస్పెండ్ చేయొచ్చు కానీ.. ఇక్కడ అలా జరగలేదని ప్రస్తావించారు. ఆరోపణలను నిర్ధారించుకునేందుకు  ప్రొసీడింగ్స్ కాపీని కోరగా.. ప్రొసీడింగ్స్ కాపీ ఇవ్వడానికి కుదరని అడ్వకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ అభ్యంతరం తెలుపగా కోర్టు అంగీకరించలేదు. ప్రొసీడింగ్స్ కాపీపై వివరణ ఇవ్వాలని అసెంబ్లీ సెక్రెటరీని ( Assembly Secratery ) ఆదేశించిన హైకోర్టు గురువారం విచారణను పూర్తి చేసింది. వాదనలు ముగియడంతో శుక్రవారం తీర్పు ఇచ్చింది. 


యూపీలో జరిగిందే తెలంగాణలో జరుగుతుంది - బీజేపీ నేతల ధీమా



స్పీకర్ అధికారాల్లో కోర్టు జోక్యం చేసుకోవడం సాధ్యం కాదనే వాదనను అడ్వకేట్ జనరల్ ( Advocate General ) ప్రధానంగా ప్రస్తావించారు. తమను అన్యాయంగా సస్పెండ్ చేశారంటూ  బండి సంజయ్ నాయకత్వంలో ఎమ్మెల్యేలు రాష్ట్రపతిని కలవాలని నిర్ణయించుకున్నారు. గతంలో వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యే రోజా సస్పెన్షన్ విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పు ఉందని.. బీజేపీ ఎమ్మెల్యేలు చెబుతున్నారు.  ఏ సెక్షన్ కింద బీజేపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేశారో ప్రజలకు స్పీకర్ చెప్పాలని బీజేపీ ఎమ్మెల్యేలు డిమాండ్ చేస్తున్నారు. అయితే న్యాయపోరాటంలోనూ ఊరట లభించకపోడంతో.. బీజేపీ ఎమ్మెల్యేలకు సభకు హాజరయ్యే అవకాశాన్ని ఈ సెషన్ వరకూ కోల్పోయినట్లయింది.