మధుమేహం ఉన్నవారు తినే ఆహారం విషయంలో ఎల్లప్పుడూ జాగ్రత్తగా ఉండాలి. తాము ఏమి తింటున్నామో, అందులో సహజ చక్కెర్లు ఎంత ఉన్నాయో? అవి రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను ఎంతగా పెంచుతాయో తెలుసుకుని తినడం చాలా అవసరం. అయితే పండ్లు సహజమైనవి కాబట్టి అన్ని పండ్లను తినొచ్చని చాలామంది భావిస్తారు. అయితే కొన్ని పండ్లలో అధిక చక్కెర ఉంటుంది. అలాంటివి దూరం పెట్టడం అవసరం. ఈ సీజన్లో అధికంగా దొరికే నల్ల ద్రాక్ష తినవచ్చా? లేదా? అనేది చాలామంది మధుమేహం ఉన్న వారి సందేహం.


 ద్రాక్ష పండ్లలో పాలీఫెనాల్స్ అధికంగా ఉంటాయి. ఇవి మొక్కల సమ్మేళనాలకు చెందినవి. ఇది జీర్ణక్రియను పెంచడంతోపాటు, మెదడు ఆరోగ్యాన్ని కాపాడతాయి. గుండె జబ్బులు, క్యాన్సర్ వంటివి రాకుండా అడ్డుకుంటాయి. ఆరోగ్య నిపుణులు చెబుతున్న ప్రకారం నల్ల ద్రాక్ష మధుమేహలు తినవచ్చు. ఇది మెటబాలిక్ సిండ్రోమ్‌ను తగ్గిస్తుంది. ఇందులో ఉన్న బలమైన యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ ఫ్లమ్మేటరీ  లక్షణాలు మధుమేహలుకు ఎంతో మేలు చేస్తాయి.


వీటిలో జిఐ తక్కువ...
ఆహార పదార్థాల గ్లైసమిక్ ఇండెక్స్ తెలుసుకొని తినడం డయాబెటిస్ వ్యాధిగ్రస్తులకు చాలా ముఖ్యం. జీఐ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు తింటే రక్తంలో అధికంగా గ్లూకోజ్ విడుదలవుతుందని అర్థం. నల్ల ద్రాక్ష జిఐ తక్కువగా ఉంటుంది. కాబట్టి దీని ఏ రూపంలో తీసుకున్నా మంచిదే. అయితే చాలామంది దీన్ని రసం రూపంలో, కాస్త చక్కెర జోడించి తీసుకుంటారు. దీని వల్ల మధుమేహం సమస్య పెరుగుతుంది. అలా కాకుండా నల్ల ద్రాక్షను నేరుగా తినడం వల్ల ఎక్కువ మేలు జరుగుతుంది. ఇందులో ఉండే ఫైటో న్యూట్రియెంట్స్ వివిధ వ్యాధులను నివారించడంలో సహాయపడతాయి. మధుమేహం ప్రమాదాన్ని తగ్గించడంలో కీలకంగా పనిచేస్తాయి ఈ పండ్లలోని గుణాలు. నల్ల ద్రాక్షలో 82% నీరే ఉంటుంది. కాబట్టి కేలరీలు తక్కువగా ఉంటాయి. అలాగే ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచుతుంది. కనుక ఎలాంటి భయం లేకుండా నల్ల ద్రాక్షను డయాబెటిస్ రోగులు తినవచ్చు. 


వీటిని తినడం వల్ల తీపి తినాలన్న కోరిక కూడా తగ్గుతుంది. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. అలాగే గుండెను ఆరోగ్యంగా ఉంచడంతోపాటు, మైగ్రేన్ వంటి తలనొప్పులు రాకుండా అడ్డుకుంటుంది. మూత్రపిండాల వ్యాధులు ఉన్నవాళ్లు, కాలేయ సమస్యలు ఉన్న వాళ్ళు ద్రాక్షను తినడం చాలా మంచిది. 


Also read: సంక్రాంతి రోజు వీటిని కచ్చితంగా తినాల్సిందే - తింటేనే పండుగ చేసుకున్నట్టు















గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.