దయం బ్రేక్ ఫాస్ట్ చాలా ముఖ్యం. దాన్ని దాటవేశారంటే.. ఆ ప్రభావం రోజంతా పడుతుంది. కొంతమంది తమ బ్రేక్ ఫాస్ట్ లో ఖచ్చితంగా తాజా పండ్లు లేదా జ్యూస్ తీసుకుంటూ ఉంటారు. పండ్లు తినడం ఆరోగ్యానికి మంచిదే. కానీ.. అల్పాహారంలో తీసుకోవడం మంచిది కాదని ఆయుర్వేద శాస్త్రం చెబుతోంది. ఖాళీ కడుపుతో పండ్లు తినడం వల్ల ఇబ్బందులు తలెత్తుతాయని ఆయుర్వేద నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే ఆయుర్వేదం ప్రకారం ఉదయం 6-10 గంటల మధ్య కాలాన్ని కఫ కాలం అంటారు. అందుకే ఈ టైమ్ లో ఖాళీ కడుపుతో పండ్లు తినకూడదని అంటున్నారు.


ఆయుర్వేదం ఏం చెబుతోంది?


పండ్లు చల్లగా, తీపి, పూలు, ఆస్ట్రిజెంట్ రుచులతో ఉంటాయి. పండ్లలో సాధారణ కార్బోహైడ్రేట్లు ఉంటాయి. ఇవి వేగంగా జీర్ణమవుతాయి. వీటిలో కఫ లక్షణాలు ఉంటాయి. పరగడుపున వీటిని తినడం వల్ల కఫ సమస్యని తీవ్రతరం చేస్తాయి.


పండ్లు ఎందుకు వద్దంటే?


అల్పాహారంలో పండ్లు తీసుకోవద్దని చెప్పేందుకు ప్రధాన కారణం ఆ సమయంలో జీర్ణ మంట తక్కువగా ఉంటుంది. చల్లని ఆహారాలు దాన్ని మరింత తగ్గిస్తాయి. అందుకే వాటిని తినకూడదు.


ఎటువంటి అల్పాహారం తీసుకోవాలి?


మనం తీసుకునే అల్పాహారం వెచ్చగా, సులభంగా జీర్ణం అయ్యేది ఉండాలని వైద్యులు సిఫార్సు చేస్తున్నారు. ఉదాహరణకి అన్నం గంజి, దాలియాతో చేసిన పదార్థంలో జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర వేసుకోవడం వల్ల జీర్ణ సమస్యలు రాకుండా ఉంటుంది. లేదంటే ఒక గ్లాసు పాలలో చిటికెడు శొంటి పొడి వేసుకుని తాగొచ్చు.


చాలా మంది తప్పని సరిగా అల్పాహారంలో పండ్లు భాగం చేసుకుంటారు. అది అలవాటుగా మారిపోయింది. కొంతమందికి బలమైన జీర్ణశక్తి ఉంటుంది. వాళ్ళు పండ్లు తీసుకున్నా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకపోవచ్చు. అందుకే అటువంటి వాళ్ళు పండ్లు లేదా పండ్ల రసాలు తీసుకుంటారు. శారీరకంగా చురుకుగా ఉండే వారికి కూడా ఇది సరిపోతుందని నిపుణులు చెప్తున్నారు.


పండ్లు తినాలని అనుకుంటే ఇలా చెయ్యండి


కొంతమందికి అల్పాహారంలో పండ్లు తీసుకోకపోతే అసంపూర్తిగా తిన్నామనే భావన వస్తుంది. అటువంటి వాళ్ళు దాల్చిన చెక్క, లేదా శొంటి (అల్లం పొడి) వంటి కొన్ని సుగంధ ద్రవ్యాలు జోడించుకోవచ్చు. అలాగే వాతావరణం వెచ్చగా ఉన్నప్పుడు కూడా ఉదయం పూట పండ్లు తీసుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ఈ ఆయుర్వేద చిట్కాలు పాటించి బ్రేక్ ఫాస్ట్ లో పండ్లు తీసుకోవచ్చు. శరీరంలో ఏదైనా మార్పులు గమనిస్తే మాత్రం వెంటనే దాన్ని ఆపేయడం మంచిది.


అలాగే పాలు, అరటి పండు కూడా కలిపి తీసుకోకూడదు. అలా చేస్తే అది మెదడు పనితీరుని నెమ్మదించేలా చేస్తుంది. శ్వాస సమస్యలు, అలర్జీలు, సైనస్, శరీరంపై దద్దుర్లు, వాంతులు, అతిసారం సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.


Also read: సబ్బుతో ఫేస్ వాష్ చేసుకోవడం మంచిదేనా? చర్మ నిపుణులు ఏం సూచిస్తున్నారు?