మహారాష్ట్రలో అసెంబ్లీ సమావేశాలు జరిగాయి. ముగిశాయి. ఈ మధ్యలో అసెంబ్లీలో ఎంత చర్చించారో కానీ కరోనా వైరస్ మాత్రం అదర గొట్టేసింది. యాభై మందిని అంటుకుంది. మంత్రులతో పాటు పలువురు ఎమ్మెల్యేలు, పోలీసులు కరోనా బారిన పడ్డారు.   శీతాకాల సమావేశాలు జరిగిన 5 రోజుల్లో దాదాపు 50 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఇందులో ఇద్దరు మంత్రులు కూడా ఉన్నారని ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. 


Also Read: దేశంలో ఒమిక్రాన్ దడ.. 800కు చేరువలో మొత్తం కేసులు


మహారాష్ట్ర విద్యాశాఖ మంత్రి వర్ష గైక్వాడ్‌, మరో మంత్రి కెసి పాడ్వి, బిజెపి ఎమ్మెల్యే సమీర్‌ మేఘేలకు వైరస్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. తనకు వైరస్‌ సోకిందని, స్వల్ప లక్షణాలు మాత్రమే ఉన్నాయని, ప్రస్తుతం ఐసోలేషన్‌లో ఉన్నట్లు వర్ష గైక్వాడ్‌ ప్రకటించారు. ఇటీవల తనను కలిసిన వారంతా జాగ్రత్తగా ఉండాలని, పరీక్షలు చేయించుకోవాలని కోరారు.  సోమవారం వరకు ఆమె అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు. దీంతో మరింత మందికి వ్యాపించి ఉంటుందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 


Also Read: Mother Teresa charity: మదర్ థెరిసా మిషనరీస్ అకౌంట్స్ ఫ్రీజ్ పై వివాదం... నిధులు వినియోగించవద్దని మాత్రమే చెప్పామని కేంద్రం స్పష్టం


వీరితో పాటు అసెంబ్లీలో పనిచేసే ప్రభుత్వ ఉద్యోగులు, అక్కడ భద్రతను పర్యవేక్షిస్తున్న పోలీసులకు కూడా కరోనా సోకింది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. కాంటాక్ట్‌ ట్రేసింగ్‌ చేపట్టి పరీక్షలు నిర్వహిస్తున్నారు.  మహారాష్ట్రలో కరోనా కేసులు కూడా నానాటికీ పెరుగుతుండటం కలవరపెడుతోంది. మంగళవారం ఒక్క రోజే 2వేలకు పైగా కొత్త కేసులు నమోదవ్వగా.. 22 మంది మరణించారు. ఇక రాష్ట్రంలో 167 ఒమిక్రాన్‌ కేసులు బయటపడ్డాయి. 


Also Read: అప్పట్లో మొగుడు వద్దని ప్రియుడే ముద్దని రచ్చ.. ఇప్పుడు ఏకంగా మాతాజీ అవతారం ! తమిళనాడును షేక్ చేస్తున్న మహిళ కన్నింగ్ స్టోరీ


మహారాష్ట్రలో కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కూడా విజృంభిస్తూండటంతో మహారాష్ట్ర ప్రభుత్వం అనేక ఆంక్షలు విధించింది. నూతన సంవత్సర వేడుకలపై కూడా నిషేధం విధించింది. అయినా కరోనా కేసులు మాత్రం పెరుగుతూనే ఉన్నాయి.  మహారాష్ట్ర ప్రభుత్వం వ్యాక్సినేషన్‌లోనూ దూకుడుగా ఉంది. డబుల్ డోస్‌ వ్యక్సిన్లను అత్యధికంగా  పంపిణీ చేసిన రాష్ట్రాల్లో మహారాష్ట్ర కూడా ఒకటి.


Also Read: Year Ender 2021: మోదీ షాకిచ్చిన 5 ప్రకటనలు..! సారీతో సంచలనం



ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి