Harmful Effects of Drinking Cold Water: ఎండలు దంచికొడుతున్నాయి. ఏప్రిల్ నెలలోనే టెంపరేచర్ ఒక రేంజ్ కి వెళ్లిపోతోంది. వేడిగాలులు విపరీతంగా వీస్తున్నాయి. దానివల్ల ఒకటే దాహం. దీంతో చాలామంది ఫ్రిజ్ లో పెట్టిన చల్లటి నీళ్లు తాగుతారు. ఐస్ వేసుకుని జ్యూస్‌లు, చిల్డ్ కూల్ డ్రింక్స్ తీసుకుంటారు. అదే పనిగా బాటిల్స్ నింపి కూల్ చేసుకుని మరీ తాగుతారు. అయితే, అలా చేస్తే ఆరోగ్యానికి హానికరం అని చెప్తున్నారు డాక్టర్లు. అలా తాగితే.. లేనిపోని కొత్త సమస్యలు తలెత్తుతాయని అంటున్నారు. మరి ఎండాకాలంలో చల్లటి నీళ్లు తాగితే ఎలాంటి ఇబ్బందులు వస్తాయో చూద్దాం.
డైజషన్ ప్రాబ్లమ్స్..
చల్లటి నీళ్లు తాగడం వల్ల తిన్న ఆహారం అరగదు. చల్లటి నీళ్లు పొట్టలో ఉండి.. ఆహారం అరగకుండా అడ్డుకుంటుంది. కడుపులో ఉష్ణోగ్రతల్లో ఒక్కసారిగా మార్పు రావడం వల్ల కూడా ఆహారం అరగదు. అంతేకాకుండా ఫుడ్ ప్రాసెస్ చేయడంలో కూడా ఇబ్బందులు తలెత్తుతాయి.
హార్ట్ రేట్ తగ్గిస్తుంది..
చల్లటి నీళ్లు తాగితే.. హార్ట్ రేట్ మెల్లిగా తగ్గిపోతుందని రిసెర్చ్ లో తేలింది. నాడీ వ్యవస్థ పనిచేసేందుకు ముఖ్యమైన వాగస్ నాడి పనితీరును దెబ్బతీస్తుంది. చల్లటి నీరు తాగితే నాడీ వ్యవస్థ దెబ్బతింటుంది. దానివల్ల.. హార్ట్ రేట్ తగ్గిపోతుంది.
గొంతులో ఇబ్బందులు..
సమ్మర్ లో చల్లటి నీళ్లు తాగితే అది గొంతు మీద కూడా ప్రభావం చూపుతుంది. గొంతు నొప్పి రావడం, ముక్కు కారడం లాంటివి ఇబ్బందులు వస్తాయి. బ్రీతింగ్ ప్రాబ్లమ్ వస్తుంది. చల్లటి నీళ్లు తాగడం వల్ల శ్వాసకోశలో ఇబ్బందులు తలెత్తుతాయి. ఎక్స్ ట్రా మ్యూకస్ ఏర్పడి గాలి పీల్చుకునేందుకు ఇబ్బంది అవుతుంది.
సైనస్..
ఎండాకాలంలో అదే పనిగా చల్లటి నీళ్లు తాగితే వెన్నెముకలోని నరాల్లో ఇబ్బంది ఏర్పడి, బ్రెయిన్ ఫ్రీజ్ అయినట్లు అనిపిస్తుంది. ఒక్కసారిగా టెంపరేచర్ డ్రాప్ అవ్వడంతో బ్రెయిన్ ఎఫెక్ట్ అవుతుంది. కారణంగా.. సైనస్, తలనొప్పి లాంటివి ఎక్కువ అవుతాయి.
పంటి సమస్యలు..
చల్లటి నీళ్లు పళ్లలోని నరాలపై ఎఫెక్ట్ చూపిస్తాయి. దాని వల్ల పన్ను నొప్పి వస్తుంది. పంటి సమస్యలు తలెత్తుతాయి. అందుకే, తక్కువ కూలింగ్ ఉన్న నీళ్లను తాగాలి. అంతేకాకుండా నొప్పి ఎక్కువ అయితే, కచ్చితంగా డాక్టర్ ని సంప్రదించాలి.
జాగ్రత్తలు తీసుకోవాలి..
ఎండలకు చల్లటి నీళ్లు తాగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు డాక్టర్లు. ఫ్రిజ్ లో పెట్టిన నీళ్లు, చిల్డ్ వాటర్, కూల్ డ్రింక్స్ లాంటివి తీసుకోవద్దని చెప్తున్నారు. కుండ నీళ్లు, మజ్జిగ లాంటివి తాగితే మంచిదని అంటున్నారు. పుచ్చకాయ, ఐస్ లేకుండా జూస్, మజ్జిగ లాంటివి తీసుకోవడం వల్ల బాడీ హైడ్రేటెడ్ గా ఉంటుందని, ఎండ దెబ్బ తగలకుండా ఉంటుందని అంటున్నారు.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.
Also Read: తల్లే కాదు, తండ్రి ఆహారపు అలవాట్లు కూడా పిల్లలకు ప్రమాదమే - ఇదిగో ఇలా!