Fact Check Chandrababu Photo : రాజకీయాల్లో ప్రత్యర్థుల్ని కించ పర్చడానికి ఫేక్ పోస్టులను, మార్ఫింగ్ ఫోటోలను వైరల్ చేయడం కామన్ గా మారింది. ఎక్కువగా ఇలాంటి ఫోస్టులే వైరల్ అవుతున్నాయి. సాధారణ జనం కూడా దీన్ని నిజం అని నమ్మే పరిస్థితి వచ్చింది. తాజాగా చంద్రబాబునాయుడు ఓ చోట కూర్చుని జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టోను ప్రకటిస్తున్న దృశ్యాలను చూస్తున్నట్లుగా సోషల్ మీడియాలో ఓ ఫోటో వైరల్ అయింది. ( ఇక్కడ )
అయితే ఇది ఫేక్ అని టీడీపీ అధికార సోషల్ మీడియా హ్యాండిల్ ద్వారా ప్రకటించారు.
క్లెయిమ్ : జగన్మోహన్ రెడ్డి ప్రకటిస్తున్న మేనిఫెస్టోను లైవ్ చూస్తున్న జగన్
ఫ్యాక్ట్ : చంద్రబాబునాయుడు ఫోటోను మార్ఫింగ్ చేశారు. నిజానికి ఆ ఫోటో రియల్ టైమ్ గవర్నెన్స్ సిస్టమ్ ఆర్టీజీఎస్ కార్యాలయం లోనిది. చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రధానమైన విషయాలను ఆర్టీజీఎస్ నుుంచి సమీక్షించేవారు. అక్కడ పెద్ద తెరపై నివేదికల్ని అధికారులు ప్రదర్శించేవారు. అలా నివేదికను ప్రదర్శిస్తున్న ఫోటోను కొంత మంది మార్ఫింగ్ చేసి ఎదురుగా స్క్రీన్ పై జగన్ మాట్లాడుతున్న బొమ్మను మార్ఫింగ్ చేశారు. దాన్నే చంద్రబాబు చూస్తున్నట్లుగా ప్రచారం చేశారు.
తెలుగుదేశం పార్టీ కూడా ఇదే విషయాన్ని ప్రకటించింది. ఆర్టీజీఎస్‌లో సమీక్ష చేస్తున్న ఫోటోను ఫేక్ చేశారని తెలిపింది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇటీవలి కాలంలో డీప్ ఫేక్ వీడియోలు, ఆడియోలు కూడా వైరల్ అవుతున్నాయి. కొన్ని ప్రముఖ సంస్థల వీడియోలను మార్ఫింగ్ చేసి.. మీడియా చానళ్ల పేరుతో ప్రచారం చేస్తున్నారు.
ఫేక్ వీడియోలను..ఫేక్ న్యూస్ ను మేము ఎప్పటికప్పుడు గుర్తించి ప్రజల్ని అప్రమత్తం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. నిజాలు తెలుసుకోవడం ప్రజల హక్కు.. తెలియచేయడం మా బాధ్యతగా భావిస్తున్నాము.