Jr Ntr Wearing Shirt Wiht Cycle Symbol :  ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీల సోషల్ మీడియా కార్యకర్తలు తమ పార్టీ లబ్ది కోసం ప్రత్యర్థి పార్టీకి నష్టం చేయడానికి అనేక రకాల ఫేక్ న్యూస్  స్ప్రెడ్ చేస్తున్నాయి. ఇటీవలి కాలంలో ఇవి మరీ పెరిగిపోయాయి. తాజాగా జూనియర్ ఎన్టీఆర్ సైకిల్ గుర్తుతో పాటు ఫ్యాన్ గుర్తు ఉన్న  ఉన్న తెల్లటి షర్టులను ధరించి ఎయిర్ పోర్టు నుంచి బయటకు వస్తున్న ఫోటోలను కొంత మంది వైరల్ చేశారు. చూసే వారికి ఇది నిజమేమో అనిపించేలా ఉన్న ఆ ఫోటో అసలుది కాదు మార్ఫింగ్ అని ఫ్యాక్ట్ చెక్ లో తేలింది. 





జూనియర్ ఎన్టీఆర్ ఇటీవల ఓ హిందీ సినిమా షూటింగ్ కోసం ముంబై వెళ్లారు. ఆ సమయంలో ఎయిర్ పోర్టు నుంచి బయటకు వస్తున్న సమయంలో  మీడియా ప్రతినిధులు ఫోటోలు తీశారు. ఆయన తెల్ల షర్టు ధరించి ఉన్నారు. దానిపై తెలుగుదేశం పార్టీ సింబల్ ను గ్రాఫిక్స్ తో చేర్చిన రాజకీయ పార్టీల సానుభూతిపరులు ప్రచారం చేసుకోవడం ప్రారంభించారు. 




కానీ అదంతా అబద్దమని ఫ్యాక్ట్ చెక్ లో తేలింది.  ఫిల్మ్ ఫేర్ సంస్థ ఈ ఫోటోలను తన సోషల్ మీడియా ఖాతాలో లో అప్ లోడ్ చేసింది. జూనియర్ ఎన్టీఆర్ ఎలాంటి లోగో లేని తెల్లటి షర్టును ధరించారు. 


 





 



జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం రాజకీయాలకు  దూరంగా ఉన్నారు. ఆయన పూర్తిగా సినిమాల మీద దృష్టి కేంద్రీకరించారు. అనేక మంది అనేక విధాలుగా ఒత్తిడి చేసినా..తనను రాజకీయాల్లోకి లాగేందుకు  ప్రయత్నిస్తున్నా ఆయన నోరు విప్పడం లేదు. 


అయితే జూనియర్ ఎన్టీఆర్ గతంలో తెలుగుదేశం పార్టీకి పని చేశారు. ప్రచారం చేశారు. 2009 ఎన్నికల సమయంలో ఆయన తెలుగు రాష్ట్రాల్లో విస్తృతంగా ప్రచారం చేశారు. అయితే ప్రచారం చేసి తిరిగి వస్తూ ఖమ్మం వద్ద జరిగిన ప్రమాదంలో ఆయన గాయపడ్డారు. ఆ తర్వాత రాజకీయ కార్యక్రమాలకు  తక్కువగా హాజరయ్యారు. క్రమంగా తెలుగుదేశం పార్టీ కార్యక్రమాల్లోనూ పాల్గొనడం పూర్తిగా తగ్గించారు. తన కట్టె కాలే వరకూ తన పార్టీ టీడీపీనేనని గతంలో ప్రకటించారు. కానీ ఇప్పుడు తన విషయంలో రాజకీయ చర్చలు జరగాలని అనుకోవడం లేదు. అందుకే పూర్తి స్థాయిలో దూరం పాటిస్తున్నారు. టీడీపీ కార్యక్రమాలకూ  హాజరు కావడం లేదు. మద్దతు ఇస్తున్నానని కూడా చెప్పడం లేదు. తన సోదరి నందమూరి సుహాసిని టీడీపీ తరపున గతంలో కూకట్ పల్లి నుంచి పోటీ చేసినా మద్దతుగా ప్రచారం చేయలేదు.    కొంత మంది ఫ్యాన్ గుర్తు షర్టుపై గ్రాఫిక్స్ వేసి వైరల్ చేస్తున్నారు.  ఇదంతా పూర్తి స్థాయిలో ఫేక్ న్యూస్ గా తేలింది.