యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యామిలీతో అమెరికా ట్రిప్‌లో ఉన్నారు. యూఎస్‌లో ఒక ఇండియన్ రెస్టారెంట్ జూనియర్ ఎన్టీఆర్‌ను విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఒక అంతర్జాతీయ ట్రిప్‌లో తను తిన్న అత్యుత్తమ భారతీయ ఫుడ్ ఇక్కడేనని ఇన్‌స్టాగ్రామ్‌లో స్టోరీ పెట్టారు. అక్కడి చెఫ్‌లతో కూడా ఫొటో దిగారు. జూనియర్ ఎన్టీఆర్ మంచి భోజన ప్రియుడన్న సంగతి తెలిసిందే. కేవలం తినడం మాత్రమే కాకుండా తారక్‌లో మంచి చెఫ్ కూడా ఉన్నాడు.
ఎన్టీఆర్, రామ్‌చరణ్ నటించిన ఆర్ఆర్ఆర్ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఎన్నో అవార్డులు సాధిస్తూ దూసుకుపోతుంది. ఆస్కార్ అవార్డుల్లో కూడా బెస్ట్ ఒరిజినల్ సాంగ్‌కు ‘నాటు నాటు’ నామినేట్ అవ్వడం విశేషం. ప్రతిష్టాత్మకమైన గోల్డెన్ గ్లోబ్ అవార్డుల్లో కూడా రెండు అవార్డులకు ఆర్ఆర్ఆర్ నామినేట్ అయింది.
ఇదే ట్రిప్‌లో అమెరికా నుంచి ఎన్టీఆర్ ఇప్పటికే ఒక ఫోటో షేర్ చేశారు. ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఆ ఫొటోలో తారక్ తన శ్రీమతి ప్రణతితో ఉన్నారు. ఒక రెస్టారెంటులో చాలా మంది మధ్యలో ప్రణతిని ప్రేమగా కౌగిలించుకున్న ఫొటో అది. దానికి మూడు రెడ్ హార్ట్ లవ్ సింబల్ ఎమోజీలు కూడా యాడ్ చేసి పోస్ట్ చేశారు. ఫోటో కొంచెం క్లారిటీగా లేదు గానీ ఎన్టీఆర్ ప్రేమ మాత్రం క్లారిటీగా కనబడుతోంది.
నెల రోజులు అమెరికాలోనే!
ఎన్టీఆర్ ఫ్యామిలీ అమెరికా ట్రిప్ నెల రోజులు ఉంటుందని తెలుస్తోంది. కొత్త ఏడాదికి అక్కడే ఆయన వెల్‌కం చెప్పనున్నారు. అలాగే అమెరికాలో క్రిస్మస్ వేడుకలను కూడా వీక్షించనున్నారు. మధ్యలో కొంత మంది బంధువులు, ఫ్యామిలీ ఫ్రెండ్స్, అభిమానులను ఎన్టీఆర్ కలిసి అవకాశం ఉంది. ఇటీవల దర్శక ధీరుడు రాజమౌళి అమెరికా వెళ్ళారు. చికాగోలో 'ఆర్ఆర్ఆర్' ఆస్కార్ నామినేషన్స్ కోసం ప్రచారం కూడా చేశారు. మరి, ఎన్టీఆర్ టూర్ ప్లానింగులో అటువంటి కార్యక్రమం ఉందో? లేదో? తెలియాలి.
ఆర్ఆర్ఆర్‌కు సీక్వెల్ కూడా ఉందని ఎస్ఎస్ రాజమౌళి, విజయేంద్ర ప్రసాద్ వేర్వేరు ఇంటర్వ్యూల్లో చెప్పారు. దీనికి సంబంధించిన రైటింగ్ ప్రాసెస్ కూడా స్టార్ట్ అయిందని తెలిపారు. రాజమౌళి ప్రస్తుతం మహేష్ బాబు సినిమా, ఆర్ఆర్ఆర్ ఆస్కార్ ప్రమోషన్లలో బిజీగా ఉన్నారు. మరి ఆర్ఆర్ఆర్ 2 ఎప్పటికి మెటీరియలైజ్ అవుతుందో చూడాలి!