The Way of Water: డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ తెరకెక్కించిన విజువల్ వండర్ 'అవతార్ 2'.. దాదాపు 13 సంవత్సరాల తర్వాత అవతార్ సినిమాకు సీక్వెల్ గా వచ్చింది. "అవతార్ ది వే ఆఫ్ వాటర్" పేరుతో రూపొందించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ హిట్ ను సొంతం చేసుకుంది. గతేడాది డిసెంబర్ లో థియేటర్లలో ఈ సినిమా రిలీజ్ కాగా.. ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లను రాబట్టి రికార్డులు సృష్టించింది. ఈ చిత్రాన్ని ఓటీటీలో ఎప్పుడు విడుదల చేస్తారా అని ఎదురుచూస్తోన్న ప్రేక్షకులకు మేకర్స్ గుడ్ న్యూస్ చెప్పారు.
ఈ సినిమా ఓటీటీలో మార్చి 28వ తేదీ నుంచే స్ట్రీమింగ్ అవుతోంది. యాపిల్ టీవీ, ప్రైమ్ వీడియో, వుడు, గూగుల్ ప్లే, ఎక్స్ ఫినిటీ, ఏఎంసీ అండ్ మైక్రోసాఫ్ట్ లాంటి ఫ్లాట్ ఫామ్స్ లో ఇప్పటికే స్ట్రీమింగ్ అవుతోంది. కానీ ఇది పేయిడ్ మోడ్ లో మాత్రమే అందుబాటులో ఉంది. దీని రెంటల్ ధర 19.9 డాలర్లు అంటే రూ.1639 గా ఉంది. ఇప్పటి వరకు ఈ సినిమాను రెంట్ ప్రాతిపదికన పలు డిజిటల్ ఫ్లాట్ ఫామ్స్ అందుబాటులోకి తీసుకు వచ్చాయి. ఇప్పుడు ఎలాంటి రెంటల్ పేమెంట్ లేకుండా, ఫ్రీగా చూసేందుకు అవకాశం కల్పిస్తున్నాయి ఓటీటీ సంస్థలు.
ఈ సందర్భంగా మేకర్స్ ఓ క్రేజీ అప్ డేట్ ను ఇచ్చారు. 'అవతార్ ది వే ఆఫ్ వాటర్' సినిమాను జూన్ 7వ తేదీ నుంచి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వేదికగా స్ట్రీమింగ్ కాబోతుందని మేకర్స్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. దాంతో పాటు ఈ సినిమా తెలుగు, ఇంగ్లీష్, హిందీ, తమిళ, మలయాళం భాషల్లో విడుదల కానుందంటూ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది. దాంతో పాటు మూవీకి సంబంధించిన ఓ ఇంట్రస్టింగ్ పోస్టర్ ను కూడా షేర్ చేసింది.
'అవతార్ 2' సినిమా ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 2.9 బిలియన్ల డాలర్ల వసూళ్లను రాబట్టి రికార్డు సృష్టించింది. హాలీవుడ్ లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన చిత్రంగా నిలిచింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా మొత్తం రూ.60.74 కోట్ల షేర్ వసూలు చేయగా.. కేవలం 5 కోట్ల రూపాయల థియేట్రికల్ బిజినెస్ జరగినట్టు సమాచారం. రూ.5.25 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సినిమా.. అవతార్ మొదటి భాగంలో పండోరా గ్రహం, అడవులు, పక్షులు, జంతువులతో కామెరూన్ ఓ కొత్త లోకాన్ని సృష్టించారు.
'అవతార్ 2'లో మాత్రం కామెరూన్ జలచరాలతో మెస్మరైజ్ చేశాడు. సముద్ర అడుగు భాగంలో జరిగే సన్నివేశాలు చాలా థ్రిల్లింగ్ గా రూపొందించి అందర్నీ ఆకట్టుకునేలా చేశారు. క్వారిచ్ నుంచి తప్పించుకోవడానికి జేక్, నేట్రి ఎలాంటి పోరాటం సాగించారన్నది గ్రాఫిక్స్ ద్వారా జేమ్స్ కామెరూన్ అద్భుతంగా సిల్వర్ స్క్రీన్ పై ఆవిష్కరించారు. 'అవతార్ 3' కూడా రాబోతున్నట్లు దాన్ని 2024లో విడుదల చేయబోతున్నట్లు కామెరూన్ ప్రకటించారు.
Read Also : దుల్కర్ సల్మాన్‌తో ‘సార్’ మూవీ డైరెక్టర్ పాన్ ఇండియా సినిమా