Jeeva - Yatra - 2 Remuneration: 'యాత్ర - 2' సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఫిబ్రవరి 8న ఈ సినిమాని రిలీజ్ చేశారు. జగన్ ఫ్యాన్స్ ని ఈ సినిమా తెగ ఆకట్టుకుంటోంది. సినిమా సూపర్ అంటూ రివ్యూలు ఇచ్చేస్తున్నారు ఆయన ఫ్యాన్స్. ఇక ఈ సినిమాలో జగన్ పాత్రలో నటించారు హీరో జీవా. వైఎస్సార్ పాత్రలో మమ్ముటి కనిపించారు. దివంగత సీఎం రాజశేఖర్ రెడ్డి రాజకీయ జీవితం గురించి తెరకెక్కించిన 'యాత్ర' సినిమాకి కొనసాగింపుగా.. ఈ 'యాత్ర - 2' సినిమా తీశారు. వైయస్సార్ మరణం నుంచి ఏపీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసే వరకు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జీవితంలో జరిగిన పరిణామాల సమాహారమే 'యాత్ర 2'. ఇక ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి బడ్జెట్, రెమ్యునరేషన్ గురించి ఒక వార్త సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.
జీవా రెమ్యునరేషన్ అన్ని కోట్లా?
'యాత్ర', 'యాత్ర - 2' సినిమాలకు మహి వి రాఘవ్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాని దాదాపు రూ.53 కోట్లతో నిర్మించారట. ఇక ఈ బడ్జెట్ లో ప్రొడక్షన్ కంటే.. నటీనటులకు ఇచ్చిన రెమ్యునరేషన్‌కే ఎక్కువ ఖర్చు అయినట్లు ఫిలిమ్ సర్కిల్ లో చర్చ జరుగుతోంది. జగన్ పాత్రలో నటించిన జీవా దాదాపు రూ.8 కోట్లు రెమ్యునరేషన్ తీసుకున్నారట. ఇక మమ్ముటి రూ.3 కోట్లు రెమ్యునరేషన్ అందుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్, సినిమాటోగ్రాఫర్ ముగ్గురి రెమ్యునరేషన్లు కలిపి రూ.10 కోట్లు అని సమాచారం.
పర్ఫెక్ట్ గా సెట్ అయిన జీవా..
తమిళ హీరో జీవా ముందు నుంచే తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. ఆయన నటించిన సినిమాలు తెలుగులో కూడా రిలీజ్ అయ్యి.. మంచి టాక్ తెచ్చుకున్నాయి. ఇక ఇప్పుడు 'యాత్ర -2' లో కూడా ఆయన నటనతో అందరినీ మెప్పించారు. జగన్ మోహన్ రెడ్డి క్యారెక్టర్ లో ఆయన పర్ఫెక్ట్ గా సెట్ అయ్యారు. ‘యాత్ర 2’లో హీరోగా, వైఎస్ జగన్ పాత్రలో జీవా నటిస్తే బాగుంటుందని మహీ వి రాఘవ ముందు నుండే ప్లాన్ చేసుకున్నాడట. వైఎస్ జగన్ పాత్రలో జీవా సరిగ్గా సరిపోయాడని ఫస్ట్ లుక్‌ను చూసినప్పటి నుంచి ప్రేక్షకులు భావించారు. ఆయన్ను స్క్రీన్ పైన చూసేందుకు చాలా ఎక్సైట్ అయ్యారు. ఇక ఇప్పుడు సినిమా రిలీజ్ అయిన తర్వాత జగన్ ఫ్యాన్స్ అంతా.. జీవాకి కూడా పెద్ద ఫ్యాన్ప్ అయిపోయారట. వైఎస్సార్ క్యారెకర్టర్ లో నటించిన మమ్ముటి కూడా చాలా కరెక్ట్ గా సెట్ అయ్యారు. అది యాత్ర సినిమాలోనే తెలిసిపోయింది. ఇక ఈ ఇద్దరే కాదు.. సినిమాలో ఉన్న క్యారెక్టర్లు అన్నీ చాలా చక్కగా కుదిరాయని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు.
త్రీ ఆటమ్ లీవ్స్, వీ సెల్యూలాయిడ్ సంస్థలతో కలిసి శివ మేక 'యాత్ర 2' చిత్రాన్ని నిర్మించారు. 'యాత్ర' విడుదలైన ఫిబ్రవరి 8న ఐదేళ్ల తర్వాత 'యాత్ర 2' సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. వైఎస్ భారతిగా కేతికా నారాయణన్, సోనియాగా సుజానే పర్ఫెక్ట్ గా సూట్ అయ్యారు.
Also Read: మేకప్ వద్దన్నారు, జోక్ చేస్తున్నారనుకున్నా - 'దిల్ సే' మూవీపై ప్రీతి జింతా కామెంట్స్