టాలీవుడ్ స్టార్ హీరోల్లో ప్రజెంట్ ప్రభాస్ కు ఉన్న లైనప్ మారే ఇతర హీరోకి లేదనే చెప్పాలి.  ఒకటి రెండు కాదు... ఏకంగా ఐదు సినిమాలు చేస్తున్నాడు యంగ్ రెబల్ స్టార్. అన్నీ భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమాలే. సారీ... పాన్ వరల్డ్ అని చెప్పాలేమో! ఎందుకంటే... నాగ్ అశ్విన్, అర్జున్ రెడ్డి వంగాతో చేస్తున్న సినిమాలు భారతీయ భాషల్లో మాత్రమే కాకుండా విదేశీ భాషల్లోనూ విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.


ప్రజెంట్ ప్రభాస్ సినిమాల జాబితాకు వస్తే... 'జిల్' ఫేమ్ రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో చేస్తున్న 'రాధే శ్యామ్' వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానుంది. ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ఆ సినిమా టీజర్ ఒక్కటే విడుదలైంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'సలార్', ఓం రౌత్ దర్శకత్వంలోని 'ఆది పురుష్', నాగ్ అశ్విన్ దర్శకత్వంలో 'ప్రాజెక్ట్ కె' (వర్కింగ్ టైటిల్) షూటింగ్స్ స్టార్ట్ అయ్యాయి. సందీప్ రెడ్డి వంగా సినిమా 'స్పిరిట్' అనౌన్స్ చేశారంతే! ఇంకా షూటింగ్ స్టార్ట్ చేయలేదు. ప్రభాస్ పుట్టినరోజు నాడు ఈ నాలుగు సినిమాల నుండి ఏదో ఒక అప్ డేట్ వస్తుందని ఎదురు చూశారు. కానీ, రాలేదు. 


ఆల్రెడీ 'సలార్' లుక్ విడుదలైంది. ఆ సినిమా నుండి టీజర్ విడుదల కావచ్చని అభిమానులు ఆశించారు. 'ఆది పురుష్' ఫస్ట్ లుక్ విడుదల అవుతుందని ఆశగా ఎదురు చూశారు.  అయితే... అందరూ పుట్టినరోజు శుభాకాంక్షలు మాత్రమే చెప్పి ఊరుకున్నారు. లుక్స్ లేదా టీజర్ విడుదల చేయకుండా ఆ నలుగురు మౌనంగా ఉన్నారు. దీనికి కారణం 'రాధే శ్యామ్' అని తెలుస్తోంది. 


'రాధే శ్యామ్' విడుదలకు మరో రెండు నెలలు మాత్రమే ఉంది. ఇప్పటివరకు సినిమా నుండి స్టిల్స్ తప్ప ఏవీ రిలీజ్ కాలేదు. ప్రభాస్ పుట్టినరోజున టీజర్ విడుదల చేయాలనుకున్నారు. మిగతా సినిమాల నుండి అప్ డేట్స్ వస్తే ఫ్యాన్స్ కాన్సంట్రేషన్ అంతా 'రాధే శ్యామ్' టీజర్ మీద ఉండదు. అందుకని, వాళ్లను రిక్వెస్ట్ చేసి ఏవీ విడుదల కాకుండా చూశారని సమాచారం. అందువల్ల, ఆ నలుగురు మౌనంగా ఉన్నారట. 


పవన్ కల్యాణ్ పుట్టినరోజు నాడు 'భీమ్లా నాయక్' టీమ్ ఇదే విధంగా చేసింది. ఆ రోజు 'భీమ్లా నాయక్'టైటిల్ సాంగ్ తప్ప... పవన్ నటిస్తున్న ఇతర సినిమా నుండి అప్ డేట్స్ ఏవీ రాలేదు. దాంతో ఫ్యాన్స్, ఆడియన్స్ అటెన్షన్ అంతా ఆ పాటపైన పడింది. ఇప్పుడు అదే విధంగా 'రాధే శ్యామ్' టీజర్ టాపిక్ అయ్యింది. ట్రెండ్ అయ్యింది. 


 

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి