పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఈ పేరుకున్న వైబ్రేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు. తమ అభిమాన హీరో పుట్టినరోజు కావడంతో.. ఫ్యాన్స్ ఫుల్ జోష్ లో ఉన్నారు. ముందు నుంచే బర్త్ డే సెలబ్రేట్ చేస్తున్నారు. పవర్ స్టార్ ఫాలోయింగ్ కు హిట్లు.. ప్లాపులతో సంబంధం ఉండదు. పవర్ స్టార్ పేరు చెప్పగానే ఊగిపోయే అభిమానులు ఉన్నారు.


Also Read: Bheemla Nayak Title Song: భీమ్లా నాయక్ టైటిల్ సాంగ్.. 12 నిమిషాల్లోనే లక్షకు పైగా లైక్స్.. ట్రెండ్ సెట్ చేస్తున్న పవర్ స్టార్!


పవర్ స్టార్ అని పేరుకు తగ్గట్టే.. దూసుకుపోతున్న పవన్ కళ్యాణ్ కు ఆ పేరు ఎవరు పెట్టారో తెలుసా.. నటుడు, రచయిత పోసాని కృష్ణమురళి. ఆయనే మెుదటి సారిగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అని పిలిచారు. ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో పవన్ నటించిన  గోకులంలో సీత  బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాకి పోసాని కృష్ణమురళి మాటలు అందించారు. ఈ చిత్రం విడుదల సందర్భంగా పోసాని తొలిసారిగా మీడియా సమావేశంలో పవన్ కళ్యాణ్‌ను పవర్ స్టార్ అని పిలిచారు.


Also Read: Pawan Kalyan movie Update: ఒక వైపు క్రిష్, మరో వైపు సురేందర్ రెడ్డి, హరీష్ శంకర్.. పవన్ మూవీస్ అప్‌డేట్స్ ఇవే


ఆ తర్వాత చాలా పత్రికలు పవన్ కళ్యాణ్ పేరుకు ముందు పవర్ స్టార్  అని కథనాలు రాయగా.. ఆ తర్వాత సూపర్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్‌లో వచ్చిన ‘సుస్వాగతం’ సినిమాకి తొలిసారిగా పవన్ కళ్యాణ్ పేరుకు ముందు పవర్ స్టార్  అనే టైటిల్ కార్డ్ వేశారు. అలా పోసానినే పవన్ కు పవర్ స్టార్ అనే  పేరు పెట్టారు.


Also Read: Pavan Kalyan Birthday: పవన్ బర్త్ డే సందర్భంగా దేవిశ్రీప్రసాద్ ఇచ్చిన గిఫ్ట్ చూశారా?


పవర్ స్టార్.. బర్త్ డే సందర్భంగా ‘భీమ్లా నాయక్’ సినిమా నుంచి తొలి పాటను విడుదల చేసింది చిత్రబృందం.  పవన్ కల్యాణ్‌,  రానా కాంబోలో తెరకెక్కుతున్న ఈ మూవీ  మలయాళ సినిమా అయ్యప్పనుమ్ కోషియం తెలుగు రీమేక్‌. ఇప్పటికే ఈ సినిమా నుంచి  ఫస్ట్ లుక్ ను కూడా విడుదల చేశారు. ఈరోజు ఈ మూవీ నుంచి  బీమ్లా నాయక్ టైటిల్ సాంగ్ ను ఉదయం 11:16 గంటలకు విడుదల చేశారు. సెభాష్‌.. ఆడాగాదు ఈడాగాదు అమీరోళ్ల మేడాగాదు’ అంటూ సాగే జానపద గీతంతో మొదలయ్యే ఈ పాట  ఆకట్టుకుంటోంది.


Also Read: Pawan Kalyan: ప్రతి క్షణం పరితపించే నిప్పు కణం కళ్యాణ్.. పవన్‌కు చిరంజీవి విషెస్.. బన్నీ, మహేష్ సైతం..