పూనకాలు లోడింగ్... 'వాల్తేరు వీరయ్య' సినిమా స్టార్ట్ చేసినప్పటి నుంచి, ఆ టైటిల్ ఖరారు చేయక ముందు నుంచి దర్శకుడు బాబీ కొల్లి (కె.ఎస్. రవీంద్ర) చెబుతున్న మాట. అసలు, పూనకాలు లోడింగ్ అంటే ఎలా ఉంటుందో... సంక్రాంతికి వస్తున్న సినిమా ఎలా ఉండబోతుందో... చెప్పడానికి అన్నట్లు ఈ రోజు ట్రైలర్ విడుదల చేశారు.


మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) కథానాయకుడిగా, మాస్ మహారాజా రవితేజ  (Ravi Teja) ప్రత్యేక ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'వాల్తేరు వీరయ్య' (Waltair Veerayya Movie). పూనకాలు లోడింగ్... అనేది ఉపశీర్షిక. ఇందులో చిరు జోడీగా శ్రుతీ హాసన్, రవితేజకు జంటగా కేథరిన్ ట్రెసా నటించారు. సంక్రాంతి కానుకగా సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ రోజు ట్రైలర్ విడుదల చేశారు.
 
'వాల్తేరు వీరయ్య' ట్రైలర్ ఎలా ఉందంటే?
Waltair Veerayya Trailer Review : వింటేజ్ మెగాస్టార్, మాస్ రవితేజ, యాక్షన్ అండ్ కామెడీ ప్లస్ రొమాన్స్ కలిపితే 'వాల్తేరు వీరయ్య' సినిమా అనే విధంగా ట్రైలర్ కట్ చేశారు. ఇందులో చిరంజీవి ఇంటర్నేషనల్ డ్రగ్స్ డీలర్ అని రివీల్ చేశారు. ఆయన్ను పట్టుకోవడానికి వచ్చిన పోలీస్ అధికారిగా రవితేజ కనిపించారు. 


'మాస్ అనే పదానికి బొడ్డు కోసి పేరెట్టింది ఆయన్ను చూసి...' చిరంజీవి గురించి ఓ క్యారెక్టర్ చెప్పే డైలాగ్, 'రికార్డుల్లో నా పేరు ఉండటం కాదు, నా పేరు మీద రికార్డులు ఉంటాయి' అని మెగాస్టార్ చెప్పే మాట అభిమానులకు మాంచి కిక్ ఇచ్చేలా ఉన్నాయి. చిరంజీవి, రవితేజ మీద కట్ చేసిన కొన్ని షాట్లు బావున్నాయి. ఫుల్ మాస్ మీల్స్ సినిమాలా ఉంది... ట్రైలర్ చూస్తుంటే!


ట్రైలర్ చివర్లో 'హలో మాష్టారు! ఫేస్ కొంచెం లెఫ్ట్ టర్నింగ్ ఇచ్చుకోండి. ఒక్కొక్కడికి బాక్సులు బద్దలైపోతాయి' అని రవితేజ వార్నింగ్ ఇవ్వడం... 'ఏంట్రా బద్దలయ్యేది? ఈ సిటీకి నీలాంటి కమీషనర్లు ఎంతో మంది వస్తారు, పోతారు. కానీ, వీరయ్య లోకల్' అని చిరంజీవి కౌంటర్ ఇవ్వడం హైలైట్. థియేటర్లలో ఈ సన్నివేశాలకు అభిమానులకు మెగా మాస్ పూనకాలే!


Also Read : తెలిసినప్పుడు చెబుతా - ఈసారి పెళ్ళిపై ప్రభాస్ ఏం చెప్పాడో చూశారా?



విశాఖలో ప్రీ రిలీజ్...
జనవరి 8న... అనగా ఈ ఆదివారం విశాఖలో 'వాల్తేరు వీరయ్య' ప్రీ రిలీజ్ ఫంక్షన్ (Waltair Veerayya Pre Release Function) నిర్వహించడానికి ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. తొలుత అనుమతులు వస్తాయా? లేదా? అని కొంత సందిగ్ధ పరిస్థితి నెలకొంది. ఏయూ గ్రౌండ్స్ లో వేడుకకు అనుమతి ఇచ్చామని... ఆర్.కె. బీచ్ ఫంక్షన్ ఏర్పాట్లు తమకు తెలియవని విశాఖ సీపీ తెలిపారు. తొలుత బీచ్ రోడ్డులో వేడుక చేసుకుంటామని అనుమతి అడిగారని, ఆ తర్వాత ఏయూ అన్నారని ఆయన చెబుతున్నారు. మళ్ళీ బీచ్ రోడ్డులో వేడుకకు ఏర్పాట్లు జరుగుతున్నట్టు తమకు తెలియదన్నారు.
 
నీకేమో అందం ఎక్కువ...
నాకేమో తొందర ఎక్కువ
'వాల్తేరు వీరయ్య'లో చిరంజీవి, శ్రుతీ హాసన్ మీద తెరకెక్కించిన మరో పాట ఉంది. 'నీకేమో అందం ఎక్కువ... నాకేమో తొందర ఎక్కువ' అంటూ ఆ పాట సాగుతుందని మెగాస్టార్ ఆల్రెడీ లీక్ ఇచ్చేశారు. అంతే కాదు... మేకింగ్ వీడియో వీడియోను కొన్ని రోజుల క్రితం విడుదల చేశారు. ఆ పాటను ఎప్పుడు విడుదల చేస్తారు? అని ఫ్యాన్స్ అండ్ ఆడియన్స్ వెయిటింగ్. 


Also Read : '3Cs' వెబ్ సిరీస్ రివ్యూ : అమ్మాయిలు డ్రగ్స్ కలిపిన వోడ్కా తాగి, ఆ 'హ్యాంగోవర్'లో రచ్చ చేస్తే?  


ఆల్రెడీ విడుదలైన 'బాస్ పార్టీ' ఆడియన్స్‌లోకి బాగా వెళ్ళింది. 'నువ్వు శ్రీదేవి అయితే నేను చిరంజీవి'కి కూడా మంచి స్పందన లభిస్తోంది. 'డోంట్ స్టాప్ డాన్సింగ్... పూనకాలు లోడింగ్' అంటూ వచ్చిన పాట కూడా పబ్బులు, పార్టీలు, డీజేల్లో వినిపించేలా ఉంది. నేపథ్య సంగీతం ఎలా ఉంటుందో చూడాలి. 


జనవరి 13న థియేటర్లలో విడుదల
సంక్రాంతి బరిలో చివరగా థియేటర్లలోకి వస్తున్న సినిమా 'వాల్తేరు వీరయ్య'. మెగా ఫ్యాన్స్, మాస్ మహారాజా ఫ్యాన్స్ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు. తొలుత తమ సినిమాకు థియేటర్లు, ప్రచారం విషయంలో అన్యాయం జరుగుతుందని కొంత కినుక వహించినా... ఇప్పుడు హ్యాపీగా ఉన్నారట. పాటలకు లభిస్తున్న స్పందన వాళ్ళకు సంతోషాన్ని కలిగిస్తోంది. 


ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, యలమంచిలి రవి శంకర్ నిర్మిస్తున్నారు. చిత్ర దర్శకుడు బాబీ కథ, మాటలు రాయగా... స్క్రీన్‌ప్లే : కోన వెంకట్, కె చక్రవర్తి రెడ్డి అందిస్తున్నారు. హరి మోహన కృష్ణ, వినీత్ పొట్లూరి రైటింగ్ డిపార్ట్‌మెంట్‌లో పని చేస్తున్నారు. ఇంకా ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ : ఆర్థర్ ఎ విల్సన్, ఎడిటర్: నిరంజన్‌ దేవరమానె, ప్రొడక్షన్‌ డిజైనర్: ఎఎస్‌ ప్రకాష్‌, కాస్ట్యూమ్ డిజైనర్: సుష్మిత కొణిదెల, సహ నిర్మాతలు: జీకే మోహన్, ప్రవీణ్ ఎం.