సంక్రాంతి కానుకగా జనవరి 13న థియేటర్లలో విడుదలైన ‘వాల్తేరు వీరయ్య’ సినిమా బాక్సాఫీస్ దగ్గర దుమ్ము రేపుతోంది. మొదటి మూడు రోజుల్లోనే రూ.100 కోట్లకు పైగా వసూలు చేసింది. యాక్షన్ కామెడీ-డ్రామాతో తెరకెక్కిన ఈ సినిమాలో చిరంజీవి, రవితేజ అద్భుత నటన ప్రేక్షకులను ఓ రేంజిలో అలరిస్తోంది. బాబీ కొల్లి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో శ్రుతి హాసన్, కేథరిన్ థ్రెసా, ప్రకాష్ రాజ్ కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాలో ACP విక్రమ్ సాగర్ గా నటించిన రవితేజ సహా చిరంజీవి భారీ మొత్తంలో రెమ్యునరేషన్ తీసుకున్నట్లు సమాచారం. 


‘వాల్తేరు వీరయ్య‘ కోసం ఎవరెవరు ఎంత పరితోషికం తీసుకున్నారంటే..


1. రవితేజ


రవితేజ.. ఈ సినిమాలో వీరయ్య సోదరుడు ఏసీపీ విక్రమ్ సాగర్ పాత్రలో నటించారు. 30 రోజుల్లో సినిమా షూటింగ్‌  పూర్తి చేసిన మాస్ మహరాజ.. ఏకంగా రూ.17 కోట్లు రెమ్యునరేషన్ తీసుకున్నారట.


2. శృతి హాసన్


తెలుగు, తమిళ్, హిందీ సినిమాల్లో రాణిస్తున్న శ్రుతి హాసన్, ఈ చిత్రంలో రా ఏజెంట్ గా కనిపించింది. ఇందుకు ఆమె రూ. 2.5 కోట్లు తీసుకుందట.


3. కేథరిన్ థెరిసా


నటి కేథరిన్ థెరిసా ACP విక్రమ్ సాగర్ భార్య డాక్టర్ నిత్య పాత్ర పోషించింది. ఆమె నటనకు గాను రూ. 75 లక్షల రూపాయలను పారితోషికంగా తీసుకుందట.


4. రాజేంద్ర ప్రసాద్


ప్రముఖ నటుడు రాజేంద్ర ప్రసాద్ ఇందులో ఎస్ఐ సీతాపతి పాత్ర చేశారు. ఇందుకు ఆయన రూ. 40 లక్షలు తీసుకున్నారట.   


5. ప్రకాష్ రాజ్


ప్రకాష్ రాజ్ ఈ చిత్రంలో విలన్ మైఖేల్ సీజర్ గా కనిపించారు. ఇందులో తన నటనకు గాను ఆయన రూ.1.5 కోట్లను అందుకున్నారట.   


6. బాబీ సింహా


 బాబీ సింహా ‘వాల్తేరు వీరయ్య’ సినిమాలో గ్యాంగ్‌స్టర్ పాత్ర పోషించారు. మైఖేల్ తమ్ముడు సోలమన్ సీజర్ పాత్రలో నటించి మెప్పించారు. ఈ మూవీలో తన పాత్ర కోసం ఆయన రూ. 85 లక్షలు తీసుకున్నారట.


7. ఊర్వశి రౌతేలా


‘వాల్తేరు వీరయ్య’ సినిమాలో ఊర్వశి రౌతేలా స్పెషల్ సాంగ్ చేసింది. ఈ పాట కోసం ఆమె ఏకంగా రూ. 2 కోట్లు వసూలు చేసిందట. ‘బాస్ పార్టీ’ పేరుతో సాగే ఈ పాట ప్రేక్షకులను బాగా అలరించింది.


8. చిరంజీవి


ఈ చిత్రంలో టైటిల్ రోల్ సోషించిన చిరంజీవి ఏకంగా రూ.50 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నారని తెలిసింది. ఇది చిరు కెరీర్ లోనే అతి పెద్ద రెమ్యునరేషన్ గా ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. 






Read Also: దానయ్యతో సినిమా అటకెక్కినట్లేనా? అడ్వాన్స్ తిరిగిచ్చేసిన ప్రభాస్?