Stocks to watch today, 18 January 2023: ఇవాళ (బుధవారం) ఉదయం 7.30 గంటల సమయానికి, సింగపూర్‌ ఎక్సేంజ్‌లో నిఫ్టీ ఫ్యూచర్స్‌ (SGX Nifty Futures) 56 పాయింట్లు లేదా 0.31 శాతం గ్రీన్‌ కలర్‌లో 18,132 వద్ద ట్రేడవుతోంది. మన స్టాక్‌ మార్కెట్‌ ఇవాళ పాజిటివ్‌గా ప్రారంభం అవుతుందని SGX నిఫ్టీ సూచిస్తోంది. 


ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్‌ ఇవి:


ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌: 2022-23 ఆర్థిక సంవత్సరంలోని Q3 ఫలితాలను ఈ బ్యాంక్‌ ఇవాళ వెల్లడించనుంది. లోన్‌ బుక్‌లో స్థిరమైన వృద్ధి నేపథ్యంలో ఫలితాల్లో స్ట్రాంగ్ నంబర్లను ఈ లెండర్‌ రిపోర్ట్‌ చేస్తుందని భావిస్తున్నారు. అయితే, మార్జిన్‌ విషయంలో ఎక్స్‌పర్ట్‌ల మధ్య భిన్నాభిప్రాయాలు ఉన్నాయి.


ITC: యోగా బార్‌ బ్రాండ్‌తో అమ్మకాలు సాగిస్తున్న డైరెక్ట్‌ టు కన్జ్యూమర్‌ (D2C)  స్టార్టప్‌ స్ప్రౌట్‌లైఫ్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్‌ను (Sproutlife Foods Pvt Ltd) కొనుగోలు చేసేందుకు ఐటీసీ ఒక ఒప్పందం మీద సంతకం చేసింది. వేగంగా అభివృద్ధి చెందుతున్న న్యూట్రిషన్‌ ఫుడ్‌ స్పేస్‌లో ఐటీసీ ముద్రను ఈ కొత్త కొనుగోలు మరింత బలోపేతం చేస్తుంది.


ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌: 2022 డిసెంబర్‌ త్రైమాసికం ఫలితాల్లో ఈ కంపెనీ నిరుత్సాహపరిచింది. కంపెనీ నికర లాభం గత ఏడాది ఇదే త్రైమాసికం కంటే 29% (YoY) పడిపోయి 220.63 కోట్లుగా నమోదైంది. నికర ప్రీమియం ఆదాయం 4.3% YoY వృద్ధితో రూ. 9,465 కోట్లకు చేరింది.


రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌: రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ విభాగమైన జియో ఇన్ఫోకామ్‌, దేశంలోని మరో 16 నగరాల్లో 5G వైర్‌లెస్‌ సర్వీసులను ప్రారంభించింది. ఈ 16 నగరాలతో కలిసి, రిలయన్స్‌ జియో 5G సర్వీసులు ఉన్న నగరాల సంఖ్య 134కు చేరింది.


రైల్‌ వికాస్‌ నిగమ్‌ లిమిటెడ్‌: గుజరాత్‌లో రెండు మెట్రో ప్రాజెక్టులకు వేసిన బిడ్స్‌లో 'రైల్‌ వికాస్‌ నిగమ్‌ - సైమెన్స్‌ ఇండియా కన్సార్టియం' లోయస్ట్‌ బిడ్డర్‌గా నిలిచింది. ఆ ప్రాజెక్టులు.. రూ. 673 కోట్ల విలువైన సూరత్‌ మెట్రో రైల్‌ ప్రాజెక్ట్‌ ఫేస్‌-1, , రూ. 380 కోట్ల విలువైన అహ్మదాబాద్‌ మెట్రో రైల్‌ ప్రాజెక్ట్‌ ఫేజ్‌- 2.


టాటా ఇన్వెస్ట్‌మెంట్‌ కార్పొరేషన్‌: 2022 డిసెంబర్‌ త్రైమాసికంలో ఈ కంపెనీ నికర లాభం 59.5% YoY తగ్గి రూ. 14.8 కోట్లకు చేరింది. ఆదాయం కూడా 53% YoY పడిపోయి రూ. 24.8 కోట్లుగా నమోదైంది.


డెల్టా కార్ప్: డిసెంబర్ త్రైమాసికంలో కంపెనీ ఏకీకృత నికర లాభం 20.5% YoY పెరిగి రూ. 84.8 కోట్లకు చేరుకోగా, ఆదాయం దాదాపు 11% YoY పెరిగి రూ. 273.4 కోట్లకు చేరుకుంది.


గ్లెన్‌మార్క్ ఫార్మాస్యూటికల్స్: భారత్‌, నేపాల్‌లోని 9 డెర్మటాలజీ బ్రాండ్‌లను ఎరిస్ లైఫ్‌సైన్సెస్ లిమిటెడ్‌కు (Eris Lifesciences Ltd) రూ. 340 కోట్లకు ఈ డ్రగ్‌ మేకర్‌ విక్రయించింది. ఎరిస్ లైఫ్‌సైన్సెస్ ఆర్మ్ ఎరిస్ ఓక్‌నెట్ హెల్త్‌కేర్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ 9 బ్రాండ్‌లను కొనుగోలు చేసింది. ఈ 9 బ్రాండ్‌లు FY22లో రూ. 87.3 కోట్ల అమ్మకాలను కలిగి ఉన్నాయి.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.