టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ సరికొత్త సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. 'వెళ్లిపోమాకే', 'ఈ నగరానికి ఏమైంది', 'ఫలక్ నుమా దాస్', 'హిట్', 'పాగల్' వంటి సినిమాల్లో నటించిన ఈ హీరో ప్రస్తుతం 'అశోకవనంలో అర్జున కళ్యాణం' అనే సినిమాలో నటిస్తున్నారు. ఇందులో అర్జున్ అనే వడ్డీ వ్యాపారిగా కనిపించనున్నారు విశ్వక్ సేన్. విద్యా సాగర్ చింతా దర్శకత్వం వహిస్తున్నారు. ప్రముఖ నిర్మాత బీవీఎస్ఎన్‌ ప్రసాద్ సమర్పణలో.. ఎస్‌విసిసి డిజిటల్ పతాకంపై ఆయన తనయుడు బాపినీడు, సుధీర్ ఈదర సంయుక్తంగా నిర్మిస్తున్నారు.


మూడు పదుల వయసు వచ్చినా.. పెళ్లి కాని ఓ అబ్బాయి కథాంశంతో ఈ సినిమా రూపొందుతోంది. 'రాజావారు రాణీగారు' ఫేమ్ రవికిరణ్ కోలా కథ అందిస్తున్నారు. ముందుగా ఈ సినిమాను మార్చి 4న విడుదల చేయాలనుకున్నారు. ఆ తరువాత ఏప్రిల్ 22కి వాయిదా వేశారు. ఇప్పుడు మరో కొత్త డేట్ ను అనౌన్స్ చేసింది చిత్రబృందం. మే 6న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. 


ఇప్పటికే ఈ సినిమా నుంచి కొన్ని పాటలను, టీజర్ ను విడుదల చేశారు. యూత్ ని టార్గెట్ చేసుకొని ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. మరి ఆశించినట్లుగా ప్రేక్షకులను మెప్పించగలరో లేదో చూడాలి.  జై క్రిష్ ఈ సినిమాకు సంగీతం సమకూరుస్తున్నారు. ప‌వి కె.ప‌వ‌న్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్న ఈ చిత్రానికి విప్ల‌వ్ ఎడిట‌ర్‌. ఈ సినిమా కాకుండా విశ్వక్ సేన్ చాలా సినిమాల్లో నటిస్తున్నారు. దాదాపు ఆయన చేతుల్లో నాలుగు సినిమాల వరకు ఉన్నాయి.  


Also Read: సెట్స్ లో చూసుకుందాం - రామ్ చరణ్ కి చిరు వార్నింగ్