హీరో విశాల్ రూటే సపరేటు! ఒకవైపు కమర్షియల్ అంశాలతో కూడిన కాన్సెప్ట్ బేస్డ్ సినిమాలు చేస్తూ ఉంటారు. మరోవైపు పక్కా రూరల్ మాస్ ఎంటర్టైనర్స్ కూడా చేస్తుంటారు. 'అభిమన్యుడు' వంటి టెక్నో థ్రిల్లర్ చేసిన విశాల్... 'పందెం కోడి' వంటి రూరల్ మాస్ సినిమా చేశారు. 'డిటెక్టివ్' వంటి ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ చేసిన విశాల్... 'పూజ' లాంటి కమర్షియల్ ఫిల్మ్ చేశారు. 'పూజ', సూర్య 'సింగం' సిరీస్ తీసిన హరి దర్శకత్వంలో విశాల్ కొత్త సినిమా చేస్తున్నారు. ఆ సినిమా టైటిల్ 'రత్నం'.   


గత ఏడాది 'మార్క్ ఆంటోనీ' సినిమాతో తమిళనాడులో భారీ విజయం అందుకున్న విశాల్... ఈ ఏడాది 'రత్నం' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. 


వేసవిలో విశాల్ 'రత్నం' విడుదల
విశాల్ కథానాయకుడిగా దర్శకుడు హరి తెరకెక్కిస్తున్న సినిమా 'రత్నం' (Rathnam Movie). స్టోన్ బెంచ్ ఫిల్మ్స్, జీ స్టూడియోస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ చిత్రానికి కళ్యాణ్ సుబ్రహ్మణ్యం, అలంకార్ ప్యాండన్ సహ నిర్మాతలు. ఈ చిత్రాన్ని వేసవిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు చిత్ర బృందం పేర్కొంది. త్వరలో విడుదల తేదీ వెల్లడించాలని భావిస్తున్నారు. ఈ సినిమాతో మాస్ హిట్ మీద విశాల్ కన్నేశారు.


Also Readకంగువా కథలో ట్విస్ట్ - సెకండ్ లుక్‌తో కాన్సెప్ట్ రివీల్ చేశారుగా



'రత్నం' ప్రచార చిత్రాలు చూశారా?
కొన్ని రోజుల క్రితం 'రత్నం' టైటిల్ / ఫస్ట్ షాట్ టీజర్ విడుదల చేశారు. వరుసగా కొన్ని ట్రక్కులు వస్తాయి. వాటిలో ఓ ట్రక్ నుంచి దిగిన విశాల్ కొంచెం ముందుకు నడుస్తారు. పల్లెటూరుల్లో, పొలిమేరల్లో పోతురాజు విగ్రహాలు ఉన్నాయి. ఆ విగ్రహాల ముందు ఓ వ్యక్తి మోకాళ్ళ మీద కూర్చుని ఉన్నాడు. అక్కడ ఉన్న కత్తుల్లో ఓ కత్తి తీసుకుని అతడి తల నరికేశారు విశాల్. టైటిల్ టీజర్ ఇంపాక్ట్ క్రియేట్ చేయడం వెనుక... రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ నేపథ్య సంగీతం కీలక పాత్ర పోషించింది. రత్నం అంటే రక్తం అనే విధంగా పూనకాలు వచ్చేలా దేవి శ్రీ ఆర్ఆర్ కొట్టారు.


విశాల్ జోడీగా 'దూత' ఫేమ్ ప్రియా భవానీ శంకర్!
'రత్నం' సినిమాలో విశాల్ సరసన ప్రియా భవానీ శంకర్ నటించారు. అక్కినేని నాగ చైతన్య భర్తగా 'దూత' వెబ్ సిరీస్‌లో కూడా ఆమె నటించారు. తల నరికిన తర్వాత వచ్చిన రక్తంతో టైటిల్ పేరు రావడం, ఆ రక్తమే రత్నం అనే టైటిల్‌గా మారడం మాస్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంది.


Also Read: హాఫ్ సెంచరీ కొట్టిన ‘అయాలన్’ - ధనుష్‌ను వెనక్కి నెట్టిన శివకార్తికేయన్!


విశాల్, ప్రియా భవానీ శంకర్ జంటగా నటిస్తున్న ఈ సినిమాలో సముద్రఖని, యోగి బాబు, గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఇతర తారాగణం. ఈ చిత్రానికి కళా దర్శకుడు: పీ వీ బాలాజీ, కూర్పు: టీ ఎస్ జయ్, స్టంట్స్: కనల్ కన్నన్ - పీటర్ హెయిన్ - దిలిప్ సుబ్బరాయన్, విక్కీ, ఛాయాగ్రహణం: ఎం సుకుమార్, సంగీతం : దేవీ శ్రీ ప్రసాద్,  సహ నిర్మాతలు: కళ్యాణ్ సుబ్రహ్మణ్యం, అలంకార్ పాండ్యన్, కథ - కథనం- దర్శకత్వం: హరి.