పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీఎంట్రీతో వరుస సినిమాలు చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది 'వకీల్ సాబ్'తో ప్రేక్షకులను అలరించిన పవన్ కళ్యాణ్ ప్రస్తుతం 'అయ్యప్పనుమ్ కోశియుమ్' రీమేక్ లో నటిస్తున్నారు. అలానే క్రిష్ దర్శకత్వంలో 'హరిహర వీరమల్లు' సినిమా చేస్తున్నారు. అలానే హరీష్ శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా కమిట్ అయ్యారు. పవన్ సినిమాల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Also Read : Aditi Rao Hydari Pics: అందాల అదితి.. క్లీవేజ్ షోతో రచ్చ చేస్తోంది..
రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా పవన్ కి అభిమానులు ఉన్నారు. పవన్ సినిమాల్లో చెప్పే డైలాగ్స్ కి మంచి క్రేజ్ ఉంది. వాటిల్లో కొన్ని డైలాగ్స్ ని ప్రేక్షకులు ఎప్పటికీ మర్చిపోలేరు. అందులో ఒకటే 'గబ్బర్ సింగ్' డైలాగ్. అదేంటంటే.. 'నాక్కొంచెం తిక్కుంది.. దానికో లెక్కుంది'. ఈ డైలాగ్ ఎంత పాపులర్ అయిందో తెలిసిందే. ఈ డైలాగ్ చెబుతున్నప్పుడు పవన్ స్టైల్ కి, మేనరిజమ్స్ కి ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు.
Also Read : Tollywood Drug Case : ఏడు గంటల పాటు రానాను విచారించిన ఈడీ.. కెల్విన్ ఎవరో తెలియదన్న రానా..
ఇప్పుడు ఈ డైలాగ్ గురించి స్పెషల్ గా ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే.. మన టీమిండియా మాజీ బ్యాట్స్ మెన్ వీరేందర్ సెహ్వాగ్.. పవన్ కళ్యాణ్ చెప్పిన ఇదే డైలాగ్ ను ఇమిటేట్ చేస్తూ చెప్పాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఈ వీడియో ఎప్పటిదనే విషయంలో క్లారిటీ లేదు. సోషల్ మీడియాలో మాత్రం తెగ చక్కర్లు కొడుతోంది. సెహ్వాగ్ చెప్పిన డైలాగ్ తీరు అభిమానులనే కాదు.. సెలబ్రిటీలను కూడా ఫిదా చేస్తుంది.