2017లో టాలీవుడ్ డ్రగ్స్ కేసులో 30 మందికి పైగా అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. అందులో కీలకంగా కెల్విన్, వహీద్, ఖుద్దూస్, జీషాన్ లను గతంలోనే విచారించి వారి బ్యాంక్ ఖాతాలను ఈడీ పరిశీలించింది. వీరి బ్యాంక్ అకౌంట్స్ నుంచి విదేశాలకు భారీగా డబ్బు వెళ్లినట్లు ఈడీ అధికారులకు ఆధారాలు లభించాయి. అంతేకాదు.. సినీ తారల బ్యాన్ అకౌంట్స్ నుండి కెల్విన్, ఖుధూస్, వహీద్, జీషాన్ ల అకౌంట్స్ మధ్య లావాదేవీలు జరిగినట్లు కూడా తేలింది. కెల్విన్ కాల్ డేటా.. అతని బ్యాంక్ స్టేట్మెంట్స్ ను బట్టి సెలబ్రిటీలకు నోటీసులు పంపించింది ఈడీ.


Also Read : Movie Tickets : మూవీ టికెట్ల కోసం స్పెషల్ వెబ్ సైట్.. జీవో జారీ చేసిన ఏపీ ప్రభుత్వం


అధికారులు ఇచ్చిన నోటీసుల ప్రకారం విచారణకు హాజరైన సెలబ్రిటీల నుంచి పూర్తి వివరాలు రాబట్టడానికి ప్రయత్నిస్తోంది ఈడీ. బుధవారం నాడు రానాను ఈడీ అధికారులు విచారించారు. దాదాపు ఏడు గంటల పాటు ఈ విచారణ కొనసాగింది. ప్రధాన నిందితుడు కెల్విన్ తో లావాదేవీల గురించి రానాను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా తనకు కెల్విన్ ఎవరో తెలియదని రానా చెప్పినట్లు సమాచారం. 


Also Read : Ranveer Singh RC15 movie launch: రెండు పిలకలతో రణ్‌వీర్ సింగ్.. రామ్ చరణ్ RC15 ప్రారంభోత్సవంలో సందడి


అయితే మనీ లాండరింగ్ కోణంలో రానా బ్యాంక్ ఖాతాలను కూడా అధికారులు పరిశీలించి.. అనుమానాస్పద లావాదేవీల గురించి అడిగి తెలుసుకున్నారు. 'ఎఫ్' క్లబ్ విషయమై రానాను పలు ప్రశ్నలు అడిగినట్లు తెలుస్తోంది. ఇప్పటికే  డ్రగ్స్ విక్రేత కెల్విన్‌తో పాటు సినీ ప్రముఖులు పూరీ, ఛార్మి, రకుల్‌, నందులను విచారించిన ఈడీ త్వరలోనే మరింతమంది సెలబ్రిటీలను విచారించనున్నారు.