భిమాని ఓవరాక్షన్ హీరోయిన్ కు చిర్రెత్తేలా చేసింది. అందరి ముందే చెంప చెల్లుమనిపించింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఘటన కేరళలోని ఓ మాల్ లో ఏర్పాటు చేసిన  సినిమా ప్రమోషన్ వేడుకలో జరిగింది. ప్రస్తుతం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు,వేధింపులకు గురి చేసిన వారిని పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.






ప్రముఖ మలయాళ నటీమణులు సానియా అయ్యప్పన్‌, గ్రేస్‌ ఆంటోని ప్రధాన పాత్రల్లో నటించిన సినమా ‘సాటర్‌ డే నైట్‌’. ఇప్పటికే అన్ని పనులు పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు. అందులో భాగంగానే  ఓ మాల్ లో ప్రమోషన్‌ ఈవెంట్‌ నిర్వహించారు. ఈ వేడుకల్లో సానియా, గ్రేస్ పాల్గొన్నారు. భారీగా తరలి వచ్చిన అభిమానుల నడుమ ప్రమోషన్ ఈవెంట్ నిర్వహించారు.  


వేడుక పూర్తయ్యాక సానియా, గ్రేస్‌ ఆంటోని మాల్‌ నుంచి బయటకు వస్తున్న క్రమంలో అభిమానులు దూసుకొచ్చారు. గుంపులో ఉన్న కొంత మంది వారి పట్ల అసభ్యంగా ప్రవర్తించారు. ఓ వ్యక్తి వారి ఒంటి మీద చెయ్యి వేశాడు. వెంటనే ఆగ్రహం వ్యక్తం చేసిన సానియా వెనక్కి తిరిగి అతడి చెంప మీ లాగి పెట్టికొట్టింది.  ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ తర్వాత సానియా సోషల్‌ మీడియా వేదికగా ఈ సంఘటనపై  సీరియస్ అయ్యింది.  “నేను, మూవీ యూనిట్‌ కలిసి ’’సాటర్‌డే నైట్‌’ ప్రమోషన్స్‌ కోసం కాళికట్‌లోని మాల్‌కు వెళ్లాం. అక్కడికి వచ్చి మాపై చూపించిన అభిమానానికి ధన్యవాదాలు”అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చింది.  


ఈ పోస్టుకు కొనసాగింపుగా మరో పోస్టు పెట్టింది. “ఈ సందర్భంగా మాల్‌ అంతా అభిమానులతో కిక్కిరిసిపోయింది. వారందరిని అదుపు చేసేందుకు బాడిగార్డ్స్‌ చాలా ఇబ్బంది పడ్డారు. ఈవెంట్‌ ముగిసిన అనంతరం నేను, నా కోస్టార్‌ గ్రేస్‌ బయటకు వస్తున్న క్రమంలో కొందరు మా పట్ల అసభ్యంగా ప్రవర్తించారు. ఓ వ్యక్తి నా కోస్టార్‌పై చేయి వేశాడు. నన్ను కూడా టచ్ చేశాడు. అందుకే నేను అలా రియాక్ట్ కావాల్సి వచ్చింది. ఇలాంటి పరిస్థితులు ఏ అమ్మాయికి ఎదురు కావద్దని కోరుకుంటున్నా. మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించే ఇలాంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుని కఠినంగా శిక్షించాలి’’ అని కోరింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. హీరోయిన్ల పట్ల దురుసుగా ప్రవర్తించిన వారిని గుర్తించే పనిలో ఉన్నారు.



Also Read : 'నేనే వస్తున్నా' రివ్యూ : ధనుష్ డబుల్ యాక్షన్ ఎలా ఉంది? హిట్టా ఫట్టా?



Also Read : 'బబ్లీ బౌన్సర్' రివ్యూ : తమన్నా బబ్లీగా ఉన్నారా? బౌన్సర్‌గా ఇరగదీశారా? సినిమా ఎలా ఉందంటే?