Vinay Rai And Vimala Raman To Tie The Knot Soon?: సినిమా పరిశ్రమలో చిత్ర విచిత్రాలు జరుగుతుంటాయి. హీరోలతో పోల్చితే హీరోయిన్లు ఎక్కువ కాలం ఇండస్ట్రీలో రాణించలేరు. అందం, అభినయంలో అదుర్స్ అనిపించినా, 10 ఏండ్ల పాటు హీరోయిన్ గా రాణిస్తారు. ఒక్కరో ఇద్దరు రెండు దశాబ్దాల పాటు కనిపిస్తారు. ఆ తర్వాత తెర మరుగు కావాల్సిందే. తెలుగు సినిమా పరిశ్రమలోకి ఎంతో మంది హీరోయిన్లు వస్తూనే ఉంటారు. వారిలో చాలా తక్కువ మంది ఎక్కువ కాలం ప్రేక్షకులను అలరిస్తూనే ఉంటారు. మరికొంత మంది ఇలా తళుక్కున మెరిసి అలా వెళ్లిపోతారు. అలాంటి హీరోయిన్లలో ఒకరు విమలా రామన్.   


వినయ్ రాయ్ తో ప్రేమాయణం, త్వరలో పెళ్లి!


ప్రస్తుతం విమలా రామన్ వయసు 41 ఏండ్లు. ఇంకా పెళ్లి చేసుకోలేదు. కానీ, కొంతకాలంగా నటుడు వినయ్ రాయ్ తో కలిసి ప్రేమలో ఉంది. ఈ విషయాన్ని ఇద్దరూ బయటకు చెప్పకపోయినా, కలిసి దిగిన ఫోటోలను సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకుంటున్నారు. ఈ ఫోటోల ద్వారా తాము ప్రేమలో ఉన్నామని చెప్పకనే చెప్తున్నారు. గత కొంతకాలంగా వీరిద్దరి పెళ్లి గురించి రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. ఎలాగూ చేతిలో సినిమాలు లేవు కాబట్టి పెళ్లి చేసుకోవాలని భావిస్తున్నట్లు ఊహాగానాలు వస్తున్నాయి. ఒకవేళ పెళ్లి చేసుకున్నా క్యారెక్టర్ ఆర్టిస్టుగా రాణించేందుకు పెద్దగా ఇబ్బంది ఉండదని ఆమె భావిస్తోందట. మొత్తంగా ఈ ఏడాదిలోనే విమలా, వినయ్ మూడు ముళ్ల బంధంతో ఒక్కటి కాబోతున్నట్లు తెలుస్తోంది.        


Also Read: తప్పు చేస్తే ప్రశ్నించే జర్నలిస్టుకు భయం ఎందుకు - థ్రిల్ ఇచ్చే నాగచైతన్య 'దూత' ట్రైలర్!



2009లో తెలుగు తెరకు పరిచమైన విమలా రామన్


నిజానికి విమలా రామన్ ఆస్ట్రేలియాలోనే పుట్టి పెరిగింది. 2004లో 'మిస్ ఇండియా ఆస్ట్రేలియా' విజేతగా నిలిచింది. క్లాసికల్ డ్యాన్స్ లో మంచి నైపుణ్యం ఉన్న విమలకు ఇండియన్ సినిమాలంటే చాలా ఇష్టం. ఇక్కడ సినిమా పరిశ్రమలోకి అడుగు పెట్టాలని చిన్నప్పటి నుంచే అనుకునేది. అలా 2009లో ‘ఎవరయినా ఎపుడైనా’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయం అయ్యింది. ఇందులో వరుణ్ సందేశ్ తో కలిసి హీరోయిన్ గా నటించింది. తొలి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. విమలా రామన్ కు స్టార్ హీరోయిన్ గా అయ్యే అవకాశాలు ఉన్నాయని అందరూ అనుకున్నారు. కానీ కథల ఎంపిక చేసిన తప్పిదాలు విమలా రామన్ కెరీర్ కు పెద్ద దెబ్బగా మిగిలాయి. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించిన అనుకున్న స్థాయిలో గుర్తింపు రాలేదు. ఆ తర్వాత పెద్దగా అవకాశాలు రాకపోవడంతో సైడ్ క్యారెక్టర్స్ కూడా చేసింది. నెమ్మదిగా సినిమా పరిశ్రమకు కొంతకాలం దూరం అయ్యింది.రీసెంట్ గా తెలుగులో ‘గాండీవధారి అర్జున’, ‘రుద్రాంగి’ సినిమాల్లో నటించింది విమలా రామన్. చక్కటి అభినయం కనబరిచినా అనుకున్న స్థాయిలో హిట్ అందుకోలేదు. తెలుగులోనే కాదు తమిళ్, మలయాళం, కన్నడ సినిమాల్లోనూ హీరోయిన్ గా చేసింది.






Read Also: ‘నెట్‌ఫ్లిక్స్’ నిర్ణయం కలచివేసింది, రెండుసార్లు గుండెపోటు వచ్చింది: అనురాగ్ కశ్యప్‌