Naga Chaitanya Birthday Special: అక్కినేని నాగ చైతన్య హీరోగా నటించిన ఓటీటీ ప్రాజెక్ట్ 'దూత'. ఇప్పటి వరకు వెండితెరపై సినిమాలతో అలరించిన ఆయన... ఫస్ట్ టైమ్ ఓ వెబ్ సిరీస్ చేశారు. ఈ రోజు ఆయన పుట్టినరోజు. ఈ సందర్భంగా 'దూత' ట్రైలర్ విడుదల చేశారు. అది ఎలా ఉందో మీరే చూడండి...  


తప్పు చేస్తే ప్రశ్నించే జర్నలిస్టుగా చైతూ!
'దూత'లో జర్నలిస్టు సాగర్ పాత్రలో నాగ చైతన్య నటించారు. ఆయన సమాచార్ దిన పత్రికలో చేస్తున్నారని ట్రైలర్ చూస్తే తెలుస్తోంది. ఓ రోడ్డు ప్రమాదం, తర్వాత వరుస హత్యలకు, జర్నలిస్ట్ సాగర్ మధ్య సంబంధం ఏమిటి? హత్య జరిగిన ప్రతి చోట న్యూస్ పేపర్ కటింగ్స్ ఎందుకు ఉన్నాయి? కథలో కార్టూన్ ఇంపార్టెన్స్ ఏంటి? అనేది సిరీస్ చూసి తెలుసుకోవాలి.  


Also Read: చిరంజీవి @ 'విశ్వంభర'... మెగా మాస్ ఫాంటసీ మొదలెట్టారోయ్!






Dhootha web series director: విక్రమ్ కె. కుమార్ దర్శకత్వంలో 'దూత' వెబ్ సిరీస్ రూపొందింది. ఆయనకు కూడా ఫస్ట్ వెబ్ సిరీస్ ఇది. నాచురల్ థ్రిల్లర్ జానర్‌లో తీశారు. ఇంతకు ముందు తమిళంలో ఆర్ మాధవన్ హీరోగా ఆయన దర్శకత్వం వహించిన '13బి' సినిమా కూడా థ్రిల్లరే. ఓటీటీ కోసం మరోసారి ఆ జానర్ ఎంపిక చేసుకున్నారు విక్రమ్. దీనిని శరత్ మరార్ నిర్మించారు.  


అమెజాన్ ప్రైమ్ వీడియోలో...
డిసెంబర్ 1 నుంచి 'దూత'
Dhoota digital streaming release date : అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ కోసం 'దూత' వెబ్ సిరీస్ చేశారు. ఇందులో నాగ చైతన్యది జర్నలిస్ట్ రోల్. ఇక, ఈ సిరీస్ మిగతా తారాగణం విషయానికి వస్తే... ముగ్గురు కథానాయికలు ఉన్నాయి. హిందీ హీరోయిన్ ప్రాచీ దేశాయ్, మలయాళంలో వైవిధ్యమైన సినిమాలతో 'బెంగళూరు డేస్' వంటి హిట్ సినిమా చేసిన పార్వతీ తోరువోతు, తమిళ హీరోయిన్ ప్రియా భవానీ శంకర్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.  


'దూత'లో అక్కినేని నాగ చైతన్య సరసన ప్రియా భవానీ శంకర్ నటించారని టాక్. సూపర్ నేచురల్ థ్రిల్లర్ అంశాలతో పాటు టైమ్ ట్రావెల్ నేపథ్యంలో విక్రమ్ కె. కుమార్ మాంచి స్క్రిప్ట్ రెడీ చేశారని, ఇందులో స్క్రీన్ ప్లే గ్రిప్పింగ్ గా ఉంటుందని టాక్. 


డిసెంబర్ 1 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో 'దూత' స్ట్రీమింగ్ కానుందని ఫస్ట్ లుక్ విడుదల చేసిన సందర్భంగా అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ పేర్కొంది. ఈ సిరీస్ తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషలలో విడుదల కానుంది. మొత్తం మూడు సీజన్స్ విడుదల చేయాలని ప్లాన్ చేశారట. ఒక్కో సీజన్ లో 8 లేదా 10 ఎపిసోడ్స్ ఉంటాయట. నాగ చైతన్య కూడా మరో సిరీస్ ఉంటుందని కన్ఫర్మ్ చేశారు. 


Also Readయోధుడిగా, అపర భక్తుడిగా విష్ణు మంచు - ఆయన బర్త్‌డే గిఫ్ట్, 'కన్నప్ప' ఫస్ట్ లుక్ చూశారా?



అక్కినేని నాగ చైతన్య, విక్రమ్ కె. కుమార్... ఇద్దరిదీ సూపర్ హిట్ కాంబినేషన్. వాళ్ళ కలయికలో వచ్చిన 'థాంక్యూ' ఆశించిన విజయం సాధించలేదు. కానీ, దాని కంటే ముందు 'మనం' వచ్చింది. అందులో అక్కినేని ఫ్యామిలీలో మూడు తరాలకు చెందిన హీరోలతో విక్రమ్ కె. కుమార్ చేసిన సినిమా క్లాసిక్ హిట్ అనిపించుకుంది.