నాలుగేళ్ల గ్యాప్ తరువాత కమల్ హాసన్ నటించిన  సినిమా ‘విక్రమ్’. బాక్సాఫీసును షేక్ చేస్తోంది ఈ సినిమా. ఇందులో ఫహద్ ఫాజిల్, విజయ్ సేతుపతి కూడా ప్రధాన పాత్రల్లో నటించారు. చివర్లో సూర్ ఎంట్రీతో సినిమాలో అదరగొట్టాడు. ఈ సినిమా తొలి రోజే రూ.45 కోట్లకు పైగా వసూలు చేసింది. ఇప్పటివరకు రూ.200 కోట్లకు పైగా వసూలు చేసింది. ఇంకా విజయవంతంగా దూసుకెళ్తోంది.ఈ సినిమాకు కమల్ హాజన్ ప్లస్ అనే చెప్పాలి. 67 ఏళ్ల వయసులో కూడా కుర్ర హీరోలకు ధీటుగా ఫైట్లు చేశారు కమల్. ఈ సినిమాను ఆయనే ఆర్ మహేంద్రన్ తో కలిసి నిర్మించారు. ఇక తెలుగులో హీరో నితిన్, సుధాకర రెడ్డి కలిసి విడుదల చేశారు. జూన్ 3న ఈ సినిమా థియేటర్లలోకి వచ్చింది. కాగా ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలో ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని చూస్తున్నారు అభిమానులు. 


ఏ ఓటీటీలో?
విక్రమ్ సినిమా డిజిటల్ హక్కులను గతంలోనే హాట్ స్టార్ సొంతం చేసుకుంది. సినిమా థియేటర్ నుంచి వెళ్లిపోయాక ఓటీటీలో విడుదల అవుతుంది. అంచనా ప్రకారం జూలై మొదటి వారంలో  ఓటీటీలోకి వచ్చే అవకాశం కనిపిస్తుంది. అధిక మొత్తానికి హాట్ స్టార్ కూడా సినిమాను సొంతం చేసుకున్నట్టు సమాచారం. రెండో పార్ట్ కూడా రాబోతోంది కాబట్టి ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగిపోయాయి. రెండో పార్ట్ కోసం సూర్య అభిమానులు ఎదురు చూస్తున్నారు. 








Also read: ఈ టీ షర్టు అంత ఖరీదా? కరీనా టేస్టు వరస్ట్ అంటూ నెటిజన్ల ట్రోలింగ్


Also read:  టాలీవుడ్‌ను పక్కన పెట్టిన నయన్ - తెలుగు సినీ ప్రముఖులకు శుభలేఖలు ఎక్కడ? పిలుపులేవీ?


Also read: ఆ కథ చెప్పి ‘కణ్మని’ని ప్రేమలో పడేశాడు, ఇదీ నయన్-విఘ్నేష్ లవ్ స్టోరీ