Vijaykrishna Naresh About His Bike Accident: యాక్టర్ నరేశ్.. పరిచయం అక్కర్లేని పేరు. విజయ నిర్మల కొడుకుగా ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు. హీరోగా ఎన్నో సినిమాలు చేశారు. సూపర్ హిట్ సినిమాలతో ప్రేక్షకులను అలరించారు ఆయన. ఇక ఆ తర్వాత ఎన్నో సినిమాల్లో అన్నగా, నాన్నగా, ఫ్రెండ్ గా చేసి మంచి పేరు తెచ్చుకున్నారు. అయితే, ఇటీవల మదర్స్ డే సందర్భంగా ఆయన తన తల్లిని గుర్తు చేసుకున్నారు. ఒక ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ సందర్భంగా తన ఇంటిలో ఉన్న వస్తువులు, ఫొటోలను చూపించారు నరేశ్. ఈసందర్భంగా ఆయన తన బైక్ ఫొటోల కలెక్షన్స్ చూపించారు. అప్పటి విశేషాలను గుర్తు చేసుకున్నారు నరేశ్.
యాక్సిడెంట్ గురించి చెప్పిన నరేశ్..
తన ఫొటోల కలెక్షన్ చూపించి నరేశ్ ఒక ఫొటో చూపిస్తూ తన యాక్సిడెంట్ గురించి చెప్పారు. మోటార్ సైకిల్ జంప్ చేశానని యాక్సిడెంట్ అయ్యిందని చెప్పుకొచ్చారు. "ఇది నా ఫస్ట్ మోటర్ సైకిల్ జంప్. ప్రేమ సంకెళ్లు సినిమాకి అమ్మ చేయించింది. చెన్నైలో చేశాను. హార్బర్ లో చేశాం. అప్పుడు బాగానే చేశాను. నమ్మకంనా మీద జంధ్యాల గారు కూడా చేయించారు. అలవాటు ఉంది. ఆ తర్వాత అదే ఫీట్ హైదరాబాద్ లో చేశాను. 20 ఫీట్ గాల్లో ఎగరగానే ఫెయింట్ అయిపోయాను. టైం అంటారు కదా.. మా అమ్మ నాతో చాలా జంప్ లు చేయించారు. కానీ, అది మాత్రం అలా అయ్యింది. 20 ఫీట్స్ నుంచి బండితో పాటు పడిపోయాను. కుడి వైపు మొత్తం దెబ్బలు. మూడు నెలలు హాస్పిటల్ లో ఉన్నాను. బతికి బయటికి వస్తాను అని అనుకోలేదు. ఇక అదే నాకు లాస్ట్ బైక్ జంప్. అందరూ తిట్టారు. కానీ, నేను లైఫ్ లోని ప్రతి విషయాన్ని చాలా ఎంజాయ్ చేస్తాను. అందరూ తిట్టారు కానీ, నేనేం పట్టించుకోలేదు. అదే నవీన్ కి కూడా వచ్చింది. చెన్నై నుంచి చాలా బైక్ లు తెప్పించాడు. అన్నీ అమ్మేశాను. కానీ, దొంగతనంగా ఒక బైక్ ని దాచుకున్నాడు. దాన్ని కూడా ఎప్పుడో తీసేస్తాను" అంటూ తన బైక్ యాక్సిడెంట్, తన కొడుకు గురించి చెప్పారు నరేశ్.
సాయి ధరమ్ తేజ్, ఇద్దరు ఫ్రెండ్స్..
"సాయి ధరమ్ తేజ్, మా అబ్బాయి చాలా మంచి ఫ్రెండ్స్. వండర్ ఫుల్ బాయ్. అందరూ మంచి పిల్లలు. క్లోజ్ గా ఉంటారు. పిల్లలంతా మా ఇంటి ముందు తిరిగి ఆడుకున్నారు. నవీన్ కి చిరంజీవి గారు మేకప్ వేశారు. మేమంతా నైబర్స్. చాలా క్లోజ్ గా ఉండేవాళ్లం. పవన్ కల్యాణ్ గారు కూడా చెప్పారు కదా. మేమంతా పక్కపక్కనే ఉంటామని. అందరం ఉండేవాళ్లం తెలుగు, తమిళం, కన్నడ అన్ని భాషల వాళ్లు ఒక వసుదైక కుటుంబంలా ఉండేవాళ్లం. కానీ, ఇప్పుడు ఎవరి దారి వాళ్లు వెళ్లిపోయారు" అంటూ అప్పటి విషయాలు గుర్తుచేసుకున్నారు.
Also Read: నా వ్యక్తిత్వాన్ని రక్షించండి, కోర్టును ఆశ్రయించిన జాకీ ష్రాఫ్ - ఆ సంస్థలకు హైకోర్టు నోటీసులు