Who Is Sharmin Segal: సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన ‘హీరామండి’ వెబ్ సిరీస్ ప్రస్తుతం టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారిపోయింది. నెట్‌ఫ్లిక్స్‌లో తాజాగా విడుదలయిన ఈ సిరీస్‌ను చూసిన సబ్‌స్క్రైబర్లు.. భన్సాలీపై తెగ ప్రశంసలు కురిపిస్తున్నారు. అంతే కాకుండా ఇందులో నటించిన ఆరుగురు నటీమణులు కూడా ‘హీరామండి’ హిట్‌లో కీలక పాత్రలు పోషించారు. అందులో అయిదుగురు హీరోయిన్స్ ఎవరో ప్రేక్షకులకు బాగా తెలుసు. కానీ అలామ్జేబ్‌గా నటించిన షర్మిన్ సెగల్ గురించి మాత్రం ఎక్కువమందికి తెలియదు. అసలు తను ఎవరో తెలుసుకున్న ఆడియన్స్ షాకవుతున్నారు.
విపరీతంగా నెగిటివిటీ..
‘హీరామండి’లో హీరోయిన్లుగా నటించిన ఆరుగురిలో షర్మిన్ సెగల్ నటన కాస్త తక్కువ ఇంపాక్ట్ క్రియేట్ చేసిందని చాలామంది ప్రేక్షకులు ఫీలయ్యారు. అదితి రావు, మనీషా కొయిరాల వంటి వారి నటనకు, షర్మిన్ నటనకు అసలు పోలికే లేదని ఫీలయ్యారు. అంతే కాకుండా మరికొందరు అయితే అసలు తనను ఈ సిరీస్‌లోకి ఎందుకు తీసుకున్నారు అని నెగిటివ్ కామెంట్స్ కూడా చేశారు. ఫైనల్‌గా షర్మిన్ సెగల్ ఎవరు అని సెర్చ్ చేయగా తను సంజయ్ లీలా భన్సాలీ బంధువు అని తెలిసింది. దీంతో అందుకే తనకు ‘హీరామండి’లో అవకాశం వచ్చిందని విమర్శలు పెరిగాయి. తన ఇన్‌స్టాగ్రామ్ పోస్టులకు పెరుగుతున్న నెగిటివిటీని చూసి ఆఖరికి కామెంట్స్ కూడా హైడ్‌లో పెట్టేసింది షర్మిన్.
భన్సాలీ కోడలు..
షర్మిన్ సెగల్.. 1995లో ఫిల్మ్ ఎగ్జిక్యూటివ్ దీపక్ సెగల్, ఫిల్మ్ ఎడిటర్ బేలా సెగల్‌కు జన్మించింది. ప్రస్తుతం షర్మిన్ తండ్రి బాలీవుడ్‌లో అతిపెద్ద ప్రొడక్షన్ హౌజ్‌లో ఒకటైన అప్లాస్ ఎంటర్‌టైన్మెంట్‌కు కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. తన తల్లి బేలా.. సంజయ్ లీలా భన్సాలీ డైరెక్ట్ చేసిన ‘ఖామోషీ, ‘దేవదాస్’, ‘బ్లాక్’ వంటి చిత్రాలకు ఎడిటర్‌గా పనిచేశారు. అంతే కాకుండా 2012లో విడుదలయిన ‘షిరిన్ ఫర్హాద్ కీ తో నికల్ పడీ’ మూవీని డైరెక్ట్ కూడా చేశారు. సంజయ్ లీలా భన్సాలీకి బేలా చెల్లెలు అవుతుందని తెలిసింది. అంటే షర్మిన్.. భన్సాలీకి మేనకోడలు అవుతుంది. షర్మిన్ సెగల్ తాతయ్య మోహన్ సెగల్ సైతం ఒకప్పుడు బాలీవుడ్‌లో కొన్ని సక్సెస్‌ఫుల్ సినిమాలను డైరెక్ట్ చేశారు.
వేల కోట్ల ఆస్తులు..
సంజయ్ లీలా భన్సాలీకి మాత్రమే కాదు.. షర్మిన్ సెగల్‌కు పలువురు బిజినెస్ ప్రముఖులు కూడా బంధువులే. తను బిజినెస్‌లో కోట్లు సంపాదించిన సమీర్ మెహ్తా కుమారుడు అయిన అమాన్‌ను పెళ్లి చేసుకుంది. అమన్ తండ్రి సమీర్‌తో పాటు తన సోదరుడు సుధీర్.. టోరెంట్ గ్రూప్‌ను స్థాపించారు. 2024లో జరిగిన సర్వే ప్రకారం సమీర్ మెహ్తా ఆస్తి ఏకంగా రూ.53,800 కోట్లు అని బయటపడింది. 18 ఏళ్లకే షర్మిన్.. బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన ‘రామ్‌లీలా’కు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసింది. ‘మలాల్’, ‘అతిథి భూతో భవ’లో హీరోయిన్‌గా కూడా నటించింది. ‘హీరామండి’తో ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చింది.