Bishnoi Community Demands If Salman Khan Apologises We Will Consider It: కొంతకాలంగా బాలీవుడ్‌ కండల వీరుడు సల్మాన్‌ ఖాన్‌ను కృష్ణ జింక కేసు వెంటాడుతున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో ఆయనకు గ్యాంగ్‌స్టర్‌ లారెన్స్‌ బిష్ణోయ్‌ నుంచి హత్యా బెదిరింపుల కూడా వచ్చాయి. అంతేకాదు పలుమార్లు ఇటీవల గ్యాంగస్టర్‌ లారెన్స్‌ గ్యాంగ్‌ మనుషులు ఆయన ఇంటిపై కాల్పుల కూడా జరిపారు. ఇక సల్మాన్‌ను ఎప్పటికైనా చంపేస్తామంటూ ఆ మధ్య లారెన్స్‌ బిష్ణోయ్‌ బహిరంగ హెచ్చరికలు కూడా చేశాడు. ఇక ఇటీవల ఆయన ఇంటి ముందు కాల్పులు కలకలం రేపాయి. దీంతో బాలీవుడ్‌ మొత్తం ఉలిక్కి పడింది. దీంతో సల్మాన్‌ మాజీ ప్రేయసి, పాకిస్తాన్‌ నటి సోమీ అలీ కూడా దీనిపై స్పందించింది.


సల్మాన్ తరపు ఎవరూ కమాపణలు చెప్పకూడదు


తన ప్రియుడి చంపోద్దని, అతడి తరపు తాను క్షమాపణలు చెబుతున్నానంటూ సోమి అలీ బిష్ణోయ్‌ కమ్యూనిటీని కోరింది. సోమీ అలీ విజ్ఞప్తిపై తాజాగా బిష్ణోయ్‌ కమ్యూనిటీ స్పందించింది. ఈ విషయంలో స్వయంగా సల్మాన్‌ ఖానే క్షమాపణలు చెప్పాలని తాజాగా ఆల్ ఇండియా బిష్ణోయ్ సోసైటీ అధ్యక్షుడు దేవేంద్ర బుడియా స్పష్టం చేసినట్టు బాలీవుడ్‌ మీడియా లైవ్‌ హిందూ పేర్కొంది. లైవ్‌ హిందూ కథనం ప్రకారం.. మా కమ్యూనిటీ కృష్ణ జింకను దైవంగా చూస్తాం. అలాంటి కృష్ణ జింకను తన వినోదం కోసం సల్మాన్‌ వేటాడి చంపాడు. ఈ కేసులో అతడు నిందితుడు అని తేలింది. అలాంటి వ్యక్తిని మా కమ్యూనిటీ ఎప్పటికీ క్షమించదు.


అయితే ఈ విషయంలో ఆయన మాజీ ప్రియురాలు సోమీ అలీ క్షమాపణలు కోరారు. కానీ ఆ తప్పు చేసింది ఆమె కాదు కదా. అతడి తరపున ఎవరూ క్షమాపణలు చెప్పకూడదు. సల్మాన్‌ ఖానే స్వయంగా క్షమాపణలు చెప్పాలి. అప్పుడు దానిపై మేము ఆలోచిస్తాం. సల్మాన్‌ గుడికి వచ్చి క్షమాపణలు చెప్పడమే కాదు. భవిష్యత్తులో మళ్లీ అలాంటి తప్పు చేయనని ప్రమాణం చేయాలి. అంతేకాదు పర్యావరణాన్ని కాపాడతానని ప్రతిజ్ఞ చేయాలి. అప్పుడే అతన్ని క్షమించే అంశాన్ని మా వర్గం పరిశీలిస్తుంది. ఎందుకంటే మా 29 నిబంధనలో క్షమాపణ కూడా ఒకటి. కాబట్టి ఈ విషయంలో సల్మాన్‌ ఖాన్‌ స్వయంగా క్షమాపణలు కోరాలి. అతడి తరపున ఎవరూ చెప్పిన దాన్ని మేము పరిగణించం" అంటూ డిమాండ్‌ చేశారు. మరి ఈ విషయంలో సల్మాన్‌ క్షమాపణలు చెబుతాడో లేదో చూడాలి. 


అసలేంటీ ఈ కృష్ణ జింక కేసు


కాగా 1999లో సల్మాన్‌ ఖాన్‌ నటించిన 'హమ్‌ హమ్ సాథ్‌ సాథ్‌' మూవీ షూటింగ్‌లో భాగంగా టీం 1998లో రాజస్థాన్‌ జోధ్‌పూర్‌ వెళ్లింది. అక్కడే సల్మాన్‌ జోధ్‌పూర్‌ జిల్లాలోని బవాద్‌లో కృష్ణజింకను వేటాడి చంపినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో సల్మాన్‌తో పాటు హీరోయిన్లు టబు, సోనాలి బింద్రేలపై కూడా కేసు నమోదైంది. ఇక 2018లో ఈ కేసుపై విచారణ జరగగా సల్మాన్‌ ఖాన్‌ దోషిగా తేలడంతో ఐదేళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది కోర్టు. అప్పుడే లారెన్స్‌ బిష్ణోయ్‌ కూడా సల్మాన్‌పై హత్యా బెదిరింపు కూడా చేశాడు. ఈ కేసులో శిక్ష పడినప్పటికి సల్మాన్‌ బెయిల్‌పై బయటకు వచ్చాడు. అప్పటి నుంచి సల్మాన్‌పై బిష్ణోయ్‌ కుటుంబం ఆగ్రహంతో ఉంది. ఈ క్రమంలోనే ఇటీవల ఆయన ఇంటిపై కాల్పులు జరుగగా ఆయన మాజీ ప్రియురాలు సోమీ అలీ స్పందించింది. 


Also Read: నా వ్యక్తిత్వాన్ని రక్షించండి, కోర్టును ఆశ్రయించిన జాకీ ష్రాఫ్‌ - ఆ సంస్థలకు హైకోర్టు నోటీసులు