Naga Sourya Mother Usha Mulpuri Emotional Words: నాగ శౌర్య.. ఎంతో అమ్మాయిల క్రష్. చాలా మంచి మంచి సినిమాలు చేశారు ఆయన. అయితే, శౌర్య నటించిన కొన్ని సినిమాలని ఆయన తల్లి ఉషా ముల్పూరి ప్రొడ్యూస్ చేశారు. కాగా.. ప్రస్తుతం రెస్టారెంట్ బిజినెస్ లో ఉన్నారు శౌర్య తల్లి. అయితే, తను ప్రొడ్యూసర్ గా ఎందుకు మారాల్సి వచ్చిందో ఆమె ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. తనకు చాలామంది డిస్ట్రిబ్యూటర్లు డబ్బులు ఇవ్వలేదని చెప్పారు ఉష. ఆమె ఏమన్నారో ఒకసారి చూద్దాం.
శౌర్య తలదించుకోవడం బాధేసింది..
తను ప్రొడ్యూసర్ అవ్వడానికి కారణం ఏంటి అని అడిగిన ప్రశ్నకి ఉషా ఈ విధంగా సమాధానం చెప్పారు. "అనుకోకుండా అలా అయిపోయింది. కావాలని ప్రొడ్యూసర్ అవ్వలేదు. 'ఛలో'కి వెంకీ డైరెక్టర్. వెంకీ 'ఛలో' తీసేకంటే రెండేళ్ల ముందు మా ఇంట్లో ఉండేవాడు. శౌర్య, వెంకీ ఇద్దరు 'ఛలో' కథ డెవలప్ చేసుకుంటే ఉండేవాళ్లు. నేను ప్రతి శుక్రవారం సినిమా చూసేదాన్ని. అలా అన్ని సినిమాలు చూశాను. అందుకే, సినిమా ఎలా ఉంటుంది. ఇలా అయ్యింటే బాగుండు. అలా జరిగుంటే బాగుండు అని మాట్లాడుకునే వాళ్లం. అందుకే, ఆంటీ నేను కథ రాస్తే మీకే చెప్తాను అనేవాడు. అలా కథ డెవలప్ చేశాడు. ఒక ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్తే.. ఆయన పెద్దగా రెస్పాండ్ అవ్వలేదు అంట. దాంతో శౌర్య వెళ్లి కథ బాగుంది. నాకు కాన్ఫిడెన్స్ ఉంది. రెమ్యునరేషన్ లేకుండా చేస్తాను అని చెప్పాడట. నాకు ఫోన్ చేసి ఇలా జరిగిందమ్మ అని అన్నాడు. నాకు అప్పుడు బాధేసింది. మనమే ప్రొడ్యూస్ చేద్దాం అన్నాను. ఒక మెట్టు దిగాడు అనిపించింది. బాధ వేసింది. నేను కథ వింటాను అమ్మ అన్నాను. విన్న తర్వాత ప్రొడ్యూస్ చేయాలని డిసైడ్ అయ్యి. మనమే తీద్దాం అన్నాను. మనకేం తెలీదు కదమ్మ అన్నాడు. కానీ, ఏదో ఒకటి మన మంచికే జరుగుతుంది అని చెప్పి ప్రొడ్యూస్ చేశాను" అని అన్నారు ఉషా.
డబ్బులు ఇవ్వలేదు..
ఆ టైంలో డబ్బులు వస్తాయా? పోతాయా? అని ఆలోచించలేదు. ఎందుకంటే అక్కడ నా కొడుకు వాళ్ల దగ్గర తలదించుకున్నాడు అనే ఫీలింగ్ మాత్రమే ఉంది. అనుకన్నదానికంటే ఎక్కువగానే మార్కెట్ అయ్యింది. అంతా మంచి జరిగింది. కానీ, డిస్ట్రిబ్యూటర్లు ఎవ్వరూ డబ్బులు ఇవ్వలేదు. అదే నర్తనశాల పోయింది కదా.. ఫస్ట్ షో తర్వాత వెంటనే వచ్చి ఆఫీస్ దగ్గర కూర్చున్నారు. అలా ఉంటుంది సినిమా ఫీల్డ్ లో అని తన ఎక్స్ పీరియెన్స్ గురించి చెప్పారు ఉష.
చాలా హ్యపీ..
రష్మిక తన కష్టంతోనే పైకి వచ్చింది. ఇప్పుడు కూడా అదే ఎనర్జిటిగ్ గా ఉంది. ప్రతి సినిమా ప్రమోషన్ లో అంతే చలాకీగా ఉంటుంది. నాకు ఇంత పేరు వచ్చింది కదా అని అనుకోదు. ప్రమోషన్స్ బాగా చేస్తుంది. మిగతా చాలా హీరోయిన్స్ ని చూస్తుంటాం ప్రమోషన్స్ కి రాము అది ఇది అంటారు. కానీ, తను మాత్రం అలా అనదు. తన కష్టం ద్వారా తను బాగా సక్సెస్ అయ్యింది. మాకు కూడా హ్యాపీగా అనిపిస్తుంది.. మా ద్వారా పరిచయం అయిన అమ్మాయి ఇంత స్థాయికి వెళ్లింది అని.