మలయాళ స్టార్ మమ్ముట్టి (Mammootty), లేడీ సూపర్ స్టార్ నయనతార (Nayanthara) జోడీకి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. వాళ్లిద్దరి కాంబినేషన్ సూపర్ డూపర్ హిట్. ఈ జోడీ మలయాళంలో ఇప్పటి వరకు నాలుగు సినిమాలు చేసింది. లేటెస్ట్ బజ్ ఏమిటంటే... మరో సినిమా చేసేందుకు రెడీ అవుతోందట. ఆ సినిమా వివరాల్లోకి వెళితే... 


గౌతమ్ మీనన్ దర్శకత్వంలో కొత్త సినిమా?
తెలుగు ప్రేక్షకులకు సైతం సుపరిచితుడైన కోలీవుడ్ డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్ (Gautham Vasudev Menon) ఉన్నారు కదా! నిజానికి ఆయన మలయాళీ. ఆయన తండ్రికి కేరళ, తల్లిది తమిళనాడు. అందువల్ల, రెండు భాషలు వచ్చు. చెన్నైలో పుట్టి పెరిగిన గౌతమ్ వాసుదేవ్ మీనన్, తమిళ సినిమాలతో దేశ వ్యాప్తంగా పేరు తెచ్చుకున్నారు. ఇప్పుడు ఆయన మాతృభాషాలో ఓ సినిమా చెయ్యాలని ప్లాన్ చేస్తున్నారు. 


Gautham Vasudev Menon First Malayalam Movie: గౌతమ్ వాసుదేవ్ మీనన్ తొలి మలయాళ సినిమాలో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి హీరోగా నటించనున్నారని కోలీవుడ్ టాక్. అందులో నయనతారను కథానాయికగా అనుకుంటున్నారట. 


మలయాళ సినిమా 'తస్కర వీర'లో మమ్ముట్టి, నయనతార జోడీ తొలిసారి యాక్ట్ చేసింది. ఆ తర్వాత 'రప్పకల్' చేశారు. ఆ తర్వాత చేసిన 'భాస్కర్ ది రాస్కెల్', 'పుతియా నియమం' సినిమాలు హిట్టే. గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో చేసే సినిమా ఐదోది అవుతుంది. తెలుగు, మలయాళ భాషల్లో ఈ సినిమాను తీసే ఆలోచనలో ఉన్నారట. 


మలయాళ సినిమాలు తగ్గించిన నయన్?
నయనతార కూడా మలయాళీనే. మాలీవుడ్ ఇండస్ట్రీలో ఆవిడ కెరీర్ స్టార్ట్ చేసింది. అక్కడ కొన్ని సినిమాల్లో హీరోయిన్ రోల్స్ చేశాక తమిళ ఇండస్ట్రీకి వచ్చింది. లేడీ సూపర్ స్టార్ అని బిరుదు తెచ్చుకుంది. తెలుగు, తమిళ భాషల్లో స్టార్ అవ్వడంతో మలయాళ సినిమాలు తగ్గించింది. మధ్య మధ్యలో కొన్ని చేసింది. వాటితో కంపేర్ చేస్తే... మమ్ముట్టి, గౌతమ్ వాసుదేవ్ మీనన్ ప్రాజెక్ట్ క్రేజీ మూవీ అని చెప్పాలి.


Also Read: రామ్ చరణ్ బ్రేక్ ఇచ్చింది ఒక్క రోజే, అదీ ఎన్నికల్లో ఓటు వెయ్యడానికి!


సాధారణంగా తన సినిమాలకు గౌతమ్ వాసుదేవ్ మీనన్ స్వయంగా కథలు రాస్తారు. కానీ, ఈ సినిమాకు దుల్కర్ సల్మాన్ హీరోగా నటించితిన్ 'ఏబీసీడీ - అమెరికన్ బార్న్ కన్ఫ్యూజ్డ్ దేశీ'కి వర్క్ చేసిన రైటర్స్ స్టోరీ ఇస్తున్నారట.


లాస్ట్ ఇయర్ నయనతారకు మెమరబుల్ ఇయర్ అని చెప్పాలి. హిందీ సినిమా ఇండస్ట్రీకి ఆవిడ ఇంట్రడ్యూస్ అయిన 'జవాన్' భారీ సక్సెస్ సాధించింది. ఇక, తమిళంలో నటించిన 'అన్నపూరణి : ది గాడెస్ ఆఫ్ ఫుడ్' విమర్శల కారణంగా నలుగురి నోళ్లలో నానింది. ఇప్పుడు 'డియర్ స్టూడెంట్స్' అనే మలయాళ మూవీలో నయన్ నటించింది. అది కాకుండా పాన్ ఇండియా సినిమా 'టెస్ట్' కూడా ఉంది. మమ్ముట్టి యాక్ట్ చేసిన 'టర్బో' ఈ నెల 23న థియేటర్లలో విడుదల కానుంది. మరి వీళ్లిద్దరి సినిమా ఎప్పుడు సెట్స్ మీదకు వస్తుందో? వెయిట్ అండ్ సి.


Also Readపాపం యాంకర్... పొలిటికల్ పబ్లిసిటీకి పోయి కెరీర్ రిస్క్ చేసిందా? ఇప్పుడు ఫీలైతే ఎలా?