Upasana About her Daughter Klin Kaara: మెగా కోడలు ఉపాసన గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. అపోలో వైస్ ప్రెసిడెంట్‌గా ఉన్న ఉపాసన పలు సామాజీవ సేవల్లో చురుకుగా పాల్గొంటారు. ఇటీవల కూతురు క్లింకారకు జన్మనిచ్చిన ఉపాసన ప్రస్తుతం మాతృత్వ క్షణాలను ఆస్వాధిస్తున్నారు. తల్లిగా క్లింకార ఆలపాలన చూసుకుంటున్నారు. అంతేకాదు తరచూ సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్‌గా ఉంటారు. అకేషన్ ఫోటోలతో పాటు తన వ్యక్తిగత విషయాలను పంచుకునే ఉపాసన తాజాగా ఓ ఇంటర్య్వూలో ఆసక్తికర విషయాలు చెప్పారు. ఉపాసన అపోలో వ్యవహరాలతో బిజీగా ఉన్నారు. ఇటూ చరణ్ సినిమాలతో బిజీగా ఉన్నారు. వారి వారి బిజీ షెడ్యూల్లో తరచూ దూరప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. ఇక తరచూ వారి వెంట క్లింకారను తీసుకువెళ్లడమంటే కుదరని పని.
తనకంటే మేం ఎక్కువ ఏడుస్తాం
మరి నెలల వయసు ఉన్న క్లింకారను ఇంట్లో వదిలి వెళ్లడమంటే తల్లిదండ్రులగా వారి అది సవాలనే చెప్పాలి. ఇదే విషయంపై ఉపాసన తాజా ఇంటర్య్వూలో స్పందిస్తూ ఎమోషనల్ అయ్యారు. వెకేషన్స్ అయితే క్లింకారను మాతో తీసుకువెళతాం. కానీ, ప్రొఫెషనల్ వర్క్ కోసం మేం తరచూ ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సి ఉంటుంది. అప్పుడు క్లింకారను మాతో తీసుకువెళ్లడం కుదరదు. అలాంటప్పుడు తనని ఒంటరిగా ఇంట్లోనే వదిలి వెళ్లాల్సి వస్తుంది. అది తప్పదు. అప్పుడు నాకు, చరణ్‌కి చాలా బాధగా ఉంటుంది. తనన అలా వదిలి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చినప్పుడల్లా క్లింకార కంటే మేము ఎక్కువగా ఏడుస్తాం. తనని అలా ఒంటరిగా వదిలి వెళ్లాలంటే చాలా బాధగా ఉంటుంది. నిజంగా ఆ సమయం మాకు ఓ పరీక్షలా ఉంటుంది" అంటూ ఉపాసన ఎమోషనల్ అయ్యారు.
చరణ్ నా బెస్ట్ థెరపిస్ట్
అనంతరం ఆమె మాట్లాడుతూ.. అందరిలాగే నేను కూడా డెలివరి తర్వాత డిప్రెషన్‌కి వెళ్లానని చెప్పారు. "తల్లిగా క్లింకార నన్ను చాలా ప్రత్యేకం మార్చింది. నిజంగా ప్రతి మహిళకు తల్లి కావడమన్నది ఒక అద్భుతమైన ప్రయాణం. కానీ గర్భం దాల్చిన నుంచి బిడ్డకు జన్మనిచ్చే వరకు ఎన్నో సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఒక భార్య తల్లిగా మారే సమయంలో తనకి భర్త సపోర్టు చాలా అవసరం ఉంటుంది. డెలివరి తర్వాత మహిళలు తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారు. నేను కూడా పోస్ట్‌పార్టమ్ డిప్రెషన్‌కి వెళ్లాను. ఆ టైంలో చరణ్ నా థెరపిస్ట్. ప్రతి క్షణం నాతో ఉన్నారు. నా అండగా నాతో పాటు మా పుట్టింటికి కూడా వచ్చేవాడు. మహిళందరికి విషయంలో ఇలా జరగదు. ఈ విషయంలో నేను చాలా అదృష్టవంతురాలి. నేను తల్లిగా ఎదుగుతున్న దశను చరణ్ మరింత సుసంపన్నం చేశాడు. అలాగే క్లింకార విషయం చరణ్ మరింత శ్రద్ధగా ఉంటాడు. తనపై చూపించే కేరింగ్, ప్రేమ చూస్తుంటే నాకు ముచ్చటేస్తుంది. ఇక క్లింకార కూడా చాలా విషయాల్లో తన తండ్రిన తలపిస్తుంది. తన ఆహారపు అలవాట్లు అచ్చం చరణ్‌లా ఉంటాయి. ఇక చరణ్ చూడగానే క్లింకార ముఖం వెలిగిపోతుంది. అప్పుడు నాకు కాస్తా జలస్‌గా ఉంటుంది" అంటూ చెప్పుకొచ్చింది.