Vijayendra Prasad About Mahesh Babu-Rajamouli’s Movie story: దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి, టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబోలో రూపొందబోతున్న ప్రతిష్టాత్మక చిత్రం SSMB29. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన గ్రౌండ్ వర్క్ కొనసాగుతోంది. ‘RRR’ లాంటి ప్రతిష్టాత్మక చిత్రం తర్వాత రాజమౌళి ఈ పాజెక్టును చేపట్టగా, ఈ మూవీతో మహేష్ బాబు పాన్ ఇండియన్ హీరోగా మారబోతున్నారు. ఈ నేపథ్యంలో SSMB29 భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రానికి రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ కథ రాస్తున్నారు. తాజాగా ఈ మూవీ స్టోరీ  గురించి ఆయన పలు కీలక విషయాలు వెల్లడించారు.   


SSMB29 టైటిల్ ఇంకా ఫిక్స్ కాలేదు- విజయేంద్ర ప్రసాద్


వాస్తవానికి ఈ సినిమా కథ కోసం కొద్ది నెలలుగా వర్కౌట్ నడుస్తోంది. దాదాపు ఈ సినిమా స్క్రిప్ట్ పూర్తయ్యిందన్నారు. ఈ సినిమా ఇండియానా జోన్స్ త‌ర‌హా అడ్వెంచ‌ర‌స్ మూవీగా ఉండబోతోందని దర్శకుడు రాజ‌మౌళి ఇప్ప‌టికే వెల్లడించారు. ఇదే విషయాన్ని రచయిత విజ‌యేంద్ర ప్ర‌సాద్ ధృవీకరించారు. మ‌హేష్ – రాజ‌మౌళి సినిమాలో ఇండియానా జోన్స్‌ తో పాటు  ‘రైడ‌ర్స్ ఆఫ్ ద లాస్ట్ ఆర్క్’ లక్షణాలు కూడా ఉండబోతున్నాయన్నారు. ఈ సినిమాలో కావాల్సినంత థ్రిల్‌, అంతకు మించి ఎమోష‌న్ ఉంటుందన్నారు. అయితే, ఈ ప్రాజెక్ట్‌ కు ఇంకా టైటిల్‌ ఫిక్స్ చేయలేదన్నారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా కథ ఎక్కువగా ఫారెస్ట్ బ్యాగ్రౌండ్ లో కొనసాగుతుందన్నారు. అలాగని పీరియాడికల్‌ మూవీ కాదన్నారు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన మ్యూజిక్ గురించి చర్చలు జరుగుతున్నట్లు వెల్లడించారు. ఈ సినిమాతో మహేష్ బాబు ఇమేజ్‌ ఓ రేంజిలో పెరగబోతుందన్నారు.


మహేష్ బాబు బర్త్ డే సందర్భంగా షూటింగ్ ప్రారంభం?


అటు SSMB29 సినిమా క్లైమాక్స్ గురించి కూడా ఇప్పటికే విజయేంద్ర ప్రసాద్ ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఈ సినిమా క్లైమాక్స్ లో కథను ముగించకుండా వదిలేయనున్నట్లు తెలిపారు. అలా వదిలేయడం వల్ల సీక్వెల్ కు ఉపయోగపడుతుందన్నారు. ఈ నేపథ్యంలో SSMB29 చిత్రానికి కచ్చితంగా సీక్వెల్ ఉంటుందని ఆయన క్లారిటీ ఇచ్చేశారు. ఇక ఈ సినిమా షూటింగ్ ను మ‌హేష్ బాబు పుట్టిన రోజు అయిన ఆగ‌స్టు 9న మొదలు పెడతారని తెలుస్తోంది. రెగ్యులర్ షూటింగ్ 2024 సమ్మర్ నుంచి నుంచి షురూ కావచ్చని విజయేంద్ర ప్రసాద్ వెల్లడించారు. ఈ చిత్రంలో విలువైన వస్తువుల అన్వేషణలో మహేష్ బాబు గ్లోబల్ ట్రాటింగ్ ఎక్స్‌ ప్లోరర్‌గా కనిపించనున్నట్లు తెలుస్తోంది. ‘ఇండియానా జోన్స్‘ సిరీస్ ఛాయలతో పాటు భారతీయ సంస్కృతి, పురాణాలు, చరిత్రలో లోతుగా పాతుకుపోయిన కథతో ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నట్లు సమాచారం. తొలి భాగం భారత్, ఆఫ్రికాలో మాత్రమే కాకుండా, వివిధ దేశాలలో షూట్ చేయనున్నట్లు సమాచారం. అయితే, ఈ సినిమా షూటింగ్ ఎంతకాలం పడుతుంది అనేది మాత్రం తెలియదు. ఇక మహేష్ బాబు రీసెంట్ గా నటించిన ‘గుంటూరు కారం‘ సినిమాకు మిశ్రమ స్పందన లభించింది.


Read Also: మా నాన్న ఏడుస్తున్నట్లు నటిస్తున్నాడు, అమీర్ ఖాన్ పై కూతురు ఐరా కామెంట్స్