ఇళయ దళపతి విజయ్ జోసెఫ్ హీరోగా దర్శకుడు లోకేష్ కనగ రాజ్ తో ఓ సాలిడ్ మూవీ చేస్తున్నారు. ‘లియో’ పేరుతో ఈ సినిమా తెరకెక్కుతోంది. ‘వారిసు’ బ్లాక్ బస్టర్ హిట్ తో తమిళ స్టార్ హీరో విజయ్ ఫుల్ జోష్ లో ఉండగా, ‘విక్రమ్’ సక్సెస్ తో దర్శకుడు లోకేష్ కనగరాజ్ మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. వీరిద్దరి కాంబోలో ‘లియో’ అనే సినిమా రూపొందుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ టాప్ హీరో సంజయ్ దత్ కీలక పాత్ర పోషిస్తున్నారు. హీరోయిన్ గా త్రిష నటిస్తుండగా, మరో కీలక పాత్రలో అర్జున్ కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. మిస్కిన్, జీవీఎమ్, ప్రియా ఆనంద్ సహా పలువురు ఈ చిత్రంలో నటించనున్నారు. అనిరుధ్ రవి చంద్రన్ సంగీతం అందిస్తున్న ‘లియో’ సినిమా అక్టోబర్ 19న ప్రేక్షకుల ముందుకు రానుంది.
వెంకట్ ప్రభుతో విజయ్ క్రేజీ మూవీ
‘లియో’ చిత్రంపై భారీ హైప్ ఉండగానే, తన తర్వాతి సినిమాకు సంబంధించి మరో క్రేజీ కాంబినేషన్ ని విజయ్ సెట్ చేసినట్టుగా టాక్ వచ్చింది. కోలీవుడ్ టాలెంటెడ్ దర్శకుడు వెంకట్ ప్రభుతో ఓ సినిమా చేస్తున్నట్లు ఊహాగానాలు వినిపించాయి. తాజాగా ఆ వార్తలు నిజమేనని తేలింది. వెంకట్ ప్రభుతో సినిమాను కన్ఫామ్ చేశారు విజయ్. ఈ విషయాన్ని చెప్తూ సాలిడ్ అప్డేట్ ని అందించారు. ఓ ఇంట్రెస్టింగ్ వీడియోతో ఈ కేజ్రీ కాంబినేషన్ ఉన్నట్టుగా అనౌన్స్ చేశారు. ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతం అందించనున్నారు. ఏ జి ఎస్ ఎంటర్టైన్మెంట్స్ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. ఈ మూవీ షూటింగ్ ఈ ఏడాది ఆగస్ట్ నుంచి మొదలు కానుంది. వచ్చే ఏడాది వేసవి కానుకగా ఈ సినిమా రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్రయత్నిస్తున్నారు.
డిజాస్టర్ గా మిగిలిన వెంకట్ ప్రభు రీసెంట్ మూవీ
రీసెంట్ గా వెంకట్ ప్రభు తెరకెక్కించిన కస్టడీ సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. నాగ చైతన్య హీరోగా ఆయన ఈ సినిమాను తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కించారు. పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస చిత్తూరి నిర్మించారు. కృతి శెట్టి హీరోయిన్‌గా నటించింది. అరవింద స్వామి, శరత్ కుమార్, ప్రియమణి కీలక పాత్రల్లో నటించారు. ఇళయరాజా, యువన్ శంకర్ రాజా సంగీతాన్ని అందించారు. కాగా, ఈ సినిమాకు అన్ని చోట్లా నెగెటివ్ టాక్ వచ్చింది. ఆశించిన రీతిలో రెస్పాన్స్ రాలేదు. ‘కస్టడీ’ చిత్రానికి మార్కెట్ లో పెద్ద హైప్ లేకపోవడం తో అడ్వాన్స్ బుకింగ్స్ అంతంత మాత్రంగానే జరిగాయి.
Read Also: తెలుగు చిత్రం ‘ID’కి దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు, ‘చార్లీ 777’ని వెనక్కి నెట్టి మరీ..