అర్జున్ రెడ్డి సినిమాతో అమ్మాయిలందరికీ లవర్ బాయ్ అయిపోయాడు విజయ్ దేవరకొండ. ఈ రౌడీ బాయ్ అంటే దేశవ్యాప్తంగా కూడా ఫుల్ ఫాలోయింగ్ ఉంది. తన క్యూట్ లవ్ స్టోరీ సినిమాలు, యాటిట్యూడ్ తో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. ఇప్పుడు తన ఫ్యాన్స్ కి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు. గతంలో చెప్పినట్టుగా 100 మంది ఫ్యాన్స్ ని "దేవరశాంత" కింద కులుమనాలి తీసుకెళ్తున్నట్టు చెప్పాడు. ఇప్పుడు వారి ప్రయాణం మొదలైపోయింది.


ఐదేళ్ల క్రితం "దేవరశాంత" పేరుతో విజయ్ దేవరకొండ తన అభిమానులకు గిఫ్ట్ లు ఇస్తూ వస్తున్నాడు. ఈ ఏడాది న్యూయర్ గిఫ్ట్ గా 100 మంది అభిమానుల్ని తన సొంత ఖర్చులతో ట్రిప్ కి తీసుకువెళ్తానని ప్రకటించాడు. అందుకోసం దేశవ్యాప్తంగా ఉన్న తన అభిమానులు రిజిస్ట్రర్ చేసుకోవాలని చెప్పాడు. ర్యాండమ్ గా వాళ్ళలో 100 మందిని సెలెక్ట్ చేశాడు. ఎక్కడికి వెళ్లాలనే నిర్ణయం కూడా వాళ్ళకి అప్పగించాడు. మౌంటెన్స్ ఆఫ్ ఇండియా, బీచెస్ ఆఫ్ ఇండియా, కల్చర్ ట్రిప్ ఆఫ్ ఇండియా, డిసెర్ట్స్ ఇన్ ఇండియా ఆప్షన్స్ ఇచ్చాడు. ఎక్కువ మంది అభిమానులు మౌంటెన్స్ ఆఫ్ ఇండియాకు ఓటింగ్ చేయడంతో కులుమనాలి వెళ్ళాలని డిసైడ్ అయ్యారు.


Also Read  'వినరో భాగ్యము విష్ణు కథ' రివ్యూ : కిరణ్ అబ్బవరానికి హిట్ వచ్చిందా? లేదా?  


ఇప్పుడు ఆ 100 మంది ట్రిప్ స్టార్ట్ అయ్యింది. ఈ విషయాన్ని తెలుపుతూ విజయ్ తన సోషల్ మీడియాలో వీడియోని పోస్ట్ చేశాడు. “ఈరోజు ఉదయం వాళ్ళు ఫ్లైట్ లో ఉన్న వీడియో నాకు పంపించారు. ట్రిప్ కోసం పర్వతాలకు బయలుదేరారు. దేశం నలుమూలల నుంచి 100 మంది రావడం చాలా సంతోషంగా ఉంది” అంటూ విజయ్ రాసుకొచ్చారు. తన అభిమానులతో పాటు విజయ్ కూడా ఈ ట్రిప్ లో పాల్గొంటాడు. ఐదు రోజుల పాటు ఈ ట్రిప్ సాగనుంది. ఫిబ్రవరి 17 నుంచి 20 వరకు అందరూ ఎంజాయ్ చేయనున్నారు. త్వరలోనే అభిమానులతో కలిసి గ్రూప్ వీడియో కాల్ చేసి మాట్లాడతానని చెప్పుకొచ్చారు.


దేవరశాంత స్టార్ట్ చేసిన మొదటి సంవత్సరం విజయ్ తన 50 మంది అభిమానులను హైదరాబాద్ లోని జవహర్ లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీని సందర్శించారు. వారికి ప్రత్యేక బహుమతులు కూడా అందించారు. తర్వాతి ఏడాది తన సోషల్ మీడియా అభిమనులందరినీ #DevaraSanta అనే హ్యాష్ ట్యాగ్ తో తమ కోరికలు ఎంతో చెప్పమని చెప్పాడు. వారిలో కనీసం 9-10 మంది ఆశలు ఏంటో తెలుసుకుని నెరవేరుస్తానని మాట ఇచ్చాడు. ఆ తర్వాత క్రిస్మస్ కానుకగా 100 మందిని ఎంపిక చేసి వారికి ఒక్కొక్కరికి రూ.10 వేలు అందజేస్తామని చెప్పాడు. ఇప్పుడు మరొక 100 మందిని మనాలి ట్రిప్ కి తీసుకుని వెళ్తున్నాడు.


Also Read ఫిల్మ్ సిటీలో చిరుత దాడి - ఆసుపత్రిలో అక్షయ్ కుమార్ సినిమా మేకప్ ఆర్టిస్ట్