టాలీవుడ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) నటించిన 'లైగర్'(Liger) సినిమా ఆగస్టు 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో ఈ సినిమా ప్రమోషన్స్ లో జోరుగా పాల్గొంటున్నారు విజయ్ అండ్ టీమ్. ఈ సినిమాను పాన్ ఇండియా లెవెల్లో విడుదల చేయబోతున్నారు. అయితే మెయిన్ ఫోకస్ తెలుగు, హిందీ భాషల మీదే. ఈ రెండు  భాషల్లో రిలీజ్ విషయంలో చిత్రబృందం భిన్నమైన వ్యూహాన్ని అనుసరించబోతుంది. 


తెలుగు వెర్షన్ అనుకున్నట్లే 25న ఉదయం థియేటర్లలోకి దిగుతుండగా.. హిందీ వెర్షన్ కి మాత్రం రెగ్యులర్ రెగ్యులర్ రిలీజ్ 26న ఉండబోతుంది. 25న రాత్రి సెకండ్ షోకు పెయిడ్ ప్రీమియర్లు వేయబోతున్నారు. తర్వాతి రోజు నుంచి రెగ్యులర్ షోలు నడుస్తాయి. ఒక రకంగా చెప్పాలంటే హిందీ వెర్షన్ ఒకరోజు లేటుగా రిలీజ్ అవుతున్నట్లే. 


బాలీవుడ్ సినిమాలకు శుక్రవారం సెంటిమెంట్ ఎక్కువ కాబట్టి ఇలా చేస్తున్నారని టాక్. అలానే ఇది మాస్ సినిమా కాబట్టి నెగెటివ్ రివ్యూలు వస్తాయేమో అనే డౌట్ తో కూడా ఇలా చేసుండొచ్చు. కానీ 'లైగర్' సినిమాకి బుధవారం రాత్రి నుంచే అమెరికాలో ప్రీమియర్స్ పడుతున్నాయి. అక్కడ ప్రీమియర్లు వేసి తెలుగు వెర్షన్‌కే అయినా టాక్ ముందే బయటకు వచ్చేస్తుంది. 


హిందీలో ఈ సినిమా భారీ ఎత్తున రిలీజ్ అవుతుంది. బాలీవుడ్ అగ్ర నిర్మాత కరణ్ జోహార్ నిర్మాణ భాగస్వామి కావడంతో హిందీలో దీనికి పెద్ద రిలీజే ఉండబోతుంది. తెలుగు రాష్ట్రాల్లో 'లైగర్'కు ఉదయం 7 గంటల నుంచే షోలు పడే ఛాన్స్ ఉంది.


 Liger movie to restart 5 shows trend: 'లైగర్' సినిమాకి మళ్లీ ఐదు షోలు పడే ఛాన్స్ ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో పది రోజుల పాటు ఈ సినిమాను ఐదు షోలు చొప్పున రన్ చేసుకోవడానికి అనుమతులు కోరబోతున్నారు. రెండు రాష్ట్రాల్లో ఈ ఐదు షోలకు అనుమతి దొరికేలానే ఉంది. అయితే థియేటర్లలో రీజనబుల్ రేట్లు పెడితేనే మంచి ఓపెనింగ్స్ వచ్చే ఛాన్స్ ఉంది. మల్టీప్లెక్స్ లో రూ.275కి బదులు రూ.200, సింగిల్ స్క్రీన్స్ లో రూ.150 చొప్పున టికెట్స్ అమ్మితే మాత్రం సినిమాకి మంచి రీచ్ ఉంటుంది. టాక్ బాగుంటే లాంగ్ రన్ కూడా ఉంటుంది. మరి టికెట్ రేట్ల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి!


విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తోన్న ఈ సినిమాలో అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తోంది. స్పోర్ట్స్ యాక్షన్ ప్రధానంగా సాగే ఈ సినిమాలో రమ్యకృష్ణ విజయ్ తల్లి పాత్రలో నటిస్తోంది. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకుని తెరకెక్కించారు. బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్ కీలకపాత్రలో నటించారు. ప్రముఖ బాలీవుడ్ దర్శక - నిర్మాత కరణ్ జోహార్‌కు చెందిన ప్రొడక్షన్ కంపెనీ ధర్మ ప్రొడక్షన్స్, పూరి కనెక్ట్స్ నిర్మించారు. ఈ సినిమాకు పూరి జగన్నాథ్, ఛార్మీ కౌర్, కరణ్ జోహర్, అపూర్వ మెహతా నిర్మాతలు.


Also Read : విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ రచ్చ షురూ - బాలీవుడ్ బాయ్‌కాట్ గ్యాంగ్‌కు దిమ్మ‌తిరిగే రియాక్షన్


Also Read : సిక్స్ ప్యాక్ చూపించడానికి రెడీ అవుతున్న మహేష్ బాబు!